ఏపి గ్రామ సచివాలయాల్లో విద్యుత్‌ ‌ఫిర్యాదులు

పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి, ఏప్రిల్‌ 28 : ఇక పై గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌సంబంధిత ఫిర్యాదులు తిరుపతి కలెక్టరేట్‌లో పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్‌, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఎస్పిడిసిఎల్‌ ‌పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్‌ ‌ఫిర్యాదులు స్వీకరణ జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  తెలిపారు. అనేక అంశాల పై రివ్యూ నిర్వహించామని అనేక సమస్యలపై ఈ సమావేశంలో దృష్టి సారించామని మంత్రి తెలిపారు. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్‌ ‌యూనిట్లు వినియోగిస్తే… ఈ ఏడాది 248 మిలియన్‌ ‌యూనిట్లు అందించాం అన్నారు. ఎక్కడా విద్యుత్‌ అం‌తరాయం లేకుండా సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం అని మంత్రి తెలిపారు.

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ అం‌దిస్తున్నాం. అధికారులు శ్రమిస్తున్నారు, మరింత బాధ్యతతో పని చేయాలి. గ్రామ, వార్డ్ ‌సచివాలయంలో ఫిర్యాదులు కోసం పోర్టల్‌ ‌ప్రారంభించాం. రైతులను, గ్రాణ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగ పడుతుంది. ఇంతకముందు 45 సేవలు అందిస్తున్నాం, తాజాగా మరో 12 సేవలు పొందుపరిచాం. సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *