(రేపు సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్.ఎంకట్ నారాయణ్‌కు
పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…)
ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎడిటర్ ఎస్ వెంకట్ నారాయణ్ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్ గా ప్రపంచంలో 65 దేశాలు పర్యటించారు. లండన్ సండే టైంస్ లో 1975లో సమ్మర్ స్కాలర్ గా, 1978లో అమెరికా బోస్టన్ గ్లోబ్ లో గెస్ట్ రైటర్ గా ప్రతిభ కనబరచి ఖ్యాతినందారు. 1979-84 మధ్యకాలంలో ఇండియా టు డే ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, సీనియర్ ఎడిటర్ వ్యవహరించి ఖ్యాతినిందారు. తెలంగాణ హనుమకొండ జిల్లా కమలాపూర్ లో 1943 సెప్టెంబర్ 6వతేదీ జన్మించిన వెంకట్ నారాయణ్ అక్కడే జిల్ల పరిషద్ హై స్కూలులో, అనంతరం హైదరాబాద్ నిజాం కళాశాలలో పట్టభద్రులై, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచీ 1967 లో జర్నలిజంలో పిజి కోర్స్ లో ప్రథమ స్థాయిలో నిలచి షోబుల్ల ఖాన్ స్వర్ణ పతకం అందుకున్నారు. పాత్రికేయునిగా ఆయన 1968లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ద టైంస్ ఆఫ్ ఇండియా విలేఖరిగా ప్రస్థానం ప్రారంభించారు. ప్రస్తుతం అనేక జాతీయ అంతర్జాతీయ పత్రికలు, మాగజైన్లకు నేక అంశాలపై వ్యాసాలు రాస్తునే ఉన్నారు. 1958లో ఏర్పడిన ఎఫ్ సి సి ఢల్లీిలో పని చేస్తున్న విదేశీ, భారతీయ జర్నలిస్టుల క్లబ్. 1999లో ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ కు నాయకత్వం వహించిన మొదటి భారతీయుడు వెంకట్ నారాయణ్. ఆ తర్వాత దీర్ఘకాలం సేవలందించారు. దక్షిణాసియా ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ అధ్యక్షుడిగా మరో పర్యాయం బాధ్యతలు చేపట్టారు.
భారత ప్రధానులు ఇందిరా గాంధి, రాజివ్ గాంధి, పి వి నరసింహారావు, వి పి సింగ్, ఐ కె గుజ్రాల్, పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ జియా ఉల్ హక్, పాకిస్థాన్ ప్రధానులు బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్, శ్రీ లంక అధ్యక్షులు జె ఆర్ జయవర్ధనే, చంద్రికా కుమారతుంగ, మహింద్ర రాజపక్స, జింబబ్వే అధ్యక్షుడు రాబెర్త్ ముగాబె, భుటాన్ రాజు జిగ్మె సింఘె వాంగ్చుక్ సహా వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, రాజులను, ఉన్నతస్థాయి మంత్రులను ఇతర ప్రముఖులను, ఇంటర్వ్యూ చేసిన ఘనత సాధించారు. 1998 లో కాకతీయ విశ్వ విద్యాలయం నుంచీ జర్నలిజం లో గౌరవ డాక్టొరేట్ (హొనొరిస్ ఛౌస) అందుకున్నారు. శ్రీలంకలోని ది ఐలాండ్ వార్తాపత్రిక కోసం వ్రాసిన నారాయణ్, విదేశాలలో అనేక టీవీ మరియు రేడియో నెట్‌వర్క్‌ల కోసం ప్రసారాలు చేస్తున్నారు.
భారత రాజకీయాల్లో ఒక మార్గనిర్దేశకుడు ఎన్ టి రామారావు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ సాధించిన అద్భుతమైన ఎన్నికల విజయం భారతదేశ రాజకీయ పటంపై ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ప్రాణం పోసింది. వెంకట్ నారాయణ్ విపరీతమైన పాత్రికేయ శైలిలో వ్రాసిన ఈ 131 పేజీల పుస్తకంలో రామారావు ప్రాథమిక పరిచయం మాత్రమే చేశారు వర్క్‌హోలిక్, ప్యూరిటన్ అలవాట్లు కలిగి, లోతైన సాంప్రదాయ జీవితంలోని విభిన్న సవాళ్లకు ఎదురీదగల ఒక అద్భుత వ్యక్తిని ఆవిష్కరించారు. బహుముఖ సమర్థత కలిగిన వ్యక్తిత్వాన్ని సిమ్హావలోకనం చేసారు. నేను విజయవాడ ఈనాడు ప్రతినిధిగా ఉన్నప్పుడు వెంకట్ నారాయణ్ తో కలసి ఎన్ టి రామారావు పుట్టినూరు నుంచీ ఆయన సినీ, రాజకీయ పర్యటనల్లో సంబంధం ఉన్న అనేక అనేక ప్రాంతాలు సందర్శించి అనుభవాలను మదిలో నిక్షిప్తం చేసుకునే అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రంలోని ప్రతి మూలకు 1982 జూన్ 14 నుంచి చివర 1983 జనవరి 3 తిరుపతి వరకూ 35 వేల కిలో మీటర్ల దూరం పర్యటించిన ఎన్ టి రామారావు జీవితంతో పెనవేసుకున్న అనేక ప్రాంతాలు సందర్శించి వెంకట్ నారాయణ్ రాసిన పుస్తకం చరిత్ర సృష్టించింది.
-నందిరాజు రాధాకృష్ణ
98481 28215





