బెయిల్ పిటిషన్ తిరస్కరించిన దిల్లీ హైకోర్టు
సుప్రీమ్ కోర్టును ఆశ్రయించే యోచనలో లాయర్లు
న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : దిల్లీ హైకోర్టులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై దిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లనూ కోర్టు తిరస్కరించింది. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా కవితను ఇప్పటికే ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు. ఈ కేసులో ఆమెను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసులో అరెస్టై.. తీహార్ జైల్లో ఉన్న కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
దిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ పిటిషన్లను ట్రయల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొంటూ బెయిల్ నిరాకరించింది. మార్చి 16న లిక్కర్ పాలసీ ఈడీ కేసులో, ఏప్రిల్ 11న సీబీఐ కేసులో కవిత అరెస్టయిన సంగతి తెలిసిందే.కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తీహార్ జైలులో ఉన్నారు. పీఎంఎల్‌ఏ సెక్షన్-19 ప్రకారం.. కవిత అరెస్ట్ చట్ట విరుద్ధమని, ఆమె రూ.100 కోట్లు చెల్లించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆమె తరపు న్యాయవాది కోర్టులో గట్టిగా వాదించారు. ఈ మేరకు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈడీ .. సీబీఐ వాదనలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది.





