ఎపిలో సాగర్‌ ‌కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు

ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
ఘటనపై సిఎం జగన్‌, ‌చంద్రబాబుల దిగ్బ్రాంతి

ఒంగోలు, జూలై 11 : ప్రకాశం జిల్లాలోఘోర రోడ్డు ప్రమాదం  జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి  సపంలో ఓ పెండ్లి బస్సు సాగర్‌ ‌కాల్వలోకి  దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక దర్శి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. క్రేన్‌ ‌సహాయంతో బస్సును బయటకు తీశారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. వివాహ రిసెప్షన్‌  ‌కోసం కాకినాడ వెళ్లేందుకు పెళ్లి బృందం ఆర్టీసీ గరుడ బస్సును అ•-దదెకు తీసుకుంది. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పొదిలి నుంచి బయలుదేరిన బస్సు.. దర్శి వద్ద ఎదురుగా లారీని తప్పించడానికి బస్సు డ్రైవర్‌ ‌ప్రయత్నించగా అదుపుతప్పి సాగర్‌ ‌కాల్వలో పడిపోయిందని తెలిపారు.

మరణించిన వారిని పొదిలి గ్రామానికి చెందిన అబ్దుల్‌ అజీజ్‌ (65), అబ్దుల్‌ ‌హాని (60), షేక్‌ ‌రజ్‌ (48), ‌ముల్లా నూర్జహాన్‌ (58), ‌ముల్లా జానీబేగం (65), షేక్‌ ‌షబీనా (35), షేక్‌ ‌హీనా (6)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. మతుల కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. వివాహ రిసెప్షన్‌ ‌కోసం కాకినాడకు వెళ్లేందుకు ఓ పెళ్లి బృందం  40 మందితో బస్సులో బయలుదేరారు.

దర్శి సపంలోకి రాగానే, ఎదురుగా సడెన్‌గా ఓ వాహనం వచ్చింది. దాన్ని తప్పించబోతుండగా, బస్సు అదుపు తప్పి, ఎన్‌ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 7 మంది మరణించారు. డ్రైవర్‌ ‌నిద్ర మత్తు కారణంగా.. ఈ ఘటన సమాచారం అందుకొని.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ప్రమాద స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని పరామర్శించారు. అధికారుల నుండి మృతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా … ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ … ఈ ప్రమాదం జరగటం చాలా దురదృష్టకరమని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మృతిచెందినవారి తరపు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఏపీలో జరుగుతున్న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. పెళ్లి బస్సు ప్రమాదంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‌తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకందని విషాదమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రమాద ఘటనపై ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *