కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి
వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు
కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 25 : జాతీ య ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ ఎం) కింద తెలంగాణకు రావల్సిన బకాయిలు రూ.693.13 కోట్లు వెం టనే విడుదల చేయాలని కేంద్ర ఆరో గ్య శాఖ మంత్రి జె.పి.నడ్డాకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని మంగళవారం ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని కేంద్ర మంత్రికి వివరిం చారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన లన్నింటిని తా ము ఈ ఏడాది జనవరి నుంచి అమ లు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు) సమర్థంగా నిర్వహిస్తున్నా మని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మెరుగైన వైద్య సేవలకు…
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నందున కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఎన్హెచ్ఎం బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రి నడ్డాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఎన్హెచ్ఎం 2023-24 మూడు, నాలుగు త్క్రెమాసికాల నిధులు రూ.323. 73 కోట్లు పెండిరగ్లో ఉన్నాయని, 2024-25 మొదటి త్క్రెమాసిక గ్రాంట్ రూ.138 కోట్లు మంజురు చేయాల్సి ఉందని,ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఎన్హెచ్ఎం కింద చేపట్టిన మౌలిక వసతులు, నిర్వహణ కాంపోనెంట్ కింద 2023-2024 సంవత్సరానికి సంబంధించి రావల్సిన రూ.231.40 కోట్లు తక్షణమే రీయింబర్స్ చేయాలని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్హెచ్ ఎంకు సంబంధించి కేంద్రం నుంచి రావల్సిన నిధులు ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా, సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం నుంచి రావల్సిన వాటా మొత్తాన్ని 2023, అక్టోబరు నుంచి తామే విడుదల చేస్తున్నామని కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.



