ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో 17 లోక్‌ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం నెలకొంది. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు స్వీకరించారు.

బీజేపీ తరఫున మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌, మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ లోక్‌సభ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి స్థానానికి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆర్వోకు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *