ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి

  • అప్పుడే బతుకులు బాగు పడుతయి
  • ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు…
  • బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు..
  • తెలంగాణను కాపాడుకోవాలి: సీఎం కేసీఆర్‌

అచ్చంపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ఎన్నికలు వస్తా ఉంటాయి.. పోతా ఉం టాయి…ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. అప్పుడే బతుకులు బాగు పడుతయని తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేతకల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ..తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్స రంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి.. ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు అని పేర్కొన్నారు. దిండి ప్రాజెక్టు మీద నుంచి వచ్చినం.దుందుభి నది కనబడింది. బాలరాజు కట్టించిన చెక్‌ ‌డ్యాంలు కనబడు తున్నాయి. అంతకు ముందు దుందుభిల దుమ్ములేచి పోయింది. గోరేటి వెంకన్న వాగు ఎండిపో యెరా. పెద్ద పేగు ఎండిపోయెరా అని పాట పాడి ఏడ్చిండు. ఎంత బాధ పాలమూరు లో గంజి కేంద్రాలు పెట్టిన్నాడు. అంబలి కేంద్రాలు పెట్టిన్నాడు. గొంతులెండి బిందెలు పట్టుకుని మోసిన్నాడు. అర్థరాత్రి కరెంటు కోసం పోయి పాములు, తేళ్లు కరిచి చచ్చిన్నాడు. గొడగొడ ఏడ్చుకుంట బొంబాయి పోయిన్నాడు ఈ కొడుకులంత ఎక్కడున్నరు. ఎవడన్న వచ్చిండా … రేపు ఉంటరా… అంటూ ఎద్దేవా చేశాడు. ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు. ఎవడు పడితే వాడే వస్తడు. బహురూపులొల్లు వచ్చినట్లు వస్తరు. ఏది పడితే అది చెబుతరు.. తెలంగాణను కాపాడుకోవాలి కాబట్టి, మీ బిడ్డను కాబట్టి దండం పెట్టి చెబుతున్నా నా వంతు పని నేను చేసిన. పోరాటం నేనే చేయాలనా.

ఇప్పుడు పోరాటం మీరు చేయాలే.. తెలంగాణ కోసం నేను వెళ్లిన్నాడు ఎవ్వడికి నమ్మకం లేదు.. పదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే. కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగు నీళ్లు లేవు.కరెంటు వస్తే దేవుని దయ. పటాకులు కాలినట్లు మోటర్లు కాలుడు.. గోస అనుభవించింది తెలంగాణ. యాది చేసుకుంటే భయం అవుతది.. 24 గంటలు కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్బంగా కేసీఆర్‌ ‌గుర్తు చేశారు.కర్ణాటకలో కరెంటు 5 గంటలు కూడా ఇస్తలేరు.24 గంటలు ఇస్తమన్నరు కర్నాటకలో కాంగ్రెసోళ్లు, ఎల్లెలుకల పడ్డారు. అక్కడ పంటలుఎండిపోతున్నాయి. భారతదేశానికి ఒక మార్గదర్శకత్వం చూపించే పద్ధతికి 10 ఏండ్లలో తెలంగాణను తయారు చేసినం. ఇండియాలో ఒకే ఒక్క స్టేట్‌ ‌మంచినీళ్లను ఇంటింటికిఅందిస్తున్నది.

మన్ననూరు, అమ్రా బాద్‌, అప్పర్‌ ‌ప్లాట్‌ ‌కావచ్చు. 680 మీటర్ల ఎత్తున్నదని అధికార్లు చెప్పిండ్లు. 680 ఫీట్లు ఉండనీ 12 వందలు ఎత్తు ఉన్నా నీళ్లు పోవాలే బిడ్డ లేకపోతే చంపేస్తా అని చెప్పినా . ఆదిలాబాద్‌ ‌గోండు గూడేల్లో, గోండు గూడేల్లో, కోయ గూడేలల్లో ఎవరి ఇంటి ముందు వారికి నల్లా పెట్టినాను. కొడంగల్‌ ‌కు వస్తవా కొడవలి పట్టుకుని వస్తవా. కేసీఆర్‌ ‌దమ్ము సంగతి ఇండియా అంతా చూసింది. నువ్వు చూడాలన్నా, నేను చూడాల్నా. నవంబర్‌ 30 ‌తేదీ నాడు దుమ్ము రేగాలే బ్రహ్మాం డమైన మెజారిటీతో బాలరాజు గెలిచి రావాలి.. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్‌ ‌వినియోగం, సాగునీటి రంగంలో కానీ నెంబర్‌ ‌వన్‌ ‌గా ఉన్నం తెలంగాణలో 60 కోట్ల టన్నులు కూడా పండక పోయేవి. ఈ రోజు తెలంగాణ మూడు కోట్లు టన్నుల వరిధాన్యం పండిస్తుంది. మూడు కోట్లు పోయి నాలుగు కోట్లు కావాలా.ముండగోపుగాండ్లు వచ్చి రెండు కోట్లకు ధాన్యం తేవలెనా. ఇదీ అలోచించాలి. కొత్తకుండలా ఈగ చొచ్చినట్లు. సంసారం చదురుకున్నట్లు శ్రద్ధతో, పద్ధతితో తెలంగాణు అభివృద్ధి చేసుకున్నాం.

పెన్షన్లు ఇచ్చు కున్నం. విధి వంచితుల కోసం ఇద్దా మనే మానవీయ కోణంతో ఇచ్చుకున్నాం. పేదోళ్ల వద్ద కొసరొద్దని చెప్పి రూ.1000 పెట్టు కున్నాం. పెంచు కున్నాం. కల్యాణలక్ష్మి కూడా పెంచు కున్నాం. ఎన్నికల కోసం కాదు. పెన్షన్లను వేలల్లో తీసుకుపోయిందిముఖ్యమంత్రి కేసీఆర్‌. ‌రైతుల ముఖాలు తెల్లపడాలని రైతుబంధు పథకాన్ని పెట్టిందే కేసీఆర్‌. ‌మొదట రూ.4 వేలు. వేయి పెంచుకుని రూ, 5 వేలు ఎకరానికి ఇచ్చాం. మెనిఫెస్టోలో పెట్టుకున్నాం. 16 వేలకు పెంచుకుందామని హామీ ఇచ్చినాం. ఒక సంసారి రీతిలో పెంచుకుంటూ పోవాలని హామీ ఇచ్చినం. లంగహామీలు ఇవ్వం.. తెలంగాణ ఇవ్వాల అన్నపూర్ణ అయ్యింది. మూడు కోట్ల టన్నుల వడ్లు పండించి దేశానికి అందిస్తుంది. రేషన్‌ ‌కార్డు ఉన్న 93 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం తినాలని ఇవ్వడానికి నిర్ణయించింది.

ఉమా మహేశ్వర లిఫ్టు మంజూరు చేసుకున్నాం. మూడు రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం. అప్పర్‌ ‌ప్లాటో కు కూడా నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. తప్పకుండా తెచ్చిస్తాం.. అచ్చంపేట నియోజకవర్గంలో 1.75 లక్షల ఎకరాలతో పాటు 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే బాధ్యత నాది. పాలమూరు ప్రాజెక్టు కడితే అడ్డం పడ్డదే కాంగ్రెస్‌ ‌నాయకులు. కాళ్లలో కట్టెలు పెట్టినట్లు 192 కేసులు వేసినారు. నల్గొండ జిల్లాలో ఉన్న దిండి వాళ్లతో పాటు పాలమూరు జిల్లాల వారికి లాభం జరుగు తుంది. ముస్లిం సోదరులకు రెసిడెన్షియల్‌ ‌పాఠశాలలు పెట్టినం. అందరికీ కలిపి అన్ని వర్గాలకు కలిపి1000 కళాశాలలు పెట్టినం. రాబోయే రోజుల్లో డిగ్రీ కళాశాలలు కూడా చేసుకోవాలే. రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని ధరణి తెచ్చినం ధరణిని తీసేస్తామని రాహూల్‌ ‌గాంధీ, రేవంత్‌ ‌రెడ్డి మల్లు భట్టి విక్రమార్క చెబుతున్నారు. రైతుబంధు పైసలు పడుతున్నాయి. టింగ్‌ ‌టింగ్‌ ‌మని మీ ఖాతాల్లో పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్మితే మీ ఖాతాల్లో పడుతున్నాయి. ధరణి పుణ్యం వల్ల సాధ్యమవుతుంది. బంగాళాఖాతంలో కలుపుతా అంటున్నాడు.రిజిస్ట్రేషన్‌ ఎం‌తమంచిగా చేసి నం. మండల కేంద్రంలో అవుతున్నది. పావుగంటలో మ్యుటేషన్‌ ‌కూడా అవుతున్నది. ధరణి తీసేస్తామంటే మీకు తమాషా లెక్క అనిపిస్తుంది. తమాషా కాదు. ధరణి తీసేస్తే పాత పద్ధతి వస్తది. మీ భూమిపై మీ దగ్గర అధికారం ఉండాలంటుంది బీఆర్‌ ఎస్‌ ‌పార్టీ .. లాగేసుకోవాలంటుంది కాంగ్రెస్‌ ‌పార్టీ . ఇందులో ఏ పార్టీ కావాలో రైతులే తేల్చుకోవాలి.

కరెంటు 3 గంటలు ఇస్తానంటుంది కాంగ్రెస్‌. ఒక్క మడి తడుస్తదా? 24 గంటలు ఇస్తానని నేను చెబుతున్నా తీసేస్తాను అన్నోడికి బుద్ధి చెప్పాలి. 3 తారీఖు నాడు దుమ్ము రేగాలి. వెనుకబడ్డ ప్రాంతం. బాలరాజు ప్రజల పక్షాన కోరిన వాటినన్నింటిని ప్రభుత్వం వచ్చిన నెలలోపు ఉత్తర్వులు ఇస్తాను. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చినాం. ఎవరన్నా ఇచ్చాడా? రైతుబంధు వాటికి చెల్లించాం. గిరిజనులపై కేసులు ఎత్తివేశాం. దళిత సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దళితుల గురించి ఆలోచించలేదు. ఓటుబ్యాంకు మాదిరిగా వాడుకున్నారు. దళితబంధును నెహ్రూ కాలంలోనే అమలు చేసి ఉంటే దళితుల పరిస్థితి మెరుగ్గా ఉండేది. భారత దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నోట్ల నుంచి రాలేదు. దళితబంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్‌. ‌మీరు ఓడ గొడితే రెస్ట్ ‌తీసుకుంటాం. మాకు వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు. నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లుగా తెలంగాణను ఓ దరికి తీసుకు వస్తున్న వాళ్లుగా మా కర్తవ్యం మీకు చెప్పాలి. ఎన్నికల తర్వాత ఒక రోజు అధికారులతో సహా వస్తాను. నల్లమల ప్రాజెక్టు, సలేశ్వరం వంటి ఎకో టూరిజం ఉంది. ఆమ్రాబాద్‌ ‌వంటి ప్రాంతాలు మరింత అభివృద్ది చేసుకోవాల్సి ఉంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు జైపాల్‌ ‌యాదవ్‌, ‌గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *