ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు రబ్బిష్‌

మళ్లీ అధికారం తమదే అని కెటిఆర్‌ ధీమా
హ్యాట్రిక్‌ కొట్టబోతున్నామని వెల్లడి
కొందరిని విచారించి ఫలితం ఇదని ఎలా చెబుతారని ప్రశ్న
డిసెంబర్‌ 3న సర్వే సంస్థలు క్షమాపణలు చెప్పే పరిస్థితి ఉందన్న మంత్రి
బిఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుంది…మళ్లీ విజయం కెసిఆర్‌దే : కవిత

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 30: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు రబ్బిష్‌ అని, వాటిని చూసి కంగారు పడాల్సిన పని లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ విూడియాతో మాట్లాడుతూ…’ఈరకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశాం. ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అని నిరూపించడం మాకు కొత్తేవిూ కాదు. డిసెంబర్‌ 3న 70కి పైగా స్థానాలతో విజయం సాధిస్తాం. హ్యాట్రిక్‌ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని విూడియా సంస్థలు సర్వేలు చేయకుండా.. ఏదో 200 మందిని అడిగినట్టు చేసి.. దాన్ని గొప్పగా చేసి చూపిస్తారు. గతంలో 5 విూడియా సంస్థలు సర్వేలు చేస్తే.. అందులో ఒక్కటే నిజమైంది.’ అని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ప్రజలు ఇంకా లైన్‌లో ఉండి వోట్లు వేస్తూనే ఉన్నారని.. అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిరచడటమేంటని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. అస్సలు ఏ లాజిక్‌తో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇస్తున్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ డిసెంబర్‌ 3న ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పు అయితే..తప్పు జరిగిందని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెబుతారా? అని ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురించిన విూడియా సంస్థలను కెటిఆర్‌ ప్రశ్నించారు. ఎవ్వరూ కన్ఫ్యూజన్‌ కావద్దని.. వందకు 100 శాతం అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. గత 90 రోజులుగా కష్టపడ్డ మా కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. గంట, గంటన్నర సేపు పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. 70కి పైగా స్థానాల్లో గెలుస్తామని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 2018 తెలంగాణ ఎగ్జిట్‌ పోల్స్‌ తప్పని తేలాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

బిఆర్‌ఎస్‌ చరిత్ర సృష్టిస్తుంది…మళ్లీ విజయం కెసిఆర్‌దే : కవిత
తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ, చైతన్యవంతమైన గడ్డ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పింక్‌ వేవ్‌ కనిపిస్తుందని అన్నారు. గురువారం ఆమె జుబ్లీహిల్స్‌ లోని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె విూడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ చరిత్ర స్రుష్టిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ మళ్లీ విజయం సాధించి అధికారం చేపడతారని పేర్కొన్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావులతోపాటు ఎమ్మెల్సీ కవిత అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల తరపున భారీ ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *