ఎంగిలిమెతుకుల కోసం ఎగిరి పోయిన సంజయ్‌

‌పార్టీ వీడడంతో జగిత్యాలకు శని వదిలింది
లీడర్‌ ‌కావడంలో కవిత సహా అనేక మంది కృషి
జీవన్‌ ‌రెడ్డి కూడా చేరికలను ఆహ్వానించడం లేదు
దమ్ముంటే ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి
గతంలో మేము బీజేపీనిని విలీనం చేయించాం
జగిత్యాల బిఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌

‌జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 1 : గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌కు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చురకలంటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ సమావేశంలో కేటీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ అం‌దరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నట్లు అనిపిస్తోందని అన్నారు. కొన్ని సందర్భాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనషుల విలువ తెలుస్తది. గాలికి గడ్డపారలు కొట్టుకుపోవు. గట్టి నాయకులు కొట్టుకుపోరు. గాలికి కొట్టుకుపోయేది గడ్డిపోచలు మాత్రమే. గడ్డిపారల్లాంటి రు వెళ్లలేదు.. ఒక గడ్డిపోచ మాత్రమే కొట్టుకుపోయింది అని ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. కవితక్కతో సహా వేలమంది కష్టపడితే ఆయన ఎమ్మెల్యే అయిండు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దొంగల్లో కలిసిండు.

 

రేవంత్‌ ‌రెడ్డి విసిరే ఎంగిలి మెతులకు ఆశపడి పోయిండు. ఎమ్మెల్యే బుద్ది ఇవాళ తెలిసి వచ్చింది. అభివృద్ధి కోసం పోయినా అని సంజయ్‌ అన్నాడు. జగిత్యాల జిల్లా రద్దు చేస్తా.. మెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీ రద్దు చేస్తా అని రేవంత్‌ ‌రెడ్డి అన్నందుకు సంజయ్‌ ‌కాంగ్రెస్‌లోకి వెళ్లిండా.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 4500 డబుల్‌ ‌బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు రద్దు చేయమని పోయావా..? ఏ అభివృద్ధి ఆశించి పోయిండు సంజయ్‌. ఆయన పోయింది ఒక్కదాని కోసం.. ఇయ్యంకుడి బిల్లులు రావాలి.. ఆయన క్రషర్‌ ఆగొద్దని పోయిండు. సొంత అభివృద్ధి కోసం పోయిండు.. జిగిత్యాల అభివృద్ధి కోసం పోలేదు అని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.కాంగ్రెస్‌ ‌పార్టీ సిగ్గు లేకుండా పార్టీ  ఫిరాయింపులకు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హాయాంలోని కాంగ్రెస్‌ ‌పార్టీ అని గుర్తు చేశారు. 2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసిందని అన్నారు. అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నామని అన్నారు. 2014లో ఇప్పుడున్న సీఎం రేవంత్‌ ‌రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది రంతా చూశారు. తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ ‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.

 

అప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌ ‌లో చేరినప్పడు ఇదే రేవంత్‌ ‌రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడ్గు రేవంత్‌ ‌రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలే? ఎవరు పిచ్చి కుక్క? ఇప్పుడు రేవంత్‌ ‌రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ ‌ను కొట్టాలా? రేవంత్‌ ‌రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు.  వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి. ఒక్క రేవంత్‌ ‌రెడ్డి మాత్రమే కాదు. రాహుల్‌ ‌గాంధీ ఏమన్నాడో కూడా వినాలె. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌ ‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌ ‌లోనే చెప్పిండు. పాంచ్‌ ‌న్యాయ్‌ ‌పేరుతో ఇదే అంశాన్ని రాహుల్‌ ‌గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. కానీ ఇప్పుడు రాహుల్‌ ‌గాంధీ, రేవంత్‌ ‌రెడ్డి చేస్తుందేమిటీ ప్రజలు గుర్తించాలని అన్నారు. వాళ్ల పార్టీ నాయకుడు జీవన్‌ ‌రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.

 

బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీఆర్‌ఎస్‌ ‌రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది. 14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది. ఇక పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏం జరిగిందో కు తెలుసు? మోదీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు. దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమి లో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది. ఒక్క బీఆర్‌ఎస్‌ ‌కు మాత్రమే కాదు. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్‌ఆర్‌ ‌సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌ ‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలిందన్నారు. 20 హాలు ఇచ్చి రేవంత్‌ ‌రెడ్డి గద్దెనెక్కిండు. వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్‌ ‌భయపడ్డాడు. అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు. ఇచ్చిన హాలను డైవర్ట్ ‌చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు. జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది. జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు. కుండ పగిలితే పగిలింది. కానీ కుక్క బుద్ది తెలిసిందన్నట్లుగా  ఎమ్మెల్యే బుద్ది తెలిసింది‘ అని కేటీఆర్‌ ‌మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *