- కెసిఆర్ పోటీతో ఊరూరా ప్రచారహోరు… గతంలో ఎప్పుడూ కానరాని హుషారు
- ప్రచారంలో వెనకబడ్డ కాంగ్రెస్, బిజెపి
నిజామాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్లో జోష్ నెలకొంది. కామారెడ్డి బరిలో బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పోటీకి దగడంతో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని ఉత్సాహం కానవస్తోంది.కామారెడ్డి పోటీ ప్రభావం కాస్తా ఉమ్మడి జిల్లా అంతటా కానవస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ పార్టీకి ముందునుంచీ కంచుకోటగా ఉంటూ వస్తో ంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బిజెపి అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ గెలి చినా… బిజెపికి పెద్దగా ఎదుగుదల కాన రాలేదు. బిఆర్ఎస్ ఎక్కడా తగ్గలేదు. అందు కు స్థానిక ఎన్నికలు కూడా రుజువు చేశాయి. ఆది నుంచి నేటి వరకు అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకే ఇక్కడి ప్రజలంతా జై కొడు తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే జోరు కనిపిస్తున్నది. కెసిఆర్ రాకతో రెట్టించిన ఉత్సాహంతో గులాబీ జెండాకు జిల్లాలో ప్రజామద్దతు వెల్లువెత్తు తున్నది. ఊరూరా అపూర్వ స్పందన లభిస్తున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా సంఘాలకు సంఘాలే స్వచ్ఛందంగా ముందు కొసు్త న్నాయి. వచ్చే ఎన్నికల్లో కారుకే మా ఓటు అని బహిరంగంగానే ప్రకటిస్తు న్నాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వయం గా గులాబీ దళపతి, సీఎం కేసీఆరే పోటీ చేస్తుండడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయిపోయాయి. కామారెడ్డి మొదటి నుంచి బీఆర్ఎస్కు పెట్టని కోటగా నిలిచింది.
అలాంటి గడ్డపై నుంచి స్వయ ంగా కేసీఆర్ వచ్చి పోటీ చేస్తుం డడంతో ఉద్యమ కాలం నాటి సంగతులను ఇక్కడి ప్రాంత వాసులంతా గుర్తుకు తెచ్చుకుం టున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నిలబెట్ట డంలో ఉద్యమ కాలంలో కామారెడ్డి సైతం వేదికగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడానికి ఈ ప్రాంతం వేదికైంది. నాడు కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజల మద్దతు పెద్ద ఎత్తున దక్కింది. ఇప్పుడు కూడా అదే స్థాయి లో ప్రజల మద్దతు ఉండబోతున్నది. ఇందులో భాగంగానే గ్రామాల్లో స్వచ్ఛం దంగా కేసీఆర్‌కు జై కొడుతూ కుల సంఘాల వారీగా తీర్మానాలు సైతం చేశారు. కేసీఆర్‌కే మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ సైతం చేశారు. కారు జోరుకు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే కుదేలయ్యా యని బిఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకమునుపు నుంచే ఎన్నికల కదన రంగంలో బిఆర్ఎస్ దిగి ప్రజల్లోకి వెళ్తున్నది. నిత్యం ప్రజల్లోనే ఉంటూ బీఆర్ఎస్ శ్రేణు లంతా కారు గుర్తుకే ఓటేసే విధంగా ప్రజ లను చైతన్యం చేస్తున్నారు. స్పీకర్ పోచ యారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంతరెడ్డి లకు తోడుగా ఎమ్మెల్సీ కవిత కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు డీలాపడి పోయాయని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి విమర్శలు గుప్పి స్తున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే అభ్యర్థు లంతా జోరుగా ప్రచార పర్వాన్ని చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ సగం మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. కెసిఆర్ ద ఎవరు పోటీ చేస్తారో కాంగ్రెస్, బిజెపిలు తేల్చుకోలదు. అందరికన్నా ముందే అభ్యర్థులను ప్రకటి ంచిన గులాబీ పార్టీ ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కడకి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతు న్నారు. కాంగ్రెస్, బీజేపీ అధినా యకత్వాల తీరుతో దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గులాబీ జెండా వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల హాలపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తున్నది. అక్టోబర్ 15న సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను కర పత్రాల రూపంలో ఇంటింటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు చేరవేస్తున్నారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోయే కార్యక్రమాలను వివరిస్తూ గులాబీ దళం ముందుకు సాగుతున్నది. ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, రైతుబంధు పెట్టుబడి సాయం రూ.16వేలు, కేసీఆర్ బీమాప్రతి ఇంటికి ధీమావంటివిప్లవాత్మకమైన పథ కాలపై ఇప్పటికే జనాల్లో చర్చ చేస్తు న్నారు. బీమా పథకంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మహిళా భృతి అంశంపైనా అనుకూలతలు ఏర్పడ్డాయి.
మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను ఇంటిం టికెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి విరామం లేకుండా ప్రజల మధ్యే తిరుగు తున్నారు. జుక్కల్‌లో హన్మంత్ షిండే, ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిజామాబాద్ జిల్లా లోనూ ప్రచార కార్యక్రమాలు వినూ త్నంగా జోరుగా సాగుతున్నాయి. ఆర్మూర్ నియో జకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు గులాబీ పార్టీ విజయం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. వాహనాల ర్యాలీలతో పాటుగా సోషల్ డియాలోనూ జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులపై పెద్ద ఎత్తున ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తూ ఇంటింటికీ కేసీఆర్ పరిపాలన గొప్ప తనాన్ని వివరిస్తున్నారు. బా ల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే జోరుగా ప్రచా రం చేశారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలగడంతో కాసింత బ్రేక్ పడింది. బోధన్‌లో ఎమ్మెల్యే షకీల్ ఆయన భార్య ఫాతిమా ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణెళిశ్ గుప్తా డివిజన్ల వారీగా ప్రచారం చేస్తుండడంతో పాటు కుల సంఘాలతో ప్రత్యేక భేటీలు నిర్వహిస్తున్నారు. నిజామా బాద్ అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ రూరల్లోనూ జోరు కనిపిస్తోంది.నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌చార్జీగా నియమితులైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం ప్రజల్లోకి వెళ్తున్నారు.తనదైన శైలిలో ప్రసంగిస్తూ జాతీయ పార్టీల తీరును ఎండగడుతున్నారు.





