ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క
పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం
చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి స్థానంలో వుంటాడేమో! ఇరవయ్యావ శతాబ్దపు తొలి నాళ్ళ నుంచి తుదిశ్వాస విడిచేదాకా ‘‘ పుట్టుక నీది చావు నీది- బ్రతుకంతా దేశానిది. అని వంచించిన మాటలను నిజం చేసి ఏయిజానికి లొంగకుండా మానవయిజానికి కటుబడు ప్రజలకోసం గొడవ పడిన విశిష్ట వక్తిత్వం కాళోజీది తాను ఏవరిలో ఇమడకున్నా అందరిని తన ఒకరిలో ఇము డ్చుకునే సున్నిత మనస్కుడు కలం పట్టిన తొలి రోజుల్లోనే (1931.. ‘నాకందినది నాది/ నాకందనిది మనది/ నానాయిజాల కడుగున జాడ/ నాయిజందే ఆగుపడును జాడ..
అని దోపిడీ మనస్తత్వపు ఆలోచనను ఎండగట్టిన కాళోజి బ్రిటీస్ వలస పాలకుల దోపిడికి నైజాం రజాకారుల హింసాపాలనకు వ్యతిరేకంగా స్వదేశీ పాపకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్బంధంగా నిర్మోహమాటంగా ఎదురెడ్డి ప్రజల పక్షాన పోరాడిన యోధుడు అనుకున్న దాన్ని అచరించే పట్టుదల గల దైర్యశాలి ఆయనా నిగర్వి నిష్కపటి ఇన్ని విశిష్ట గుణాలున్న వ్యక్తిత్వం గల మహానుభావులు చాలా అరుదైమో! అందుకే ‘‘అతిధివోలె వుండి వుండి/ అవని విడిచి వెళ్ళుతాను నీపాకని ఎత్తలేదు/ నేజారని లోతు లేదు/ కంటాకాల మధ్య నేను/ కాలినడక నడిచినాను ‘‘// అంటూ తన స్వగతాన్ని అనుభవాన్నిజీవిత సత్యాన్ని వీలునామాగా రాసుకున్న వ్యక్తి కాళోజీ! కవిత్వంలో ఆయనో వేమన, గురిజాడ, శ్రీశ్రీ యోధుల్లో ఆయనోస్పార్టకస్,అల్లూరి,త్యాగం
‘‘ హెచ్చు తగ్గులున్నచోట/ సమభావం చచ్చిపోవు/ అసమ్మతి,నిరసన , దిక్కర..
ప్రజాస్వామ్యం లక్ష్యం ‘‘అంటూ పద్మభూషణ్ గ్రహీత అయినా ప్రభుత్వానికి దాసోహం అనక నిరంతరం ప్రభుత్వాలను నిలదీసిన రాజీపడని వ్యక్తి. గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని యిష్టపడుతూనే -హింస చాలా మంచిది.. అహింస చాలా మంచిది.. హింస తప్పు .. రాజ్యహింస మరీ తప్పుకాని – ప్రతి హింస తప్పు కాదు. పిరికి పంద బ్రతుకు కన్న ప్రతి హింస మిన్న ‘‘ అన్న గాంధీజీ మాటలను పదే పదే ఈటెలుగా మార్చి గుండె దిటవుతో ప్రకటిస్తూనే భయపడి బతకడం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అని బాధపడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభావితం చేసిన వైతాళికుడు మహోన్నత వ్యక్తిత్వం, నిండైన శిల్పం , భయపడని మనస్తత్వం,నిరంతరం ప్రజలకోసం తపించి పరితపించి ఎదురొడ్డి బాదపడి కన్నీరు కార్చిన వ్యక్తి చనిపోతూ కూడా పార్థివ శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం అంకితం చేసిన నిజమైన ప్రజల మనిషి ఇంతటి వైరుధ్యం ఉన్నత వ్యక్తిత్వం కలిగిన కాళోజి 20వ శతాబ్దపు ఉద్యమాలకు చిరునామా అంటే అతిశయోక్తి కాదేమో !అందుకే ఆయన చరిత్రను చరిత్ర పాఠంశాంగా రాయాలి అది భగత్ సింగ్ వీరత్యాన్ని కొమరం భీము వారసత్వాన్ని వరంగల్లో రజాకార్లు చంపిన మొగిలయ్య త్యాగాన్ని తెలుపుతుంది ఆ చరిత్ర తెలంగాణ కదన ఘట్టాలను వీరంత్వాలను తెలుపుతుంది ఆ చరిత్ర తెలంగాణ అమాయకత్వాన్ని నిరాడంబరతను సంస్కృతిని భాష యాసను పదిల పరుస్తుంది అన్నిటికన్న ఆ చరిత్ర ప్రశ్నించడం నేర్పుతుంది .
కాళోజి ఏ ఉద్యమానికి పరిమితం కాకుండా అన్నింటా తానై. తానే అన్నై అన్నిరాజకీయాలను ఉద్యమాలను తడిమి చూసిన వ్యక్తి .ఎన్నికల్లో కూడా నిలబడి తన నిరసన గళాన్ని వినిపించినాడు ఉపాధ్యాయుని యోజకవర్గనికి ప్రాతినిధ్యం వహించి గెలిచినా ఎన్నడు ప్రభుత్వ వాద కాలేదు . అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజల పక్షమే !పబ్లిక్ విషయాల తప్పనీ స్వగతం ఎందుకు మాట్లాడవ్ ?అని ప్రశ్నింస్తే సమాజ సంబంధం లేని బతుకెట్ల బతకుతారని ఎందురు ప్రశ్న వేసే ముక్కుసూటి మనిషి కాళోజి ! ఏదో ఒక ఉద్యమంతో ముడిపెట్టుకోక ఆ ఉద్యమాలతో ఆగిపోక వందేమాతర ఉద్యమం నుంచి గ్రంథాలయోద్యమం దాకా ఆర్యసమాజ్ నుండి ఆంధ్ర మహాసభ వరకు నిజాం రజాకార్ల వ్యతిరేక పోరాటల నుంచి దొరల భూస్వాముల వ్యతిరేక పోరాటాల వరకు జాతీయోద్యమం నుండి కమ్యూనిస్టు పోరాటాలవరకు కాంగ్రెస్ వాదిగా కమ్యూనిస్టుగా పౌరహక్కుల కోరకు మానవ హక్కుల కొరకు ప్రాంతీయ అసమానతలను నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజాస్వామిక తెలంగాణ కోసం అలుపెరగక పోరాడిన దీరుడు. ఆనాడు క్విట్ ఇండియాను బలపరిచి ఇందిరా ఎమర్జెన్సీని ధిక్కరించిని అభ్యుదయ కవిత్వం నుండి విప్లవకవిత్వం దాకా తన గొంతును వినిపిస్తూ ఆ విశ్రాంతంగా అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్ని చైతన్యపరుస్తూ వెన్న తాడుతూ బాధల్ని పంచుకుంటూ ప్రజల పక్షాన వకాలత్ పుచ్చుకున్న వ్యక్తి . ముఖ్యంగా తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పరితపించి తెలంగాణ విముక్తి కోసం చెలరేగిన అన్ని ఉద్యమాలకు ఆయన ఊపిరి పోసి వెన్ను తట్టాడు గళ మెత్తాడు.. ‘‘దోపిడీ చేసే ప్రాంతేతరులను/ దురందాకా తన్నితరుమూతం/ ప్రాంతం వాడే దోపిడి చేస్తే / ప్రాణంతోనే ప్రాతర వేస్తం-అని 1949 నుంచి నేటి దాకా సాగుతున్న తెలంగాణ ఆకాంక్షలకు జవ సత్వాలను అందించి గర్జించి తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్దేశం చేసి స్వయంగా ఉద్యమ బాటన నడిపిన ఆచరణ వాది ఆయన ఆకాంక్షలు ఆశయాలు లక్ష్యాలు అన్నీ ప్రజాస్వామికమే!
ఎక్కడ స్వార్ధం లేదు ఎప్పుడూ అహం లేదు ఎప్పుడూ దర్పం ప్రదర్శించలేదు సామాన్యూలలో అతి సామాన్యుడు నిరాడంబరుడు/ పరుల కష్టము జూచి పగిలిపోవును గుండె మాయ మోసము జాచి మండిపోవును ఒళ్లు తప్ప దిద్దిగ లేను దారి చాపగలేను.. తప్పు చేసిన వాని దండిరపగా లేను.. పరుల కష్టాలతో పని ఏమీ మాకనెడు.. అన్యులను జాచైనా హాయిగ మనలేను.. ఎందుకో నా హృదిని %–% ఇన్ని ఆవేదనలు ?.. అంటూ పసివాడి వలె వలవల కన్నీరు కార్చిన వికట జీవి వెన్నకన్నా సున్నిత మనస్కుడైన కాళోజీకి నివాళులను అర్పించడం సాహసమే ! మేధావులంతా కాళోజీలైతే భహుశా ప్రజలకు కడగండ్ల వుండవేమే !ఆయన ఎంచుకున్న మార్గాన కొంత దూరమైన నడిస్తే ప్రజాస్వామ్యం కోసం పూపిరితో నైనా కొనసాగుతుంది ఓమహా స్వాప్నికుని కలలను నిజంగా చేయడానికి గొడవ పడుతున్నా గొడవ పడేవాన్ని అడ్డుకోకుంటే అదే కాళోజీకి నిజమైన నివాళి !
-శోభరమేష్
8978656327




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల