Take a fresh look at your lifestyle.

ఉదయ్‌పూర్‌ ‌డిక్లరేషన్‌ ఆధారంగా ముందుకు

  • సీనియర్లతో సంప్రదింపుల ద్వారానే ముందుకు
  • సోనియా మద్దతుతో నిలిచానన్నది అవాస్తవం
  • కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గే

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మల్లికార్జున్‌ ‌ఖర్గే తన పోటీదారు, సీనియర్‌ ‌నేత శశి థరూర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అధికార వికేంద్రీకరణ అజెండా దిశగా వెళతానన్న శశిథరూర్‌ ‌వ్యాఖ్యలను ప్రస్తావించగా ఆయనతో తనను పోల్చవద్దని కోరారు. తాను బ్లాక్‌ అధ్యక్షుడి నుంచి ఈ స్ధాయికి ఎదిగానని, ఆ సమయంలో శశి థరూర్‌ ఉన్నారా అని ప్రశ్నిం చారు. శశి థరూర్‌ ‌తన మ్యానిఫెస్టోతో ముందు కెళ్లవచ్చని, తాను మాత్రం ఉదయపూర్‌ ‌డిక్లరేషన్‌లో తీసుకున్న నిర్ణయాల అమలు అజెండాగా పనిచేస్తానని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఎన్నికల మేనేజ్‌మెంట్‌, ‌జాతీయ స్ధాయిలో పార్టీ శ్రేణులకు శిక్షణ వంటి మూడు నిర్ణయాలను అమలు చేసే దిశగా కసరత్తు సాగిస్తానని అన్నారు. సీనియర్‌ ‌నేతలు, నిపుణులతో సంప్రది ంపులు చేపట్టడం ద్వారా నిర్ణయాల అమలు దిశగా చర్యలు చేపడతానని చెప్పారు.

పార్టీని ప్రస్తుత సంక్లిష్ట పరిస్ధితులు, సవాళ్ల నుంచి బయటకు తెచ్చేందుకు యువ నాయకత్వం అవసరమా అని ప్రశ్నించగా పార్టీలో ఎవరేంటనేది తనకు అన్నీ తెలుసని, అవసరమైన సమయంలో యువ నేతల సేవలు ఉపయోగించుకుంటా మని అన్నారు. ఇదిలావుంటే అఖిల భారత కాంగ్రెస్‌ ‌పార్టీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం పోలింగ్‌ ‌తేదీ సవి•పిస్తోంది. కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేతలు మల్లికార్జున్‌ ‌ఖర్గే, శశిథరూర్‌ అధ్యక్షుడి పదవి కోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం మద్దతు మల్లికార్జున్‌ ‌ఖర్గేకు ఉందని, సోనియాగాంధీనే మల్లికార్జున్‌ ‌ఖర్గే పేరును సూచించారనే వార్తలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీ మద్దతు ఉండటం వల్ల మల్లికార్జున్‌ ‌ఖర్గే గెలుపు నల్లేరుపై నడకే అన్న ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడి పదవి రేసులో ఉన్న మల్లికార్జున్‌ ‌ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సూచించలేదని, పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు నుంచి మద్దతు లభిస్తుందన్నవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని మల్లికార్జున్‌ ‌ఖర్గే స్పష్టం చేశారు. సోనియా గాంధీ తన పేరును కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి సూచించడం అవాస్తవమని, గాంధీ కుటుంబం నుండి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనరని, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వబోరని ఆమె స్పష్టంగా చెప్పారని మల్లికార్జున్‌ ‌ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో శశి థరూర్‌, ‌మల్లికార్జున్‌ ‌ఖర్గే పోటీ పడుతుండగా, ఖర్గేకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పూర్తి మద్దతు ఉందని, శశిథరూర్‌ ‌కు పార్టీలో మద్దతు కష్టమేనని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై మల్లికార్జున్‌ ‌ఖర్గే స్పందించారు. కాంగ్రెస్‌ ‌పార్టీని, సోనియా గాంధీతో పాటు, తనను అవమానించేందుకు, కించపరిచేందుకే ఎవరో ఈ వదంతులు వ్యాప్తి చేశారన్నారు.

Leave a Reply