ఉచిత హామీలకు అంతం లేదా!

రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఆర్థిక క్రమశిక్షణతో పాటు, రాజకీయ క్రమశిక్షణ కూడా పాటించాలి. అధికారం కోసం గడ్డి కరవడం సరికాదు. డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయి. దీనిని ప్రజలు గుర్తించి అప్రమత్తం కావాలి. అలాంటి పార్టీలను, నాయకులను దూరం పెట్టకుంటే రాష్ట్రం అధోగతి పాలు కావడంతో పాటు, అభివృద్ధికి నిధులు లేకుండా పోతున్నాయి. జీతాలు సక్రమంగా ఇవ్వలేని దుస్థితికి తీసుకుని వొచ్చారు. ఈ ఎన్నికల్లో గతం కన్నా మిన్న అన్న తీరులో ఇబ్బడిముబ్బడిగా డబ్బుల పందేరం చేసే పథకాలు ప్రకటిస్తున్నారు. పోటీపడి పెన్షన్లు, నగదు బదిలీ హావీులు గుప్పిస్తున్నారు. వీటన్నటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఆలోచన చేయడం లేదు. కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా  హామీల  వరదలు పారిస్తున్నారు. ప్రజలు కూడా తాయిలాలకు లొంగి వోట్లు వేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమం పేరుతో చేసిన పందేరాల వల్ల రాష్ట్రాలు అప్పుల కుప్పగా మారాయి. దీనిని నిలదీసేదెవరన్నది చూడాలి. కేంద్రం కూడా చేష్టలుడిగి అప్పులు చేసుకునే వెసులబాటు కల్పిస్తుంది. ఈ వినాశక విధానాల వల్ల అభివృద్ది వెనక్కి పోతుంది. ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా ఎన్టీఆర్‌ లాంటి వారు కూడా ప్రజాగ్రహంలో కొట్టుకు పోయారు. మొన్నటికి మొన్న తెలంగాణలో తనకు తిరుగులేదన్న కెసిఆర్‌ ప్రజాగ్రహానికి గురయ్యారు. పథకాల పేరుతో డబ్బులను పంచుతూ ఇదే సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్న తెలుగు రాష్ట్రాల సిఎంలు పథకాలను సవ్నిక్షించుకోవాల్సిన అసవరం ఏర్పడిరది. పథకాల పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేయడం తగదు. ప్రధానంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ముందు సబ్సిడీ బియ్యం పథకాన్ని సవ్నిక్షించాలి. కిలోరూపాయి బియ్యం పథకంతో పాటు తెల్ల రేషన్‌ కార్డుల సంఖ్యను సవ్నిక్షించాలి.

ప్రభుత్వ హాస్నిటళ్లను బాగు చేసివుంటే ఆరోగ్యశ్రీల అవసరం రాదు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్‌ కిలో రెండు రూపాయల బియ్యం పథకం ప్రవేశ పెడితే ఉమ్మడి ఎపిలో నాటి సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి కిలో రూపాయికే బియ్యం పథకం ప్రవేశ పెట్టారు. దీనిని కేవలం రాజకీయ లబ్దికోసం మాత్రమే ప్రవేశ పెట్టిన సంగతి తెలుసు. దీంతో కోట్లాది రూపాయాలు వృధా అవుతున్నాయి. దీనిని గొప్పగా చెప్పుకోవడం.. ఇంటింటికీ సరఫరా చేయడం వంటి చర్యలు ప్రజాధనం వృథా చేయడం తప్ప మరోటి కాదు. ఇక తెలంగాణలో రైతుబంధు పేరుతో వ్యవసాయం చేయని వారికి కూడా సాయం అందించడం ద్వారా వేలకోట్లు వృథా చేశారు. ప్రజలు చెమటోడ్చి పన్నుల రూపంలో కట్టిన డబ్బులను అధికారంలోకి రాగానే తమ ఇష్టానుసారం ఖర్చు చేయడం దారుణం కాక మరోటి కాదు. అసలు రైతులను గుర్తించి ..పంటలు వేస్తున్నారా లేదా అని చూసి వారికి మాత్రమే సాయం చేయాలి. అధికారంలోకి వొస్తే అన్నీ ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. ఇంతకాన్న దారుణం ఉంటుందా అన్నదే ఆలోచించాలి. నిజానికి రాష్ట్రాలు ఇచ్చే ఉచిత  హావీులను కంట్రోల్‌ చేయలేమని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. దీనిని ఎవరు కంట్రోల్‌ చేయాలి.

దీనిపై అజమాయిషీ ఎవరికి ఉండాలి. రాష్ట్రాలు ఇలా డబ్బులను పంచుతూ దానకర్ణుడిలా పోజులిస్తున్న నేతలను అడ్డుకునే దెవరు అన్నది ఆలోచనచేయాలి. కేంద్రమే దీనిని తమ పరిధిలోకి తీసుకోవాలి. రాజకీయాలు వేరు..అభివృద్ధి వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్‌ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోదీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం ఇచ్చారు. కానీ మోదీ అధికారంలోకి వొచ్చాక రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిధుల కేటాయింపు మొదలు, అభివృద్ధి పనులు కూడా పరస్పర విశ్వాసంతో కొనసాగించాలి. రాష్ట్రాలు తప్పు దోవపడుతున్న సందర్భంలో అవసరమైన హెచ్చరికలు కూడా చేయాలి. ఆయా రాష్ట్రాల ఆర్థిక స్థితిపైనా నీతి ఆయోగ్‌ ద్వారా హెచ్చరికలు చేయడం మంచిదే. ఇకపోతే సిఎంలుగా ప్రతి ఒక్కరూ ప్రధానితో నిరంతరం సవ్నిక్షించుకునే అవకాశాలు ఉండాలి.  రాష్ట్రాల బాగోగులు, సమస్యలు ప్రధాని నేరుగా చర్చించాలి. నీతి ఆయోగ్‌ సమావేశాలను కూడా కనీసం మూడు నెలకో మారయినా సమావేశ పరచి చర్చిస్తే మంచిది. ధాన్యం సేకరణ, నదీజలాల కేటాయింపు సమస్యలు, విద్యుత్‌ సమస్యలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు వంటివి ఏవైనా కేంద్రం కూడా పెద్దన్న తరహాలో రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య బంధం బలోపేతం అవుతుంది. పార్టీలు వేరయినంత మాత్రాన దేశం వేరుకాదన్న విషయం ఆయా రాష్ట్రాల సిఎంలు కూడా గమనించాలి. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అధికారిక సంబంధాలు వేరు. ఆర్థిక సంబంధాలు వేరు.

పాలనాపరమైన విషయాల కోసం కేంద్రంతో నిత్యం సంబంధాలు నెరపాల్సిందే. పార్టీలు ఏవైనా అధికారంలో ఉన్నది ఎవరైనా కేంద్రంతో నిరంతరాయంగా అనుసంధానం అవుతూనే ఉండాలి. కానీ ప్రాంతీయ పార్టీల నేతలు తాము అనుకున్న పథకాలను అమలు చేస్తూ వోటు బ్యాంక్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారు. దీనిని అడ్డుకునేదెవరు అన్నది దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ క్రమంలో ఆర్థిక క్రమశిక్షణ తప్పుతున్న వారిని కట్టడి చేయాల్సిందే. ఏ పథకమైనా చర్చించి తగు సూచనలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉండకుంటే ..రాష్ట్రాలు దివాలా తీస్తాయని గుర్తించాలి. బెంగాల్లో కమ్యూనిస్టులు ఇదే ధోరణిలో 30 ఏళ్ల పాటు రాజ్యమేలారు. తమకు తిరుగు లేదన్న ధోరణిలో వారు ప్రజల ఆశలను, ఆకాంక్షలను పట్టించుకో లేదు. తమ నిరంకుశ పాలనకు ప్రజాస్వామ్యం, అభివృద్ధి ముసుగేసారు. అందుకే ప్రజల్లో గూడు కట్టుకుంటున్న అసంతృప్తిని పసిగట్టడంలో బిఆర్‌ఎస్‌ నాయకత్వం విఫలమైంది. అధికారం అంతా ఒక కుటుంబం వద్దనే కేంద్రీకృతమై ఉందన్న ఆరోపణలతో ప్రజలు కుటంబ పాలన క్షేత్రస్థాయిలో ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వ్నిడియాను దూరం పెట్టారు. ఈ క్రమంలో ఉచిత పథకాలు, డబ్బుల పందేరాలను ప్రకటించే నేతలను దూరం పెట్టాలి. అలాంటి నాయకులకు వోటేస్తే మనకే ప్రమాదం అని గుర్తించాలి.

– ఆర్‌ఎన్‌ఎ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *