Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం పుల్లూరు బండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి23 :సిద్దిపేట గ్రామీణ మండలంలోని పుల్లూరు బండ జాతర చివరి రోజు భక్తజన సంద్రాన్ని తలపించింది. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి కళ్యాణోత్స కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్‌ ‌రావు వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు బండపై ఉన్న ఫంక్షన్‌ ‌హాల్‌ ‌లో నూతనంగా కొలువుదీరిన పాలక మండలిని మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీ నర్సింహా స్వామి ఆలయం దినదిన అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు. స్వరాష్ట్రం సిద్ధించిన వెంటనే పుల్లూరు బండ శ్రీ స్వయంభూ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

భక్తుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కొండపై వివాహాలు చేసుకునేందుకు వీలుగా ఫంక్షన్‌ ‌హాల్‌ ‌నిర్మాణం చేపట్టి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. పుల్లూరు బండ క్షేత్రం లో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండగగా బండ జాతర  జరిగింది. నూతన పాలక వర్గంకు  శుభాకాంక్షలు తెలిపి పాలక వర్గం ఆలయ అభివృద్ధి కి.. ఆధ్యాత్మిక సేవలో భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాలో  ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రం అయిన పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వందల వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది. వంద ఎకరాల ఏకశిలా బండ పై వెలిసిన గొప్ప మహిమాన్వితం శ్రీ స్వయంభూ నృసింహ స్వామి వారు.8 వందల ఏండ్ల క్రితం కాకతీయుల కాలం లో ఇక్కడ దేవాలయం నిర్మించారు.

ప్రతి సంవత్సరం మాఘమ అమావాస్య సందర్భంగా ఇక్కడ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు.ఏ ప్రాంత సాంస్కృతిక.. సంప్రదాయం పల్లె జాతర  మన పుల్లూర్‌ ‌బండ జాతర అన్నారు.ఈ జాతర కు భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారని పేర్కొంటూ.. ఒక నాడు ఈ ప్రాంతంలో సాగు.. త్రాగు నీరు రెండు లేకుండే గత ఏడూ రంగానాయక సాగర్‌ ‌ద్వారా గోదావరి జలాలు బండ కింది నుండి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి స్వామి పాదాలు కడిగామన్నారు.సిద్దిపేట జిల్లాలో ప్రాచీన మైన ,ప్రఖ్యాతి గాంచిన పుల్లూరు బండ  క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కెసీఆర్‌ ‌సహకారం తో గొప్పగా అభివృద్ధి  31 లక్షల ••ణ నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేశామనీ, భక్తుల సౌకర్యం కోసం బండ పైకి వాహనాలు వెళ్లడం కోసం 30 లక్షల రూపాయల తో  సిసి రోడ్డు నిర్మాణం చేశామన్నారు.పుల్లూరు బండ పై 24 గంటలు మంచి నీటి సౌకర్యం కోసం 70 లక్షల రూపాయలతో  1 లక్ష 20 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిషన్‌ ‌భగీరథ వాటర్‌ ‌ట్యాంక్‌ ‌ను నిర్మింప చేశామన్నారు. పుల్లూరు బండ స్టేజీ వద్ద 10 లక్షల రూపాయల తో  దేవాలయ కమాన్‌ ‌ను నిర్మింప చేశాము.. చెప్పారు.50 లక్షల రూపాయల తో దేవాలయం పక్కన కళ్యాణ మండపం నిర్మించామన్నారు.

భవిష్యత్‌ ‌లో పుల్లూరు బండ  క్షేత్రాన్ని  పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆధ్యాత్మికంగా అద్బుతంగా అబివృద్ది జేస్తాం చేస్తామని మంత్రి చెప్పారు. ఈ ఆలయాన్ని కూడా అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామనీదశల వారిగా అలయలని అభివృద్ధి చేస్తున్నామని,రాబోయే రోజులలో మరింత అభివృద్ధి అన్నారు.  ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య చైర్మన్‌ ‌కలకుంట్ల రంగాచారి, గ్రామ సర్పంచ్‌ ‌నరేశ్‌, ‌స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply