బియ్యాల జనార్ధన్ రావు…!!
(నేడు 22వ వర్ధంతి)
ప్రవాహం వంటి జనార్థన్ ప్రయాణం ఆగిపోయి.. ఊరవడివంటి జనార్షన్ ఊపిరి నిలిచిపోయి ఉదృతి వంటి జనార్థన్ ఉలుకుపలుకు ఉడిగిపోయి.. కాల ప్రవాహం లో జనార్షన్ అనే ప్రవాహం కలిసి పోయింది. జనార్థన్ కాలంతో పాటు ఇంకా తన స్వభావాన్ని చైతన్యాన్ని అట్లే కాలంలో భాగంగా కొనసాగిస్తున్నడన్న మాట. సుఖ దుఃఖాలు ప్రేమానురాగాలు ఆత్మీయ స్నేహాలు జ్ఞాపకాలు అనుబంధాలు స్మరించుకునే మనుషులుగా వెతుక్కునప్పుడు ఏదో వెలితి ఏదో కొరత పెట్టే బాధ ఇంక పూడ్చుకోలేమనిపించే నష్టం అందులో ఒక సంపూర్ణమైనటువంటి జనార్ధన్ అట్లా తన జీవనతంలోని మిట్ట మధ్యాహ్నంలో నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసిన వేళలో ఆ ఎగరడంలో ఉన్న శ్రమ పరిశ్రమ వెనక్కిచూడని ఒళ్లు తెలియని పరుగుతో ఉన్న రొప్పు అది గుండె కొలిమిలో ఎగదోసిన మంట వలె అతణ్ని ఆర్పేసింది.
అప్పుడే ఇరవై రెండు సంవత్సరాలు గడిచిపోయింది. ఆరోజు ఫిబ్రవరి 27 యావత్ తెలంగాణ ప్రజలకు దుఃఖం మిగిల్చిన రోజు ఆంధ్ర పాలకులపై అంతర్జాతీయ స్థాయిలో ఆదివాసుల ఆపద్బాంధవుగా అడుగు వేసి జనార్ధన్ అదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు గోదావరి పరివాహక పరివాహక ప్రాంతంలో అడుగుల సవ్వడితో సంకలో సంచి తో విశ్వవిద్యాలయం నుండి అడివంత కలియతిరిగి ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం సంఘర్షణలో అడవి సంపద ఆదివాసులకే దక్కాలని ఆదివాసి భూములు పరాయికరణకు 1/ 70 చట్టాన్ని నిలదీసి నిగ్గు తేల్చిన తెలంగాణ నీళ్ల నిధులు వనరులు ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలన్న నినాదం బతుకు సంఘర్షణలో భాగమైన జనార్ధన్ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు కొట్లాట నేర్పిండు.
జనార్ధన్ బహుముఖం గల మనిషి. అతనిలో ఉన్న స్నేహశీలత కలుపుగోలుతనం.. అతనిలో ఉన్న కలుపుగోలుతనం అన్ని లక్షణాల కంటే అత్యంత ముఖ్యమైనది చదువుకోవడానికి ఒకసారి సంఘర్షణ చేయవలసి వచ్చింది సాధారణంగా అనుకూల పరిస్థితులలో వ్యక్తిగా రూపొందించడానికి కుటుంబం ప్రధాన భూమికగా ఉంటుంది కానీ జనార్ధన్ విషయంలో అలా కాదు సమాజ సమిష్టి కృషివలన పైకి వచ్చాడు చిన్నతనం నుండి తన చుట్టూ స్నేహితులు పెద్ద మొత్తంలో ఉండేవారు అతని కలుపుగోలుతన కలిసివచ్చింది.
రైతాంగ కుటుంబం నుండి వచ్చిన వాడై వ్యవసాయమే అనుభవం కాబట్టి జనార్ధన్ ఎప్పుడు తన కృషిని వ్యవసాయంతో పోల్చుకునే వాడు రైతు నాలుగు రకాల గింజలు వేసి కష్టపడితేనే పంట చేతికి వచ్చినట్టు మనం కూడా నాలుగు రకాల పనులు చేస్తూ మనం అకాడమిక్ బెన్ఫిట్ అవుతూ మన చుట్టూ పిల్లలకు పని కల్పించుతామను కొనేవాడు. ఈ పరంపరలో భాగంగానే అధ్యయన ద్వారా ఏమీ లేని ఆదివాసి యువతకు ఎంతోకొంత ఫెల్లోషిప్ గా డబ్బు ఏర్పాటు చేసి వాళ్ళ అవగాహన స్థాయిని పెంచే ప్రయత్నం చేశాడు.
1984 లో యూనివర్సిటీ లెక్చరర్ గా చేరిన తర్వాత విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో ప్రత్యేకమైన శైలి ఉండాలని నిరూపించుకున్నాడు అప్పటినుండి తన జీవితాన్ని పాఠాలు చెప్పడం, పరిశోధన చేయడం, ప్రజా ఉద్యమాలతో దోస్తీ చేయడం అనే మూడు విభాగాలుగా విభజించుకొని ఈ విభజనలో ప్రాధాన్యతలు మారాయి గాని విషయాలు మాత్రం మారలేదు 80వ దశకంలో పరిశోధనకే ప్రాధాన్యతనిస్తే 90వ దశకంలో ప్రజాస్వామ్య భావాజాలం ప్రచారానికి ప్రాధాన్యతని ఇచ్చాడు .96 నుండి తెలంగాణ ఉద్యమంలో మునిగిపోయాడు ఈ మొత్తం నడకలో అధ్యయన ఫలితాలను రాబట్టడానికి వాటిని విద్యార్థులకు ప్రజలకు విడమరచి చెప్పడానికి ఎంతో కష్టపడ్డాడు.
పరిశోధకునిగా ఉన్నప్పుడే పౌర హక్కుల ఉద్యమాలకు దగ్గరయ్యాడు ఇంద్రవెల్లి ఘటనపై నిజనిర్ధారణ చేసిన కమిటీలో సభ్యునిగా వెళ్లి అరెస్ట్ అయ్యాడు వరంగల్ జిల్లాలో 1982లో కరువు పై పరిశీలన చేసిన బృందంలో జనార్ధన్ ఒకరు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులకు దూరమైన రోజుల్లో విద్యార్థులకు నిరంతరం అధ్యయనానికి అతి చేరువగా ఉండడమే కాకుండా, ఉపాధ్యాయునికి ఉన్న అన్ని అవకాశాలు గిరిజనుల సమస్యలకు కేటాయించి కృషి చేశాడు.
ఆదివాసీల జీవితానికి సంబంధించిన వివిధ సామాజిక ఆర్థిక అంశాలపై నిరంతర పరిశోధన కొనసాగించాడు కాకతీయ యూనివర్సిటీలోనే గాక అంతర్జాతీయ సదస్సులలో ఆదివాసీల జీవితాలపై పత్ర సమర్పణ చేశాడు ఈ విషయంలో దేశంలో అందరికన్నా ఎక్కువ కృషి చేసిన వాడనడంలో సందేహం లేదు.
ఇరవై ఏళ్లుగా గిరిజన ప్రాంతాల్లో గూడాల్లోని సమస్యల్ని అధ్యయనం చేయడమే కాకుండా పరిష్కార ప్రయత్నాలు చేయడం కూడా పనిగా పెట్టుకున్న వాడు గిరిజనుల బ్రతుకుతెరువుల మీద వారి ఆరోగ్యం మీద అణిచివేతలమీద ఎన్నడూ వెనుకడుగు వేయలేదు గిరిజనుల సమస్యల మీద జనార్ధన్కు గల అవగాహన అనుబంధాన్ని గుర్తించిన ఫలంగానే కావచ్చు రాజీవ్ ఫౌండేషన్ ఏర్పరిచినారు దక్షిణ భారతదేశం నుండి కేవలం జనార్ధనే ప్రతినిధిగా ఉంచుకున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాల గిరిజనుల సమస్యతో పేగు బంధాన్ని పెంచుకున్న వాడైనందున అతని మరణానికి రెండేళ్ల ముందు గిరిజనుల స్వయం ప్రతిపత్తి పై రూపొందించిన ప్రకటన (కోషిమా డిక్లరేషన్) పై సంతకం చేసిన అతి కొద్ది మందిలో జనార్ధన్ ఒకరు గిరిజన సమస్యలపై జనార్ధన్ చేసిన అధ్యయనానికి పరిష్కార మార్గానికి నిలువెత్తు సాక్ష్య ప్రాంతీయ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఉద్యమాలు నడపడం ప్రజాస్వామిక హక్క్ఱునని హక్కుల సంఘాలు వెలిబుచ్చిన అభిప్రాయాలు సొంతం చేసుకొని జనార్ధన్ తెలంగాణ సమస్యకు తెలంగాణ రాష్ట్రమే పరిష్కార మార్గమని నమ్మాడు.
రైతు ఆత్మహత్యలు కార్మికుల ఆకలి చావులు, స్త్రీల బలవత్ మరణాలు, ఎన్కౌంటర్ హత్యలు, కోవట్ ఆపరేషన్ ఇవన్నీ ఆంధ్రా పాలకుల పక్షపాత పాలన ఫలితాలని విశ్వసించాడు . తెలంగాణ గత 50 ఏళ్లుగా రక్తం ధారపోస్తున్నది ఈ తెలంగాణ ఇంకా ఇంకా రక్తం ధారపోసేందుకు నెత్తురు లేదు ఇక్కడి ఆకలి చావులు ఆత్మహత్యలు ఇంకా కొనసాగించడానికి వీలు లేదు దీనికి కారణం నీళ్లు నిధులు ఆంధ్రాలో ఖర్చు చేయడమే ఇక్కడి వనరులపై నీళ్లపై, నియామకాలపై తెలంగాణ ప్రజలకు నిర్ణయాధికారం వస్తే తప్ప ఈ మారణహోమం తెల్లారదని ఇందుకు ప్రత్యేక రాష్ట్రం ఏకైక మార్గమని నమ్మాడు ఈ పనిని సాధించడానికి మేధావులు సంపూర్ణంగా కథలాలను చెప్పడానికి దీనిని కట్టుబడి విరామం లేకుండా కదిలించడానికి ప్రయత్నించాడు.
జనార్ధన్ 99 నుండి 2001 ఈ మూడేళ్లు కాకతీయ ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న అధ్యాపకుల దృష్టిలో జనార్దన్ ది అగ్రస్థానం ప్రజలు ఏమి కోల్పోయారో ఎలా కోల్పోయారో వివరించడానికి వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేయడం విశ్లేషించడం ఉపన్యాస నివ్వడం చర్చించడం నిర్మాణాలు ఏర్పరచడం సమన్వయ పరచాలంటే ఉద్యమరూపాలలో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు చేయగలిగితే జనార్ధన్ అన్నింటిని చేయటానికి శ్రమించి చెమటోర్చినోడు మునిగలవీడులో పుట్టి ల్యబర్తి అమ్మమ్మ ఒడిలో పెరిగి అక్షరాభ్యాసం చేసి ఓటాయిలో ఓనమాలు దిద్ది నర్సంపేటలో విద్యనభ్యసించి గోదావరిఖనిలో మేనమామ దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదివి హనుమకొండలోని లాల్ బహదూర్ కాలేజీలో డిగ్రీ నలుగురితో పాటు నడకనిర్చి విద్యాపురిలో విద్యనేర్చి భవితకు పునాది వేసిన ఓరుగల్లులో పోరాట పటిమను పొంది ఉన్నత శిబిరము కు చేరి అందరి తలలో నాలుకై తెలంగాణ జనగానమై ఆదివాసి పల్లె కన్నీరు కారుస్తుందని ఊహించని జనార్ధన్ దూరమై నేటికి కూడా ఇరjైు రెండు ఏండ్లు గడిచిన ఆదివాసి బతుకు పుస్తకమై తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తినిచ్చాడు.
-శోభరమేష్
8978656327





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల