ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఆగస్ట్ 24 : ‘‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(ఎఫ్‌ఐఏ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో నిర్వహించిన ఇండియా డే పెరేడ్‌లో ‘‘అమెరికా తెలుగు ఆసోసియేషన్( ఆటా), న్యూయార్క్‌లో భారత స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఇండియా డే పెరేడ్‌లో పాల్గొనడం జరిగింది. ఈ ఇండియా డే పరేడ్‌లో యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్యతో కలిసి హాజరయ్యారు. ఆటా న్యూ జెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సంతోష్ రెడ్డి కోరం మరియు విలాస్ రెడ్డి జంబుల ఆధ్వర్యములో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతగానో దోహద పడిందని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ రెడ్డి బుజాల ఈ సందర్భముగా మాట్లాడుతూ, భారత దేశ వాసులందరికి అమెరికా తెలుగు ఆసోసియేషన్(ఆటా) తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ని అల్లు అర్జున్‌తో కలిసి ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన ‘పుష్ప’ పిక్చర్‌లోని ‘తగ్గేదేలే’ డైలాగ్ అలానే ఫోజ్ పెట్టడం విశేషమని తెలిపారు. ఆటా తరఫున పెద్ద రథ వాహనాన్ని( ఫ్లోట్) పెట్టి, ఆటా చేస్తున్న తెలుగు కమ్యూనిటీ, ఇతర సేవా కార్యక్రమాలను వాహనంపై• చూపిస్తూ, మన సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు ధరించి, సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్న పిల్లలు ఇషాని రెడ్డి, రిషిత జంబుల, అయాన్ రెడ్డి తుమ్మల, మాన్వి మైకా, ఇతర పిల్లలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోతరాజు మరియు డప్పు కళాకారులను సంతోష్ రెడ్డి కోరం ఏర్పాటు చేయగా ప్రేక్షకులు అభినందించారు. అలాగే, ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ రెడ్డి బుజాల, శరత్ వేముల, ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, రఘువీర్ రెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి, సుధాకర్ పెర్కారి, విజయ్ కుందూరు, శ్రీనివాస్ దార్గులా, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రాజ్ చిలుముల, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, విలాస్ జంబుల కార్యక్రమం జయప్రదం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారని ప్రకటనలో తెలిపారు. ఆటా సభ్యులు శరత్ వేముల మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆటా తరుపున పాల్గొనడం సంతోషముగా ఉందని తెలిపారు.
ఆటా మాజీ ప్రెసిడెంట్ పరమేష్ భీంరెడ్డి, పరశురామ్ పిన్నపురెడ్డి మాట్లాడుతూ..న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, ఫిలడెల్ఫియా, డెలావేర్, మన్‌హట్టన్‌లల్లో నివసించే భారతీయులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దాదాపు ఐదు లక్షలు మందికి పైగా వొచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసారు. శ్రీనివాస్ దార్గులా, విజయ్ కుందూరు, రాజ్ చిలుముల మాట్లాడుతూ ఈ పెరేడ్ గిన్నెస్ వరల్డ్ రికార్డు ఎక్కడం అన్నది భారత ప్రజలకు చాలా సంతోషం అన్నారు. సంతోష్ రెడ్డి కోరం మాట్లాడుతూ..ఈ పెరేడ్‌లో అమెరికా ప్రజలు కూడా ఆనందంగా పాల్గొని ఇండియా పెరేడ్‌ని విజయవంతం చేసారని, పెరేడ్‌లో బాగంగా వందలాది కమ్యూనిటీ సంస్థలు పాల్గొని పలు సంస్కృతికా కార్యక్రమాలు, వివిధ శకటాల ప్రదర్శన జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా ‘‘భారత్ మాతాకీ జై’’, ‘‘వందే మాతరం’’, ‘‘జై హింద్, జై జవాన్-జై కిసాన్’’ నినాదాలతో రామ్ వేముల, లక్ష్మణ్ రెడ్డి అనుగు, శ్రీకాంత్ రెడ్డి తుమ్మల, వంశీ యంజాల, ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపటి, శ్రీధర్ నాగిరెడ్డి, వేణు నక్షత్రం, నందిని దర్గుల, అనురాధ చీములా, వాణి అనుగు, మహేందర్ ముసుకు, వినోద్ కోడూరు, రఘు రెడ్డి, సుధాకర్ పెర్కారి, ప్రదీప్ కట్ట, విలాస్ రెడ్డి జంబుల న్యూయార్క్ విధుల్లో ప్రజలను ఆకట్టుకున్నారు. పెరేడ్‌ను వీక్షిండానికి వొచ్చిన ప్రవాస భారతీయులు మరియు న్యూయార్క్ ప్రజలు నినాదాలు చేసారు. కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్క సందర్భాన్ని ఫోటోల్లో భద్రపరచిన సంతోష్ రెడ్డి కోరం, డిస్క్ జాకీగా వ్యవహరించిన దివ్యకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ అటా నిర్వాహక సంఘం తరుపున సంతోష్ రెడ్డి కోరం కృతజ్ఞతలు తెలిపారు.




