ఆం‌ధ్రులను ద్రోహులుగా చిత్రీకిరంచిన ప్రబుద్దుడు

  • ఎపిలో అడుగుపెట్టే అర్హత కెసిఆర్‌కు లేదు
  • కెసిఆర్‌ ‌జాతీయ పార్టీపై మండిపడ్డ సోము వీర్రాజు

అమరావతి, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పార్టీ పెట్టే అర్హత లేదని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ త్వరలోనే వీఆర్‌ఎస్‌ ‌తీసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు ప్రధాని మోదీ, ఆర్‌ఆం‌ధ్రులను ద్రోహులుగా చిత్రీకిరంచిన ప్రబుద్దుడుఎస్‌ఎస్‌ అధినేతలను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెడుతున్నామని చెప్పి, ఆంధ్రులను పాలేర్లుగా చిత్రీకరించిన కేసీఆర్‌కు ఏపీలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదన్నారు. కుమార్తె కవిత దిల్లీలో మద్యం అమ్ముతూ పట్టుబడితే కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు మతిభ్రమించి ప్రధాని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతలపై విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ‌జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టారు. కేసీఆర్‌కు కొత్త పార్టీ పెట్టే హక్కు లేదు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన కేసీఆర్‌కు ఏపీకి వచ్చే అర్హత లేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతపై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలు సరికాదన్నారు. కేసీఆర్‌ ‌కుమార్తె కవిత దిల్లీ మద్యం కుంభకోణంలో చిక్కుకుందిని దీనికి సమాధానం చెప్పాలన్నారు.

తెలంగాణలో తెరాస ఓటమి ఖాయం. ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌.. ‌వీఆర్‌ఎస్‌ ‌తీసుకోవాల్సి ఉంటుంది. అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిపై మమకారం లేదు. రాజధానిని ఎన్నికల అంశంగా ప్రభుత్వం మారుస్తోందని సోము వీర్రాజు అన్నారు. ••జధాని అమరావతి విషయంలో భాజాపాకు మరో ఆలోచనే లేదని సోమువీర్రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలన్న ఉద్దేశంతోనే కేంద్రం అన్ని విధాల అభివృద్ధి చేస్తోందన్నారు. అమరావతిపై మమకారం లేని పార్టీలు దీన్ని రాజకీయ అంశంగా రాద్దాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం… రైతులను మోసగిస్తోందని, ఇంకా బకాయిలు పూర్తిగా చెల్లించకపోవడం దారుణమన్నారు. సర్పంచ్‌ల నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా భాజపా… ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతుందని వెల్లడించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా పోటీ చేస్తుందని అధిష్ఠానం నిర్ణయించిన అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *