అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత

వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది. కాగా, నిందితుడి కోసం గంటల కొద్దీ వేటాడి.. ఫెడరల్‌ ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ), డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ ‌హోమ్‌ల్యాండ్‌ ‌సెక్యూరిటీ, బ్యూరో ఆప్‌ ఆల్కహాల్‌, ‌టబాకో, ఫైర్‌ ఆర్మ్, ఎక్స్ ‌ప్లోజివ్స్ ‌సహాయంతో ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు.. రాండమ్‌గా కాల్పులు జరిపాడని తెలిపారు.

ఒకరు బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఒకరు, తన కుక్కతో కలిసి నడుస్తుండగా.. వీధిలో నిల్చున్న వ్యక్తిపై కాల్పులు జరిపాడని, కారులో నుండి తననే చూస్తున్న మరో వ్యక్తిని కాల్చాడని పేర్కొన్నారు. హోస్టన్‌లోని టెక్సాస్‌ ‌నగరంలో ఓ ఇంటికి నిప్పుపెట్టిన నిందితుడు.. తర్వాత ముగ్గురు వ్యక్తులపై కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. తొలుత అనేక నివాసాలకు నిప్పు పెట్టిన నిందితుడు.. మంటలకు తాళలేక బయటకు వచ్చిన ఓ ముగ్గురిపై గురిపెట్టి కాల్చాడని హోస్టన్‌ ‌పోలీస్‌ ‌చీఫ్‌ ‌ట్రాయ్‌ ‌ఫిన్నర్‌ ‌తెలిపారు. మంటలను అదుపు చేస్తున్న అగ్ని మాపక సిబ్బంది కూడా నిందితుడి నుండి బారిన పడకుండా..తమను తాము రక్షించుకునే ప్రయత్నాలు చేశారని చెప్పారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. అక్కడకు చేరుకుని ఆ వ్యక్తిని కాల్చి చంపారన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తికి నగరం నుండి బహిష్కరిస్తున్నామని చెప్పిన తర్వాత ఈ ఘటన చోటుచేసు కుంది. కాగా, మరో ప్రాంతంలో ఎన్‌ఎఫ్‌ఎల్‌ ‌ఫుట్‌బాల్‌ ‌ప్లేయర్‌పై వాషింగ్టన్‌లో కాల్పులు జరిగాయి. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *