భూమి కోసం జరిగిన పోరాటంలో ప్రాణాలను అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థంగా తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమర వీరుల స్థూపం నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం)భూమి బదలాయింపు చట్టం -1959 వచ్చింది. దీనికి 1970లో మార్పులు చేశారు దీనినే 1/70 చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు (అమ్మకం, కౌలు, గిఫ్ట్) చెల్లకుండా చర్యలు చేపట్టారు. అడవిపై ఆదివాసీలకే హక్కు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం అంతరించిపోతున్న ఆదివాసీ తెగలను కాపాడడం కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే ఇంద్రవెల్లి సంఘటనకు దారితీసింది. వలసదారుల దోపిడీ నిరాటంకంగా కొనసాగడం, భూముల అన్యాక్రాంతం, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం వలన, జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం అయ్యాయి.
ఆదివాసీలు పోడు చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలని,పండిరచిన పంట,అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేసింది. వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981న ఒక సమావేశానికి పిలుపు నిచ్చింది. ఈ మేరకు తుడుం మోగించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. 20న నిర్వహించ తలపెట్టిన సభకు పోలీసుల అనుమతి కూడా లభించింది. ఆరోజు సోమవారం. ఏప్రిల్ 20,1981వ సంవత్సరం. ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు అది. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఓవైపు సంత (అంగడి) జరుగుతోంది. గతంతో పోలిస్తే జిల్లా నలుమూలల నుండి గిరిజనులు చీమలదండుల ఇంద్రవెల్లికి తరలివచ్చారు. చివరి నిముషంలో సభ నిర్వహణకు అనుమతిని నిరాకరించిన పోలీసులు 144 సెక్షన్ ప్రకటించారు. వందలాది మంది పోలీసులు రంగప్రవేశం చేశారు.
సభకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. మొదలు సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆదివాసుల నుంచి వస్తున్న స్పందనను చూసి సభపై నిషేధం విధించారు. ప్రజలు సభకు రావద్దన్ని ప్రచారం కూడా చేశారు. 144 సెక్షన్ అంటే ఏమిటో కూడా తెలియని అమాయక గిరిజనులు ఇంద్రవెల్లి వైపు కదిలారు. ఎక్కడికక్కడ పోలీసులు గిరిజనులను అడ్డుకున్నారు. అరెస్టు కూడా చేశారు. అయితే పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించక ఇంద్రవెల్లి జనసంద్రంగా మారిపోయింది. అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లో దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన ఆదివాసులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.ఆదివాసీలు బాటపట్టి అడవిలో పరుగులు తిస్తుంటే, పోలీస్ బలగాలు వెంటాడి కాల్చిచంపారు. ఆ జనసందోహంలో పోలీసులకు,. అప్పటి ఆర్.డి.ఓ ఆదేశాలతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల ఘాటనతో గిరిజనులు చల్లాచెదుర్యయారు. కాల్పుల ఘటనలో అనేక మంది గిరిజనులు నేలకొరిగారు.
వందలాది మంది గిరిజనులు గాయాలపాలయ్యారు. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మాత్రమే మృతి చెందారని ప్రకటించారు.

కాని అంతకంటే రెట్టింపు సంఖ్యలోనే గిరిజనులు మృత్యువాతపడ్డారని పౌర హక్కుల సంఘాలు అప్పట్లో పేర్కొన్నాయి. ఆదివాసీలు ఇప్పటికీ ఆ జ్ఞాపకాలను కథలు కథలుగా వినిపిస్తారు. ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావద్దేశం ముక్త కంఠంతో ఖండిరచింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీ లోకం ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ అంటూ నిరసించింది. నాడు ఒక్క ఆదిలాబాద్ జిల్లానే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసిన సంఘటన అది. ఈ ఘటన జరిగి 43 సంవత్సరాలు పూర్తికావస్తున్నా ఆ జ్ఞాపకాలు మాయని గాయంలా ఇక్కడి ఆదివాసి గిరిజనులను వెంటాడుతూనే ఉంది. అయితే కాల్పులకు దారి తీసిన పరిస్థితులు ఏమిటన్నది, అసలు పోలీసులు ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారన్నది ప్రశ్నలు కాగానే మిగిలిపోయాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 ను ఆదివాసీ అమరవీరుల సంస్మరణ దినం ఆదివాసులు జరుపుతుంటారు. నివాళులర్పిస్తూ అర్పిస్తూ వారి త్యాగాలను స్మరించుకుంటున్నారు. కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసుల సంస్మరణార్ధం ఇంద్రవెల్లిలో 83 అడుగుల ఎత్తైన స్థూపాన్ని నిర్మించారు. కాని నిర్బంధం కారణంగా స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పించే పరిస్థితిగాని, సభలు, సమావేశాలు నిర్వహించడం గాని జరగలేదు. గ్రామాల్లోనె గిరిజనులు సంస్మరణ సభలు జరుపుకునేవారు. కాగా 1986లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని డైనమేట్లతో పేల్చివేశారు. అయితే గిరిజనుల్లో గూడుకట్టుకొని ఉన్న నిరాశ, నిస్పృహల తొలగించేందుకు 1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రభుత్వ నిధులతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఏది ఏమైనప్పటికి ఈ ఇంద్రవెల్లి ఘటన అనేక ఉద్యమాలకు బాటలు వేసిందని చెప్పవచ్చు. హక్కుల కోసం గిరిజనుల పోరాటాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
అదే సెంటిమెంట్‌తో, లోక్‌సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యం..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్‌గా మారింది. గతంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో. 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్‌తో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచే ప్రారంభించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు.. సీఎం హోదాలో ఇంద్రవెల్లిలో మళ్లీ రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జిల్లా పర్యటన నేపథ్యంలో సెంటిమెంట్ గా భావించిన ఇంద్రవెల్లి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. 40 ఏళ్ల క్రితం జరిగిన ఇంద్రవెల్లి ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఇంద్రవెల్లి సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి సీతక్కతో పాటు ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి నేతలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

సర్వం తానై మంత్రి సీతక్క ఏర్పాట్లు
ఇంద్రవెల్లి బహిరంగ సభకు మంత్రి సీతక్క అన్ని ఏర్పాట్లు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంద్రవెల్లి సభను శంఖారావ సభగా కాంగ్రెస్ పరిగణిస్తోంది. రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాలను గెల్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఈ సమావేశాన్ని నిర్వ హించింది. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని.. అందుకే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటి సభ కూడా మళ్ళీ అక్కడే నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడిరచారు… ఇంద్రవెల్లి అమర వీరుల స్మృతి వననానికి సీఎం భూమి పూజ చేసారు.. అమరవీరుల కుటుంబాలను అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, ఇక్కడి అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. లక్షమందికి పైగా గిరిజనులు తుడుం మోగిస్తూ హజరయ్యారు.

-నందిరాజు రాధాకృష్ణ,
వెటరన్ జర్నలిస్ట్,
98481 28215
వెటరన్ జర్నలిస్ట్,
98481 28215