అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా 25 కోట్ల మందిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తెచ్చారు. ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా కోట్లాది మంది భారతీయులు ప్రయోజనం పొందుతున్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అనేక మంది పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది.
దేశ ప్రజల ప్రజల మద్దతు బిజెపికే ఉందని, జాతీయ స్థాయిలో నరేంద్రమోదీనే మరొకసారి ప్రధానమంత్రి కాబోతున్నారని రాజకీయ సర్వేలు, రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు. 2014 లో 282, 2019 లో 303 సీట్లను బిజెపి గెలిచి సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తున్న అభివృద్ధిని చూసి దేశ ప్రజలు క్రమక్రమంగా ఆకర్షితులు అవుతున్నారు. అయితే నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న ఘనతను చూసి 2014, 2019 లలో వచ్చిన సీట్ల కంటే 2024 లో జరిగే ఎన్నికలలో బిజెపికి అత్యధిక స్థానాలను ఇవ్వాలని ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చారనేది అర్థమవుతుంది. అందులో భాగంగానే 2024 లోకసభ ఎన్నికలలో బిజెపికి సొంతంగా 370 సీట్లు, ఎన్. డి. ఎ కూటమికి 400 కు మించి స్థానాలలో గెలవాలని బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధిక ఎంపీ స్థానాలలో బిజెపి గెలిచేలా సహకరించాలని, బిజెపికి చెందిన అభ్యర్థులు ఎంపీలుగా గెలిస్తే ప్రజల సమస్యలు మా దృష్టికి త్వరగా వస్తాయని, తద్వారా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశాలు ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను కేటాయించింది. రైల్వే స్టేషన్ల సుందరీకరణ, అభివృద్ధి కోసం పాటుపడుతుంది. 6500 కోట్లతో రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి రాష్ట్రానికి, దేశానికి ఎరువుల సరఫరా అయ్యేలా చేశారు. పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి, పసుపు బోర్డును తెలంగాణకు కేటాయించింది. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిది రాష్ట్రాలు అభివృద్ధి చెందలేవు అనేది స్పష్టమైంది.
ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి పెరుగుతున్న ప్రతిష్ట, నరేంద్రమోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఫలితంగా బిజెపిని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పోటీని ఇవ్వడం లేదు. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కష్టపడాల్సి వస్తుంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కొంతవరకు ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం, కానీ దేశంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను క్షుణంగా పరిశీలిస్తే ఈ రెండు రాష్ట్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో అవినీతి, ప్రముఖ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కాంగ్రెస్ పార్టీని నిండా ముంచాయి. నిరంతరం దేశ వ్యాప్తంగా బీజేపీకి రోల్ మాడల్ గా పేరున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తిరుగులేని ఆధిపత్యాన్ని కనబర్చింది. ప్రధానమంత్రి పీఠాన్ని నిర్ణయించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉనికి కోసం కాంగ్రెస్ పోరాడాల్సి వస్తుంది. తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్ చతికిలపడిరది.
కుటుంబ పాలన, అవినీతి పాలనతో దేశంలో కాంగ్రెస్ పార్టీ క్రమంగా క్షీణిస్తూ వస్తున్న కూడా అమేథీ, రాయ్ బరేలీ లోకసభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ హవానే కొనసాగేది.
అయితే అమేథీ, రాయ్ బరేలీ లోకసభ స్థానాలలో సోనియాగాంధీ కుటుంబ సభ్యులు గెలిచినా కూడా ఆ నియోజకవర్గాలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రెండు నియోజకవర్గాలలో కూడా గెలవడం కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈశాన్య రాష్ట్రాల మాదిరిగానే దక్షిణ భారతదేశంలోనూ భారతీయ జనతా పార్టీ వేగంగా పుంజుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో దక్షిణ భారతదేశంలో కూడా కనీవినీ ఎరగని రీతిలో భాజాపా అత్యధిక స్థానాలలో విజయం సాధించబోతుంది. కేంద్రంలో వరుసగా మూడవసారి బిజెపి అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు రావడంతో దేశ ప్రజలు కూడా బిజెపి వైపే మొగ్గుచూపుతున్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకే ఓటువేస్తే దేశంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని దేశ ప్రజలు గ్రహించారు. అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో దేశ ప్రజలంతా బిజెపిని మూడవసారి ఆశీర్వదించేందుకు సిద్ధమయ్యారు.
– కేతూరి శ్రీరామ్,
ఎంఏ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ.





