ఎనిమిదో స్థానంలో ఆంధప్రదేశ్
ముందు వరుసలో తమిళనాడు..అదే దారిలో యూపి, మహారాష్ట్రలు
లోక్‌సభలో ఉత్తమ్ ప్రశ్నకు కేంద్రం వివరణ
న్యూ దిల్లీ, జూలై 25 : దేశంలోని రాష్ట్రాల అప్పుల జాబితాలో రూ.3.12 లక్షల కోట్ల అప్పుతో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. కాగా తమిళనాడు ముందు వరసలో ఉంది. ఆ తరవాతి స్థానంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. దేశంలోని ఏయే రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనే దానిపై లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి.
వీటి అప్పు సగటున రూ.6 లక్షల కోట్లకుపైనే ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆంధప్రదేశ్ కు రూ.3.98 లక్షల కోట్ల అప్పులు, ఇక జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ కు రూ.5.62 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైగా రుణాలు ఉన్నాయి. కేరళ, మధ్యప్రదేశ్ రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశాయి. రూ.15వేల కోట్లలోపు అప్పులున్న వాటిలో మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, సిక్కిం ఉన్నాయి. ఇదిలావుంటే అప్పులపై జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.



