అనిపిస్తూ వుంటుంది
చుట్టూ మాట్లాడే
ఈ మొహాలు
జీవ దారాలను
అల్లుకుంటూ
వ్యక్తీకరిస్తుంటాయని
అపరిపక్వ పొరల
ప్రస్పుటీకరణను
మెదడు మడతల్లో
దేహం అలసత్వపు
నీర్లక్ష్యం వేర్లు
ఊడలమర్రిలా
తలకిందులుగా
గబ్బిలంలా వేలాడబడి
శబ్దాల
కనుమరుగులు
జాడలు కొన్ని
మధ్యాహ్నాలు
ఆకాశంలో
దూది పిందెల్లా
మేఘాల వరస
పరుచుకుని
ఆలస్యంగా
కదులుతాయి
ఆదర్శాలు
వ్యాఖ్యానాలు
నదీప్రవాహాన్ని ఆపినట్లు
పిడివాద సిద్ధాంతాలు
కిటికీలను మూసినట్టు…
– రఘు వగ్గు
: 9603245215




