Take a fresh look at your lifestyle.

అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దోపిడి…

  ఒక్కో కళాశాలలో  దాదాపు 1000 సీట్లుంటే 300 సీట్లు బీ కేటగిరి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్క సీటును 10 లక్షల నుండి 20 లక్షల వరకు అమ్మితే ఒక్కో కళాశాలలో 30 కోట్ల నుండి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం బీ కేటగిరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ వ్యాపారాన్ని ఆపరు. ఈ రకంగా మంచినీటికి బదులుగా బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగడం యాజమాన్యాలకు అలవాటైపోయింది. చివరికి ప్రభుత్వాలను శాసించి,  తమ కళాశాలల ఫీజులను  35 వేల రూపాయలు నుండి రెండు లక్షల 90 వేల వరకు పెంచుకొనే స్థాయికి ఎదిగాయి. దీనికి ప్రతిఫలంగా,   ప్రభుత్వాలు  కూడా ఒక దశలో యాజమాన్యాలతో తమ గొంతెమ్మ కోరికలకు తీర్చుకునేవారు. ఇలా యాజమాన్యాలు ప్రభుత్వం చేతులు కలిపి ఇంజనీరింగ్ విద్యను అంగట్లో సరుకులాగా మార్చారు.  

మన  దేశంలో  మొదటి నుండి విద్యకు అధిక ప్రాధాన్యం ఉండేది. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా, ప్రపంచంలో విద్య తన రూపాన్ని మార్చుకుంటూ కొత్త పుంతలు తొక్కుతూ వచ్చింది.

రోజురోజుకు కంప్యూటర్  మీద ఆధారపడి బతకడం పెరిగిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల అవసరం పెరిగిపోయింది. దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ విద్య ప్రాముఖ్యం పెరిగిపోయి అందులోనూ,  కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కి మరింత ప్రాముఖ్యత పెరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

అయితే ఆనాడు దేశంలో మరియు రాష్ట్రంలో ఒకటి రెండుగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు,  సామాన్యులు బీద బడుగు బలహీన వర్గాల  విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వాలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేశారు. అయితే ఒక దశలో ప్రపంచ అవసరాలకు అనుగుణంగా కావలసిన సంఖ్యలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీర్లను అందించలేకపోయాయి .

ఆ సమయంలో సాధ్యమైనంత ఎక్కువమందికి ఇంజనీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం కొంతమంది పేరు మోసిన వ్యక్తులు మధ్యలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటుచేసిన ఆలోచనను చేసింది, అదే అదునుగా ఆ ఆలోచనతోనే ఉన్న కొంతమంది పెద్ద పెద్ద మనుషులు ప్రైవేట్ కళాశాలలను  నడిపిస్తాం అని ప్రభుత్వాన్ని సంప్రదించారు. ప్రభుత్వం కళాశాలలకు వెంటనే  అనుమతులను మంజూరు చేసింది.  ఆవిధంగానే నేడు పేరు మోసిన కళాశాలలు సిబిఐటీ, శ్రీనిధి విఎన్ఆర్,గోకరాజు రంగరాజు,వాసవి,సీవీఆర్  ఇంజనీరింగ్ కళాశాలలు ఒక్కొక్క వృత్తాంతంతో ఏర్పడినప్పటికీ చివరికి ఇంజనీరింగ్  విద్యను అయితే అందిస్తాయి అనే సదుద్దేశంతో ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే ఇప్పటికి సైతం ఇంజనీరింగ్ విద్య కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైంది. 

 

ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు చిట్టచివరి వ్యక్తి వరకు విద్య, వైద్యం, గృహం,  మరియు చదువుకోవాలనుకున్న ప్రతి విద్యార్థికి ఇంజనీరింగ్ విద్యను అందించాలనే  లక్ష్యంతో గౌరవనీయులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్  పథకాన్ని తీసుకోవచ్చారు. ఈ పథకం కారణంగా లక్షలాదిమంది బీసీ విద్యార్థులు, మైనార్ఠీ విద్యార్థులు, ఈబీసీ విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ విద్యను చదువుకోగలిగారు. ప్రపంచపు అభివృద్ధిలో తమ పాత్రను పోషించే విధంగా ఈ పథకంతో సాధ్యపడింది. పాఠశాలకు వెళ్ళి,  నల్ల పలకలను సైతం తాకలేమనుకున్న లక్షలాది మంది, తమ చేతులతో కంప్యూటర్ స్క్రీన్ లను తాకగలిగి, ఊరి పొలిమేరలు సైతం దాటని చాలామంది కుటుంబాల నుండి సైతం తమ కొడుకు, కూతురు హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, అమెరికా, లండన్ వరకు వెళ్లగలిగారు. ఈ విషయాలన్ని ఆసరాగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో యాజమాన్యాల ధనార్జన  ఆశల కారణంగా, వందల కొద్ది ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, విద్యా వ్యాపారానికి,  ఇంజనీరింగ్ విద్యను అంగట్లో సరుకుగా మార్చారు దీని పట్ల తెలంగాణ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. . అప్పటికీ కూడా నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య అందక విద్యార్థులు సతమతమవుతున్నా , విద్య వ్యాపారం కారణంగా  ఇంజనీరింగ్ విద్యను భ్రష్టు పట్టించారు.  క్యాంపస్ ప్లేస్మెంట్  ల పేరుతో ఫేక్ ఆఫర్ లెటర్లను చూపిస్తూ రోజురోజుకు ఇంజనీరింగ్ విద్యపై మోజును పెంచేశారు . ఇంజనీరింగ్ రంగం కారణంగా ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలను కల్పించారు.   ఈభ్రమలతోనే  విద్యార్థులను, తల్లి తండ్రులకు ఆశలు కల్పించి తమ విద్యా వ్యాపారంలో  భాగస్వామ్యం చేసి విద్యార్థులను తల్లి తండ్రులను సైతం విస్మయానికి గుర్తు చేసారు.

 

మొదట ప్రభుత్వం ఇచ్చే 35 వేల రూపాయలకే ఇంజనీరింగ్ విద్యను బోధిస్తాం అని హామీలు ఇచ్చి, రాను రాను తమకు 35000  సరిపోవట్లేదు అని ప్రభుత్వాలను శాసించే స్థాయికి యాజమాన్యాలు ఎదిగాయి. అంతే కాకుండా దాదాపుగా 40 కళాశాలలు అటానమస్ కళాశాలలు గా ఏర్పడ్డాయి. అంతే కాకుండా  యాజమాన్యాలు గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క రాజకీయ పార్టీతో బంధుత్వాలు ఏర్పాటు చేసుకొని ఇంజనీరింగ్ కళాశాల దోపిడీని బీ కేటగిరి సీట్ల దందా ను అధికారికంగా చేయడం మొదలుపెట్టటం పట్ల రాష్ట్ర ప్రజానీకం , విద్యార్ది లోకం తీవ్ర దిగ్భారంతి కి గురవుతున్నారు.

 

 ఒక్కో కళాశాలలో  దాదాపు 1000 సీట్లుంటే 300 సీట్లు బీ కేటగిరి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్క సీటును 10 లక్షల నుండి 20 లక్షల వరకు అమ్మితే ఒక్కో కళాశాలలో 30 కోట్ల నుండి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం బీ కేటగిరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ వ్యాపారాన్ని ఆపరు. ఈ రకంగా మంచినీటికి బదులుగా బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని తాగడం యాజమాన్యాలకు అలవాటైపోయింది. చివరికి ప్రభుత్వాలను శాసించి,  తమ కళాశాలల ఫీజులను  35 వేల రూపాయలు నుండి రెండు లక్షల 90 వేల వరకు పెంచుకొనే స్థాయికి ఎదిగాయి. దీనికి ప్రతిఫలంగా,   ప్రభుత్వాలు  కూడా ఒక దశలో యాజమాన్యాలతో తమ గొంతెమ్మ కోరికలకు తీర్చుకునేవారు. ఇలా యాజమాన్యాలు ప్రభుత్వం చేతులు కలిపి ఇంజనీరింగ్ విద్యను అంగట్లో సరుకులాగా మార్చారు.

 

అయితే ఇక్కడ ప్రభుత్వం మీద కూడా అధిక ఆర్దిక భారం పడ్డదేం లేదు, అదనంగా  మళ్ళీ విద్యార్థులపైనే  అధిక ఫీజు భారం పడింది. ఈ రకంగా నాడు ఎన్నో ఉన్నత ఆశలతో ఏర్పాటు చేసిన ఫీజు రీ యింబర్సమెంట్   పథకాన్ని తూట్లు పొడిచారు, అదే విధంగా నాడు ఎన్నో ఉన్నత ఆశయాలతో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాలలను మనీ కలెక్షన్ కేంద్రాలుగా తయారు చేశారు. యాజమాన్యాల ధనార్జన, ప్రభుత్వ దివాలా కోరుతనం కారణంగా దారిద్రరేఖకు దిగువనున్న లక్షల మంది విద్యార్థుల జీవితాల్లో ఇంజనీరింగ్ విద్య కలగానే  మిగిలింది.

 

ఈ దోపిడీ చాలదన్నట్లు కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో మేము చాలా నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని భ్రమలను  కల్పించి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలుగా ఏర్పడి విద్యా వ్యాపారాన్ని అధికారికం చేసాయి. ఒక్కొక్క ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కో సిఎస్ఈ  సీటు  10 లక్షలకు అమ్ముకోవడం ప్రారంభించారు. అటువంటి సీట్లు ఇంజనీరింగ్ కళాశాలలో 110 నుండి 200 ఉన్నాయి. అటానమస్ పేరుతో అడ్మిషన్లు చేసుకుని తదనంతరం  అటెండెన్స్ పేరు మీద,  ఇంటర్నల్ మార్కుల పేరుతో  ఒక్కో  విద్యార్థి దగ్గర లక్షల రూపాయలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.  అయితే ఒక పక్క కళాశాలకు వెళ్లినా,  వెళ్లకపోయినా అటెండెన్స్ వస్తుంది, మార్కులు వస్తుంది అనే విషయాలకు ఆశ పడిన కొంతమంది విద్యార్థుల కారణంగా అటానమస్ కళాశాలలను అందలం ఎక్కించారు.  ఒక్కొక్క కళాశాలలో వందల కోట్ల వ్యాపారం కేవలం బి కేటగిరి సీట్లు మరియు అటెండెన్స్, మార్కుల పేరు మీదనే ఒకే విద్యా సంవత్సరంలో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.  కొంత ధనాన్ని  ఎలక్షన్ ఫండ్గా  చెల్లించి, కళాశాలలు అడ్డదారిలో  ధనార్జనకు   అలవాటు పడి, తప్పుడు మార్గాల్లో, తప్పుడు పద్ధతిలో కళాశాల నడిపించడం అంతే కాకుండా తప్పుడు కంపెనీలను సైతం తీసుకోవచ్చి ఉద్యోగాలు ఇప్పించినట్లుగా చూపిస్తున్నాయి.

ఇవి చాలావన్నట్లు ఇప్పుడు విద్యా వ్యాపారానికి ఇంజనీరింగ్ యాజమాన్యాలు మరొక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు, అవే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అనుమతులు లేకుండానే వేలకొద్ది  అడ్మిషన్లు  చేయడం, తర్వాత ప్రభుత్వాన్ని మేనేజ్ చేయడం, ఆ తర్వాత కోర్టులను ఆశ్రయించి అనుమతులు తెచ్చుకోవడం రొటీన్ గా మారిపోయింది. ప్రభుత్వం ఇకనైనా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల అనుమతులు మంజూరు చేసేటప్పుడు యూజీసీ నేరుగా అనుమతులు ఇవ్వకుండా, స్థానికంగా  అఫ్ఫిలియేషన్ ఇస్తున్నటువంటి విశ్వవిద్యాలయ అధికారులతో చర్చించి,  తమ దగ్గర ఉన్నటువంటి ప్రొఫెసర్ల ర్యాటిఫికేషన్  రిపోర్టులను, ఫ్యాక్ట్  ఫైండింగ్ కమిటీ రిపోర్ట్‌ను  చూసి,  సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులతో చర్చించిన తర్వాతనే అటానమస్ కానీ ప్రైవేటు విశ్వవిద్యాలయ అనుమతులు గాని మంజూరు చేసి, ఇంజనీరింగ్ విద్యా రంగాన్ని కాపాడాలని,  తెలంగాణ విద్యార్థి సమాజం కోరుకుంటుంది.

 

 ప్రభుత్వం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల దోపిడిని, అటానమస్ పేరుతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు  చేస్తున్న బీ కేటగిరి సీట్ల దందాను, ప్రైవేటు విశ్వవిద్యాలయాల పేరుతో బీద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలను ఆగం  చేస్తున్న యాజమాన్యాలను ప్రభుత్వం కట్టడి చేసి నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందరికి అందజేసేలా, అందరికి అందుబాటులో ఉండేలా, ప్రభుత్వం చొరవ చూపి సామాన్యుడికి నమ్మకం కలిగేల  ఇంజనీరింగ్ విద్యా రంగాన్ని బలోపేతం చేసి సమాజం కోరుకుంటున్నట్లుగా  భారతదేశ విద్యా హక్కు  చట్టం ప్రకారం విద్య అనేది సేవ కనుక అది వ్యాపారం కాదు కనుక కేవలం విద్యను సేవ  లాగా చూస్తూ విద్యార్థుల లోపల విద్య అంటే జీవితం కోసం, జీవితం  దేశం కోసం, విద్య మేధస్సు కోసం, మేధస్సు దేశ అభివృద్ధి కోసం అనే ఆలోచన తీరును అభివ్రృద్ది  చేయాలి. ఇంజనీరింగ్ యాజమాన్యాల తీరు మార్చుకునేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇంజనీరింగ్ విద్యను  గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ సభ్య సమాజం భావిస్తుంది.

 

 

జవ్వాజి దిలీప్ సాహూ, ఎంటెక్,

సామాజిక కార్యకర్త,

780 100 9838,

javvajidileep309@gmail.com

 

Leave a Reply