అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

అగ్ని వలన జరిగే ప్రమాదాలను అగ్ని ప్రమాదాలు  అంటారు. ఇవి వేడి ఎక్కువగా ఉండే వేసవి కాలంలో ఎక్కువగా జరుగుతాయి. ఈ ప్రమాదాల వలన ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. పాదచారులు, గుర్తు తెలియని వ్యక్తులు బీడీలు, సిగరెట్లు తాగి వాటిని ఆర్పకుండా అలాగే పారేస్తుం డటంతో అవి అంటుకొని మంటలు పాకి ప్రమాద ఘటనలు తరచుగా జరుగుతున్నాయి.అగ్నిమాపక శాఖను కేవలం అగ్నిప్రమాదాలకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, వానలు, వరదలు, భూకంపాలు… ఇతర ప్రాణాపాయ పరిస్థితులు ప్రజలకు ఏర్పడినప్పుడు విపత్తుల శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారు. బాధితులు, ఆర్తులకు అవసరమైన సేవలు అందించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నిస్తారు. 101 నెంబరుకు ఫోన్‌ ‌చేస్తే శాఖాపరంగా బాధితులకు అవసరమైన సేవలు అందిస్తారు. అగ్ని ప్రమాదం సమయంలో ప్రతి క్షణం విలువైనది. వీలైనంత మేరకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించ గలిగితే, ఎక్కువ నష్టం కలుగకుండా నివారించ వచ్చు. ఆస్తి, ప్రాణనష్టం లేకుండా చూడవచ్చు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు ఫోన్‌ ‌చేసి వివరాలను తెలియ చేయాలి. ప్రమాద సంఘటన గురించి వివరించాలి.

విద్యుదాఘాతం, ఎండ వేడిమి ప్రమాదాలకు కారణాల వుతున్నా,  ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే బీభత్సాలను పక్కన పెడితే మనిషి అజాగ్రత్త వల్ల జరిగే అగ్నిప్రమాదాలే ఎక్కువ జరుగుతున్నాయి. ఎండా కాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా పెద్దపెద్ద అగ్నిప్రమాదాలు జరిగే ఆస్కారముంది. ముందు జాగ్రత్తగా కొన్ని నియమాలను పాటిస్తే వాటిని అరికట్ట వచ్చు. రద్దీ ఎక్కువగా ఉండే  ప్రదేశాల్లో ప్రమాదాలు సంభవించిన ప్పుడు కంగారు,  అయోమ యానికి గురికాకుండ  ఉండాలి. గందరగోళం తొక్కిసలాటకు దారితీసి, అగ్ని ప్రమాదం కన్నా పెద్ద దుర్ఘటనకు కారణం కావొచ్చు. ఆసుపత్రులు, హోటళ్ళు, షాపింగ్‌ ‌కాంప్లెక్సుల చుట్టు ఫైర్‌ ఇం‌జన్‌ ‌తిరిగేందుకు వీలుగా అవసరమైన ఖాళీ స్థలం ఉండాలి. భవనాలు చుట్టూ,  ముందు భాగంలో  గాలి వెలుతురు వచ్చే కిటికీలు ఏర్పాటు చేయాలి. భవనాలు ముందు పెద్ద సైజ్‌ ‌హోర్డింగ్‌లు ఏర్పాటు చేయకూడదు. అధిక నీటి సామర్థ్యం గల ట్యాంకులను అమర్చుకోవాలి. నీళ్ళు తోడటానికి అనువుగా మోటార్‌ను అమర్చాలి. భవనాలకు ఒకే స్టెయిర్‌ ‌కేసు కాకుండా అత్యవసర సందర్భాల్లో ఉపయోగించ టానికి మరో స్టెయిర్‌కేస్‌  ‌సమకూర్చు కోవాలి. ఎమర్జెన్సీలో విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోయేలా సర్క్యూట్‌ ‌బ్రేకర్లు అమర్చుకోవాలి. విద్యా సంస్థలు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు, సినిమా హాళ్లు తదితర వాటిల్లో కచ్చితంగా అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి.
ఇళ్లల్లో వంట గ్యాస్‌కనెక్షన్లు, వాటి ఫిట్టింగులు సరిగ్గా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు సరిచూసు కోవాలి.

స్టౌ మండుతున్న సమయంలో జాగ్రత్త అవసరం. మండుతున్న పొయ్యికి దూరంగా ఉండి వస్తువులను ఉపయో గించాలి. అగ్గిపెట్టెలు, లైటర్లు, కిరోసిన దీపాలను దూరంగా ఉంచాలి. కాగితం వంటి మండే పదార్థం , వస్త్రం, కలప, పెయింట్స్, ఎల్పిజి సిలిండర్లు, ప్లాస్టిక్‌ ‌సాధారణంగా భవనాలలో నిల్వ చేయ బడతాయి. ఇది ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా దీపావళి సందర్భంగా  బాణాసంచా కాల్చడం వల్ల సామాన్యంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వీటి పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలి. అగ్ని ప్రమాదం సంభించినపుడు ఇంటి తలుపులు మూసి పొరుగు వారిని పిలవాలి. ప్రమాదం జరగగానే అగ్నిమాపక కేంద్రానికి సమాచార మందించాలి. అగ్ని ప్రమాదం జరిగినపుడు కంగారు పడక, జాగ్రత్తగా వ్యవహరించాలి.దుస్తులకు నిప్పంటు కున్నప్పుడు పరుగెత్తడానికి ప్రయత్నించక, నేలమీద పడుకుని దుప్పటి లేదా రగ్గు శరీరం మొత్తం చుట్టుకుని పొర్లటం వల్ల మంటలను అర్పు కోవాలి.  ఒళ్లు కాలి గాయమైతే వదులుగా ఉండే దుస్తులను ధరించి వైద్యుడి దగ్గరకెళ్లి చికిత్స చేయించుకోవాలి.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
    9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *