అంతరిస్తున్న చిత్తడి నేలలు జీవ మనుగడకే ప్రశ్నార్థకాలు

‘‘‌నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా అంతరించి పోవడం జరిగింది. జీవ జాతుల్లో దాదాపు 40 శాతం వరకు చిత్తడి నేలల్లోనే నివసిస్తున్నాయి. చిత్తడి నేలల నుంచే మానవాళికి మంచి త్రాగే నీరు లభిస్తోంది.’’

నేడు ‘‘ప్రపంచ చిత్తడి నేలల దినం’’

02 ఫిబ్రవరి 1971న ఇరాన్‌లోని ‘రామ్సర్‌’ ‌నగరంలో నిర్వహించిన తొలి చిత్తడి నేలల ప్రాముఖ్యతకు సంబంధించిన అంతర్జాతీయ ‘రామ్సర్‌ ‌సదస్సు’కు గుర్తుగా ప్రతి ఏట ఫిబ్రవరి 02న ‘ప్రపంచ చిత్తడి నేలల దినం(వరల్డ్ ‌వెట్‌లాండ్‌ ‌డే)’ను వేడుకగా, అవగాహన కార్యక్రమంగా నిర్వహించుట జరుగుతోంది. నీటితో నిండి ఉన్న చిత్తడి నేలలుగా సరస్సులు, నదులు, చెరువులు, కుంటలు, వరద మైదానాలు, తడి నేలలు, తీర ప్రాంత చిత్తడి నేలలు, మడ అడవులు, చేపల చెరువులు, వరి మడులు, మడుగులు, మానవ నిర్మిత నీటి నిల్వలు లాంటి నిర్మాణాలు వస్తాయి. 1900వ ఏటి నుంచి నేటి వరకు చిత్తడి నేలలు సగానికి పైగా అంతరించి పోవడం జరిగింది. జీవ జాతుల్లో దాదాపు 40 శాతం వరకు చిత్తడి నేలల్లోనే నివసిస్తున్నాయి. చిత్తడి నేలల నుంచే మానవాళికి మంచి త్రాగే నీరు లభిస్తోంది.

ప్రపంచ చిత్తడి నేలల దినం-2023 నినాదం :
దీర్ఘకాలం పాటు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు లేదా వెట్‌లాండ్స్‌గా నామకరణం చేశారు. ప్రపంచ మానవాళికు, భూగోళానికి, జల వనరులకు మధ్య విడదీయరాని సంబంధం ఉంది. నీటి కొరత తగ్గించడం, జీవ జాతులకు తాగు నీరు అందుబాటులో ఉంచడం, వ్యవసాయానికి సాగు నీరు అందించడం, భూగర్భ జలాలను పెంచడం లాంటి ప్రయోజనాలు కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, చిత్తడి నేలలను నిర్మించడం లాంటి చర్యలు చేపట్టాలని గుర్తించిన ఐరాస ప్రతి ఏట 02 ఫిబ్రవరిన ప్రపంచ చిత్తడి నేలల దినం పాటించుట ఆనవాయితీగా మారింది. ‘ప్రపంచ చిత్తడి నేలల దినం-2023’ నినాదంగా ‘చిత్తడి నేలల పునరుద్ధరణ సమయం ఆసన్నమైంది (ఇట్‌ ఈజ్‌ ‌టైమ్‌ ‌ఫర్‌ ‌వెట్‌లాండ్‌ ‌రీస్టొరేషన్‌)’ అనబడే అంశాన్ని తీసుకున్నారు.

చిత్తడి నేలల ప్రయోజనాలు :
ప్రపంచ తాగు నీటి కొరత సంక్షోభాన్ని అధిగమించడానికి చిత్తడి నేలలను కాపాడుకోవడం తక్షణావసరమని తెలుసుకోవాలి. నేల, నీరు, జీవికి అవినాభావ సంబంధం ఉన్నది. వీటి మధ్య సమతుల్యత లోపిస్తేనే భూగోళంపై పర్యావరణ ఆరోగ్యం విచ్ఛిన్నం అవుతుంది. చిత్తడి నేలల్లో అధిక శాతం మంచి నీటి నిల్వలే ఉన్నాయి. చిత్తడి నేలల్లోకి మంచి నీటి నాణ్యత, లభ్యతల పట్ల సామాన్యులకు అవగాహన కల్పించాలి. వెట్‌లాండ్‌ ‌ప్రయోజనాల్లో పరిశుద్ద మంచి నీటి లభ్యత, నీటి కొరత తీర్చడం, జీవావరణ పరిరక్షణ, జీవనోపాధి కల్పన, జీవ వైవిధ్య పరిరక్షణ, తుఫానులను అదుపు చేయడం, కార్బన్‌ ‌నిల్వలు, వాతావరణ మార్పులు, ఆరోగ్య పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి, జలచరాల పోషణ లాంటివని అనేకం వస్తాయి.

ప్రపంచ చిత్తడి నేలల దినం కార్యక్రమాలు :
ప్రపంచ చిత్తడి నేలల దినం వేదికగా చిత్తడి నేలల పరిరక్షణ పట్ల అవగాహన, సమావేశాలు, వెబినార్లు, ప్రదర్శనలు, జనావాసాల్లో వెట్‌లాండ్స్ అం‌శాల్లో పరుగు/ర్యాలీ/బైక్‌ ‌ర్యాలీ/వ్యాసరచన/ఉపన్యాస/క్విజ్‌ ‌పోటీల నిర్వహణ, ప్రచార మాద్యమాల్లో నిపుణులచే ప్రసంగాలు, కరపత్రాల పంపిణీ, బ్యానర్ల ఏర్పాటు లాంటిపలు కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 1700వ ఏడాది నుండి నేటి వరకు 90 శాతం చిత్తడి నేలలు అంతరించి పోయాయని, అడవుల కన్న చిత్తడి నేలలు మూడు రేట్లు త్వరగా అంతరిస్తున్నాయని గమనించారు. హరిత సంపదలతో పాటు నీలి నీటి నిల్వలు కూడా జీవకోటితో పాటు మానవాళి మనుగడకు పునాదులుగా నిలుస్తున్నాయని సమాజానికి గళమెత్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందిని మరువరాదు.

రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సులు :
ఇండియాలో 4.7 శాతం చిత్తడి నేలలు ఉన్నాయి. పట్టణీకరణ పెరిగిన కొద్దీ చిత్తడి నేలల వైశాల్యం తరుగుతోంది. చిత్తడి నేలలను పరిరక్షించడానికి ప్రభుత్వాల వద్ద నిర్దిష్ట ప్రణాళికలు లేకపోవడం విచారకరం. రామ్సర్‌ ‌సదస్సులో ప్రారంభైన చిత్తడి నేలల పరిరక్షణ ఉద్యమాల్లో భాగంగా ప్రపంచ దేశాల్లో ఉన్న చిత్తడి నేలలను ‘రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సులు’గా పిలుస్తున్నారు.  ప్రపంచవ్యాప్తంగా 2,400 రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సులు ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో ఉన్న 42 రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సులలో 08 యూపీలో, 06 పంజాబ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలోని కోల్లేరు కూడా రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సుగా జాబితాలో చోటు దక్కించుకుంది. మన దేశంలో అతి పెద్ద రామ్సర్‌ ‌వెట్‌లాండ్‌ ‌సరస్సుగా ఒరిస్సాలోని చిలికా సరస్సు, అతి చిన్నదిగా హిమాచల్‌లోని రేణుక సరస్సు గుర్తింపు పొందాయి. నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణకు చత్తీస్‌ ‌నేలల్లో భాగమైన చెరువులు, సరస్సులు, కుంటలు, మానవ నిర్మిత నీటి నిల్వలను కాపాడుకోవలసిన కనీస బాధ్యత మనందరి మీద ఉన్నది. జలంతోనే జీవనమని, ఎండిన నేలలు జీవ వినాశకాలని తెలుసుకోవాలి. అలాంటి చిత్తడి నేలలను కాపాడుకుందాం, ప్రాణాలను నిలుపుకుందాం.

image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *