– అమరుల కుటుంబాలకు పంచి నిజాయతీ చాటాలి
– టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 9: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోని రూ.1,400 కోట్లు అమరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆ డబ్బు క్విడ్ ప్రోకో ద్వారా వచ్చింది కాదా అని ప్రశ్నించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెంలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తమ పార్టీతో భయం లేదంటూనే ఈసీకి వెయ్యికి పైగా ఫిర్యాదులు ఇచ్చారని, టీఆర్ఎస్ పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి నీతినియమాలు అంటూ ఏ లేవా.. తల్లి, చెల్లి అనే సభ్యత మరిచి పార్టీ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు అని విమర్శించారు. తన కంఠంలో ప్రాణముండగా మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్లనని స్పష్టం చేశారు. తన పోరాటాలు ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, భాజపా చేతులు కలిపాయని ఆరోపించారు. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు క్విడ్ ప్రోకో కింద కేటీఆర్ అక్రమ పర్మిషన్లు ఇచ్చారని. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో హరీశ్‌రావు అనకొండ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఆయన్నే ముందు పెడుతోందని. ఆ పార్టీ ఈ జన్మలో బాగుపడదు.. అధికారంలోకి రాదు. పెద్దాయనకు మరకలు అంటించిన ఆయనకు మూడు నెలలు మంత్రి పదవి కావాలంట.. కేటీఆర్ ఇటీవల రూ.188 కోట్లతో ఓ ఇంగ్లిష్ పత్రిక కొన్నారు.. ఫీనిక్స్ సంస్థకు రూ.80వేల కోట్ల విలువైన భూముల కట్టబెట్టారు., ఆ సంస్థ రూ.33 లక్షల టన్నుల కలప కొట్టేస్తోందని కవిత ఆరోపించారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి
కవిత గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 భూగర్భ గనిని సందర్శించారు. గని ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె కార్మికులనుద్దేశించి మాట్లాడారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి గోదావరిఖనిలో నిరాహార దీక్ష చేపడతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శాసన సభలో నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలన్నారు. కార్మికులకు హెచ్ఎంఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సి ఉండగా నామమాత్రపు జీతాలు ఇస్తున్నారని కవిత మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





