హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్ర నూతన సీఎస్ సంజయ్ జాజు గురువారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌లను వారివారి నివాసాలలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు సీఎస్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





