ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా రంజక సంక్షేమ పాలన పట్ల ప్రజల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎల్. బి నగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. కొత్తపేట్ డివిజన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు,శృంగేరి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.చంద్రశేఖర్(కన్నయ్య) ముదిరాజ్ బృందం 100 మంది నాయకులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ సీఎం ప్రవేశపడ్డాను సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టారని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్నే అభివృద్ధి పదంలో తీసుకు వెళ్తున్నట్టు చెప్పారు. పార్టీ లో చేరిన చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి నచ్చి బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లేశం,వెంకటేష్,నర్సింహా,అరు