ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని బిసి కాలనీలో అసంపూర్తిగా ఉన్న హోలీయ దాసరి సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నేత, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రూ.1 లక్ష .. 3నెలల క్రితం అందజేయడం జరిగిందని ఇప్పటి వరకు ఈ భవన నిర్మాణానికి 2 లక్షల రూపాయల సహాయం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. హోలీయ దాసరి సంఘం కోరిక మేరకు అసంపూర్తిగా వున్నా మా కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని చూసి, తన వంతు సహాయంగా రూ. 2 లక్షలు అందించి, నిర్మాణం పూర్తి కావడానికి సహకరించిన రాఘవేందర్ రెడ్డికి సంఘం నాయకులు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బిట్టు రాములు, గౌరవ అధ్యక్షులు ఉప్పు సత్యనారాయణ, రాములు, మాజీ సర్పంచ్ శ్రీరాములు, సాయిలు, ఎల్లయ్య, లక్ష్మి నర్సింహ, లక్ష్మినారాయణ, గణేష్, సురేష్, సాయిబాబు, చిన్న రాములు తదితరులు పాల్గొన్నారు.