పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: రుద్రారం నుంచి చందానగర్ వరకు గల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. రెండు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికలలో అనిల్ కుమార్ రెండు ఓట్ల తేడాతో కృష్ణ యాదవ్ పై విజయం సాధించారు.నూతనంగా ఎన్నికైన అనిల్ ప్యానల్ చిట్కుల్ లో నీలం మధు ముదిరాజ్ ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్,జనరల్ సెక్రెటరీ లక్ష్మారెడ్డి తో పాటు కమిటీ సభ్యులందరికీ నీలం మధు ముదిరాజ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఫోటోగ్రాఫర్ యూనియన్ ఎన్నికలలో కూడా కొందరు రాజకీయాలు చేసిన సమర్థవంతంగా ఎదుర్కొని తిప్పి కొట్టినందుకు ప్రత్యేకంగా అనిల్ ప్యానల్ ని అభినందించారు. యూనియన్ లలో వర్గాలు ఉండకూడదని, ఎన్నికల్లో పోటీచేసిన రెండు వర్గాలు సోదర భావంతో కలిసి ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసి ముందుకు సాగితేనే యూనియన్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చన్నారు.తాను ముందు నుంచి అందరి ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతి కోసం వారికి అండగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. గతంలోపటాన్ చెరు నియోజకవర్గంలో ఫోటో వీడియో గ్రాఫర్ల సోదరులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ఫోటోగ్రాఫర్ల కుటుంబ సభ్యులు మద్దతు తెలపాలని కోరారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన వెంటనే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లోని అందరికీ వంద గజాల చొప్పున ఇంటి స్థలాలను ఇస్తానని హామీ ఇచ్చారు.నూతనంగా ఎన్నికైన యూనియన్ కి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని, ఎన్నికైన ప్యానల్ ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, వీరేశం,నరసింహ,తన్మయి, రజినీకాంత్,జగన్,రాజేష్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.