హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 22 : దసరా సెలవులు ముగిసి ప్రజలు తిరిగి నగరానికి పయనమవడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సెలవులు ముగించుకుని సిటీకి వస్తున్న వాహనదారులతో హైవే కిటకిటలాడింది. చౌటుప్ప‌ల్ లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు ముందుకు కదలక నెమ్మదిగా సాగాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం ఏకంగా 10 టోల్ బూత్ లను ఓపెన్ చేసినప్పటికీ రద్దీని పూర్తిగా నియంత్రించలేకపోయారు. దసరా సందర్భంగా ఈ ప‌ది రోజుల్లో జాతీయ రహదారిపై సుమారు ఏడు లక్షల వాహనాలు రాకపోకలు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. పండుగ రద్దీని ముందే అంచనా వేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
—————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *