హైదరాబాద్‌లో రాహుల్‌కు ఘన స్వాగతం

  • ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికిన రేవంత్‌ ‌తదితరులు
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో హన్మకొండకు చేరిక

హైదరాబాద్‌,‌మే6: వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభ కోసం కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ హైదరాబాద్‌ ‌చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు వచ్చిన ఆయనకు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ ‌నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రాహుల్‌ ‌గాంధీ శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండ ఆర్టస్ ‌కాలేజ్‌ ‌గ్రౌండ్స్‌కు ప్రయాణమయ్యారు. ఆయనతో పాటు రేవంత్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మరోవైపు వరంగల్‌ ‌సభ కోసం వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్‌ ‌శ్రేణులు కదిలివచ్చారు. భారీ ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో సభా వేదిక పరిసరాల్లో సందడి నెలకొంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ‌మళ్లించడంతో పాటు వాహనదారుల పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వరంగల్‌ ‌చేరుకున్నారు. రాహుల్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ ‌చేరుకున్నారు. అనంతరం శంషాబాద్‌ ‌నుంచి హెలికాప్టర్‌ ‌ద్వారా వరంగల్‌కు బయల్దేరారు.

మొదట వరంగల్‌ ‌గాబ్రియల్‌ ‌స్కూల్‌ ‌గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్‌ ‌టాప్‌జీపులో ఆర్టస్ ‌కాలేజీ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అంతకుముందు రేవంత్‌ ‌రెడ్డి డియాతో మాట్లాడుతూ.. వరంగల్‌ ‌సభలో రైతు డిక్లరేషన్‌పై రాహుల్‌ ‌గాంధీ ప్రకటన చేస్తారని తెలిపారు. తెలంగాణలో కొత్త వ్యవసాయ విధానంపై డిక్లరేషన్‌ ఉం‌డబోతోందని పేర్కొన్నారు. అయితే రైతు సంఘర్షణ సభలో రాహుల్‌ ‌గాంధీ రైతు డిక్లరేషన్‌ ‌ప్రకటించనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదే విధంగా రాహుల్‌ ‌గాంధీ టీ కాంగ్రెస్‌కు ఏ విధంగా దిశానిర్ధేశర చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువత, రైతులే ప్రధాన కేంద్రంగా ఈ సభ జరగనుంది. రాహుల్‌ ‌రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌‌శ్రేణులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. టీ కాంగ్రెస్‌ ‌నేతలు సభకు భారీగా జనసకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, మెదక్‌, ‌నల్లగొండ, కరీంనగర్‌ ‌నుంచి భారీగా తరలి వచ్చారు.. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వేల వాహనాల్లో జనాన్ని తరలించారు.

చంచల్‌గూడ్‌ ‌జైలు ములాఖత్‌కు దక్కని అనుమతి
రాహుల్‌ ‌పర్యటనపై ప్రభుత్వ సహాయనిరాకరణ
హైదరాబాద్‌,‌మే6: తెలంగాణలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పర్యటనలో ప్రభుత్వం సహాయ నిరాకరణ సాగిస్తోంది. ఓయూలో అనుమతి నిరాకరించిన అధికారులు చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్‌ అయ్యేందుకు కూడా రాహుల్‌కు అనుమతి లభించలేదు. చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌ ఈ ‌మేరకు రాహుల్‌గాంధీ ఎన్‌ఎస్‌ఐయూ నేతలతో ములాఖత్‌ అయ్యేందుకు పర్మిషన్‌ ఇవ్వలేదు.  ఇదిలా ఉండగా.. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ ‌టింగ్‌కు వీసీ అనుమతి ఇవ్వని సంగతి ఇదివరకే తెలిసిందే. ఈ క్రమంలో.. కౌన్సిల్‌ ‌నిర్ణయంపై వర్సిటీలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు నిరసనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వీళ్లతో ములాఖత్‌ అయ్యేందుకు రాహుల్‌ ‌గాంధీని అనుమతించాలంటూ కాంగ్రెస్‌ ‌నేతలు వినతి పత్రం సమర్పించారు. అయినా అధికారులు అంగీకరించలేదు. మరోవైపు వరంగల్‌లో జరిగే రైతుల సంఘర్షణ సభకు హాజరుకానున్నారు రాహుల్‌ ‌గాంధీ. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు ఓరుగల్లుకు తరలిపోతున్నాయి. ఇంకోపక్క నల్లగొండ నుంచి అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page