స్వరాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులా?

ప్రభుత్వ కార్య క్రమాల అమలు  ప్రజాబి •ప్రాయాన్ని సేకరి ంచే క్ర మంలో  సామా జిక రాజ కీయ ఆర్థిక చారి త్రక సాం స్కృతిక అంశాల పైన  సమాజంలో జరుగుతున్న చర్చను ఎక్కడి కక్కడ ఎప్పటికప్పుడు  విస్తృత పరిచే విషయంలో   పత్రికలు… ఆ పత్రికలకు  ప్రతి నిధులుగా వ్యవహ రిస్తున్నటువంటి జర్నలిస్టులు  క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం  ప్రభుత్వం అంగీకరించకపోయినా  నగ్న సత్యం. ఆ మేరకు  ప్రజలు పత్రికలపై  జర్నలిస్టుల పైన  విశ్వాసం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.

అయితే పత్రికలు ఎప్పుడు కూడా పెట్టుబడిదారుల  కొమ్ము కాస్తాయి అనే  మార్కస్ ‌వాదన  ఒకవైపు ఉన్నప్పటికీ  ఆ వాదనకు భిన్నంగా ప్రజల పక్షాన పని చేయడానికి  పత్రికల యాజమాన్యాలు  సిబ్బంది జర్నలిస్టులు క్రింది స్థాయి ప్రతినిధులు  సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రజల మద్దతు లభిస్తుంది అనేది నగ్నసత్యం. ఆ విషయాన్ని తేల్చుకోవాల్సిన బాధ్యత పత్రిక యాజమాన్యం విలేకరులదే.  మరొక్క వైపు ‘‘పత్రికొక్కటి ఉన్న పదివేల సైన్యంబు  పత్రికొక్కతున్న   మిత్ర కోటి  పత్రిక లేకున్న ప్రజకు రక్ష లేదు నవయుగాల బాట నార్ల మాట’’  అనే  జనవాక్యం ఉండనే ఉన్నది. ప్రతి రంగానికి అంశానికి సంబంధించి ఆలోచించినప్పుడు  చిత్తశుద్ధి సామాజిక బాధ్య తతో వ్యవహరించినప్పుడు  ఫలితాలు అనుకూ లంగా వస్తాయి. వర్గ దృక్పథంతో  ఒకే వర్గానికి కొమ్ముగాసే విధంగా  వాస్తవాలను కప్పిపుచ్చి పెట్టుబడిదారులకు రాజకీయ నాయకులకు వంత పాడే ధోరణితో వ్యవహరిస్తే మాత్రం  పత్రికలకు పై ఉన్నటువంటి ఆమాత్రం సదభిప్రాయం  కోల్పోయే ప్రమాదం ఉన్నది.. అయినప్పటికీ  ప్రజాస్వామ్యంలో పత్రికల యొక్క పాత్ర గణనీయమైనదని అంగీకరించక తప్పదు. కానీ  ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ విషయంలో  జరిపిన సర్వేలో గమనిస్తే 180 దేశాలకు గాను భారతదేశం 150వ స్థానంలో ఉన్నట్లు తెలు స్తున్నది. అంటే  పత్రికలకు ఈ దేశంలో స్వేచ్ఛ లేదని స్వేచ్ఛగా వాస్తవాలను రాసినటువంటి వారికి  రాజకీయ నాయకులు పెట్టుబడిదారులు కార్పొరేట్‌ ‌సంస్థలు  ఎన్ని రకాల శిక్షలు వేసినఓ మనం అర్థం చేసుకోవచ్చు . ఎంతోమంది సంపా దకులు పత్రికా ప్రతినిధులు యాజమాన్యాలను  బలి తీసుకున్నటు వంటి భారతదేశం మనది.  అయినా నమ్మిన సిద్ధాంతం కోసం  ప్రజల పక్షాన పని చేస్తున్నటువంటి కొన్ని పత్రికలనైనా  కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉన్నది. అదే సందర్భంలో పత్రికలో పని చేస్తున్నటు వంటి జర్నలిస్టులకు  రాజ్యాంగబద్ధంగా రావలసినటువంటి హక్కులను,  నైతికంగా అందించవలసినటువంటి అవకాశాలను పాల కులు అందించకపోతే  తమ కర్తవ్యాన్ని ప్రభుత్వం విస్మరించినట్లే.

స్వరాష్ట్రములోనూ  పరిష్కారం కాని సమస్యలు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సందర్భాలలో తమ హక్కుల కోసం, కనీస  జీవన మనుగడ కోసం,  భద్రత కోసం,  స్వేచ్ఛగా వృత్తినిబద్ధతగా పనిచేసే క్రమంలో  ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి హింస నుండి రక్షించుకోవడానికి  రక్షణ కోరుతూ  పాలకులను డిమాండ్‌ ‌చేసినప్పటికీ  చాలా సమస్యలు పరి ష్కారం కాకుండానే ఉండిపోయినవి.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  పత్రికల గురించి  ప్రభుత్వం అనేక సందర్భాల్లో  అను కూలంగా మాట్లాడుతూ  హక్కులను కాపాడుతామని అవకా శాలను కల్పిస్తామని  డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీమాటగానే మిగిలిపోయినది.  అనేక సందర్భాలలో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు  రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో  ఐక్యంగాను విడివిడిగాను పోరాటాలు జరిపి ప్రభుత్వానికి తమ నిరసన వ్యక్తం చేసినప్పటికీ  ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ  తమ సమస్యలు పరిష్కరించలేదని జర్నలిస్టు సంఘాలు వాపోతున్నాయి.  వెంటనే పరిష్కరి ంచకపోతే  తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని  కూడా  ప్రభుత్వాన్ని హెచ్చరించడం గమనిస్తే  పాలకులు తమ బాధ్యతను విస్మరించడం ఏ మేరకు సమంజసమో ఇప్పటికైనా ఆలోచిం చుకోవాలి.  స్వరాష్ట్రంలో కూడా  పరిష్కారం కాకపోతే ఇక రాష్ట్ర సాధన తోని  జర్నలిస్టులకు ఒరిగింది ఏమిటి  ?

పత్రికలు ప్రైవేటు యాజమాన్యంలో కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం ఇచ్చే అత్యల్ప వేతనంతో జర్నలిస్టు కుటుంబాలు  సంతృప్తికరంగా జీవించే అవకాశం లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు  ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపో వడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమా లను ప్రజల్లోకి  చేర్చడానికి  విస్తృత చర్చ జరగడానికి  పాలకుల పైన భిన్నాభిప్రాయాలు ఏర్పడడానికి విలేకరులు జర్నలిస్టులు చేస్తున్న కృషి అనితర సాధ్యమని చెప్పక తప్పదు.  ఇటీవల ఎలక్ట్రానిక్‌ ‌మీడియాలో పనిచేస్తున్న టువంటి వాళ్ళు కూడా  ఎక్కడికక్కడ  రోజు వారీగా కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలను కొద్ది  సమయంలోనే ప్రజల దృష్టికి తీసుకు పోవడాన్ని గమనించినట్లయితే  యాజమాన్య ంతో పాటు ప్రభుత్వం కూడా కొంత వాళ్లకు ఆసరాగా ఉన్నట్లయితే  మరింత ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేది  ప్రభుత్వం పైన బాధ్యతను నెట్టడానికి ప్రాతి పదికగా భావించాలి. ఎందరికో ఎన్నో హామీలు ఇస్తూ  ప్రజాధనాన్ని నిబంధనలకు  విరుద్ధంగా  దుర్వినియోగం చేస్తూ అక్రమార్కులకు కట్టబె డుతూ,  ప్రభుత్వ భూములను కారు చౌకగా అమ్ముతూ,  రైతుబంధు పేరున వందల ఎకరాలు ఉన్నవారికి  పంటలు పండించని భూములకు కూడా  ఇష్టారాజ్యంగా నిధులను అందించిన టువంటి సందర్భాన్ని గమనిస్తే  అదంతా కూడా దుర్వినియోగమే కదా?    ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి డబ్బును వెచ్చిస్తే  ప్రజాధనాన్ని వినియోగిస్తే ఎవరికి అభ్యంతరం ఉండబోదు  ఈ విషయం ప్రభుత్వం ఆలోచించుకోవాలి.

జర్నలిస్టుల డిమాండ్లను పరిశీలిస్తే..
యాజమాన్యం ద్వారా వారికి వస్తున్నటువంటి  నామమాత్రపు అత్యల్ప భృతి  విధి నిర్వహణలో  ప్రయాణాలు ఇతర ఖర్చులకే సరిపోదు అలాంటప్పుడు కుటుంబ భారాన్ని మోయడం ఎలా?  ఈ కనీస అవగాహన తోనే ప్రభుత్వాన్ని  సమాజం కూడా  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించమని డిమాండ్‌ ‌చేస్తున్నది.
1).  జర్నలిస్టులందరికీ  ఇళ్ల స్థలాలు కేటాయించి  ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
2).  విద్యా వైద్య రంగాలకు ఆదాయంలో సగానికి పైగా ఖర్చు అవుతున్న ఈ రోజుల్లో  హెల్త్ ‌కార్డులను ఇచ్చి  నాణ్యమైన  వైద్యాన్ని అందించడం ద్వారా  కుటుంబాలకు  తోడ్పడాలి
3). జర్నలిస్టుల పిల్లలకు  ఉచిత విద్యా సౌకర్యాలను కల్పించాలి.  ప్రైవేటు పాఠశాలలు కళాశాలలో కూడా  ఫీజు భారాన్ని ప్రభుత్వమే భరించాలి.
4).  జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి బడ్జెట్లో నిధులను కేటాయించాలి.
5). జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి దాడులు  బెదిరింపుల పైన  ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని భరోసా కల్పించాలి అందుకు బలమైన చట్టాన్ని తయారు చేయాలి.
6).  జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం  ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఇటీవల సంఘాలు కోరుతున్నాయి .

రాష్ట్రాలు ప్రాంతాలు ఏవైనా దేశంలోని  పత్రికలు జర్నలిస్టుల బాధ్యతలు సమానమే.  వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి. కనుక  ముందుగా తెలంగాణ రాష్ట్రంలో  హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం  వాళ్ల సమస్యలను పరిష్కరించి డిమాండ్లను నెరవేర్చడం ద్వారా  భారత దేశంలో నెంబర్‌ ‌వన్‌ ‌గా నిలవాలి . ప్రచార ఆర్భాటాలతో కాలం గడపడం కంటే  చర్యలు తీసుకోవడం ద్వారా  తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నప్పుడు  మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి  వృత్తి భరోసా పైన  దృష్టి సారించే అవకాశం ఉంటుంది. సమాజం కూడా ఇలాంటి అంశాలపైన అవగాహన కలిగి  వాళ్లు పోషి స్తున్న పాత్రను  ప్రజల కోణంలో ఆలోచిం చినప్పుడు  సంపూర్ణ మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ ఉద్యమ నేత…)
image.png
యంఏ ఖాదర్‌ ‌పాష
తెలంగాణ జన సమితి పార్టీ
వనపర్తి జిల్లా అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్రం -509103

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *