- ఎమర్జెన్సీ ప్రస్తావనపై అభ్యంతరం
స్పీకర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 27: లోక్‌సభ స్పీకర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎమర్జెన్సీ పై ఓం బిర్లా చదివిన తీర్మానం లోక్‌సభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ లో విపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం స్పీకర్ వద్ద ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు.. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ జరగలేదని కాంగ్రెస్ పేర్కొంది. విపక్ష నేతగా గుర్తింపు పొందిన అనంతరం రాహుల్ గాంధీ ‘ఇండియా’ కూటమి నేతలతో కలిసి తొలిసారి స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
పార్లమెంటు పనితీరు గురించి చాలా అంశాలు చర్చకు వచ్చాయి. స్పీకర్ ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడాన్ని రాహుల్ లేవనెత్తారు. ఇది రాజకీయపరమైన అంశమని, దీనిని నివారించి ఉండొచ్చని చెప్పారని కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు.. ఆయన కూడా స్పీకర్‌కు ఈ వ్యవహారంపై ఓ లేఖ రాశారు. పార్లమెంట్ విశ్వసనీయతపై ప్రభావం చూపుతోన్న ఓ తీవ్రమైన అంశం నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నాను. 50 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీని రు ప్రస్తావించడం దిగ్భ్రాతికరం. సభాపతి నుంచి ఇలాంటి రాజకీయ ప్రస్తావన రావడం పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ చూడనిది.
పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడంపై కాంగ్రెస్ తరఫున ఆందోళన వ్యక్తం చేస్తున్నాను అని కేసీ వేణుగోపాల్ తన లేఖలో పేర్కొన్నారు. 1975జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. పలువురు ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. డియాపై ఆంక్షలు విధించింది. న్యాయ వ్యవస్థపైనా నియంత్రణలు అమలు చేసింది. ఎమ్జంన్సీ విధించి 49 ఏళ్లు పూర్తయి 50వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ సభ బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రక్షించడంతోపాటు దాని విలువలకు కట్టుబడి ఉందని హా ఇస్తున్నా‘ అని స్పీకర్ బుధవారం పేర్కొన్నారు. స్పీకర్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు.




