మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 30: స్థానిక బిడ్డగా ఒక అవకాశం ఇవ్వాలని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీ రాములు యాదవ్ విన్నవించారు. సోమవారం బాలాపూర్ లో నిర్వహించిన పలు కుల సంఘాలు ఆత్మీయ సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలన్ శంకర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడంగ్ పేట కార్పొరేషన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుండె నాగార్జునబాబు ఆధ్వర్యంలో బస్తీలో పలువురు మహిళలు బీజేపీ చేరారు.
అనంతరం కుర్మ సంఘం నేతలు బీరప్ప ఆలయంలో అందెల శ్రీ రాములు యాదవ్ ను ఘనంగా సత్కరించారు. బడంగ్ పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, పెరమోని నరేష్, రంగనాథ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అందెల శ్రీ రాములు యాదవ్ మాట్లాడుతూ.. ఎన్నికలు అయ్యే వరకు అందరూ కష్టపడి పని చేసి, బీజేపీ విజయం సాధించే వరకు విశ్రమించవద్దన్నారు. స్థానిక వాసిగా నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని విన్నవించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకటేనని, ప్రజలు వీరిని నమ్మడం లేదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎన్నడు లేని అభివృద్ధి సాధించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ కార్పొరేషన్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అన్ని మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
స్థానిక బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వండి : అందెల శ్రీరాములు
