Take a fresh look at your lifestyle.

సైన్స్ ‌పరిజ్ఞానం పరిధి దాటితే ప్రమాదమేనా…

సైన్స్ ‌పరిజ్ఞానం మానవ అవసరాలను తీరుస్తున్నప్పటికీ సహజమైన మానవ మేథాసంపత్తు ఏకంగా కృత్రిమ మానవరూప మేథా తయారు చేయాలన్న శాస్త్ర పరిజ్ఞానం గొప్పదైన  ఉపయోగించే రీతిలో తేడాలు వస్తే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా  మానవాళి మనుగడపై దుష్ప్రభావాన్ని చూపుతుందనే భిన్న అభిప్రాయాలు లేక పోలేదు.   ప్రకృతి సమతుల్యం మానవాళికి మనుగడకు ఎంతో ముఖ్యం అశాశ్వ తమైన మానవుడు తన అవసరాలను సులభ తరం చేసే ప్రయత్నాల్లో సహజమైన ప్రకృతి ఆవశ్యకతను విస్మరిస్తూ ప్రకృతిలో  చేస్తున్న స్వార్థపూరిత స్వప్రయోజనాల కోసం హద్దులు దాటి చైసే ప్రయత్నాలు ప్రకృతి పాలిట శాపంగా మారుతూనే ఉన్నాయి. శృతిమించిన సైన్స్  ‌పరిజ్ఞానం  జీవావరణం పై ప్రభావాన్ని స్పష్టంగా చూపెడుతున్నాయి. పంట మార్పిడి విధానాన్ని మరిచిపోయిన వ్యవసాయ రంగం సేంద్రియ విధానాన్ని ప్రక్కన పెట్టి కృత్రిమ ఎరువుల వైపు ఆసక్తి చూపడం మానవుడు తన శారీరక శ్రమను మర్చిపోయే విధంగా సైన్స్ అధునాతన పరి జ్ఞానం శరీరానికి  వ్యాయామం లేకుండా చేస్తుం డటం మానవ జీవితాల్లో బలమైన ప్రత్యక్ష సంబంధాలను సెల్‌ ‌ఫోన్లు దూరం చేయడం తీరిక ఉన్న సమయాన్ని కృత్రిమమైనటువంటి పరిజ్ఞానంతో వినోదాలను వెతుక్కోవడం ఆధునిక మానవుడు తన సహజ ధర్మాన్ని ప్రకృతిని సహజ సిద్ధతను మర్చిపోయి అవలంబిస్తున్న విధానాలు  పరిజ్ఞానాన్ని ఉపయోగించే తీరులో తమ ఉనికికే ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వాడిగా మిగిలి పోతాడేమో లేక తిరిగి ప్రకృతి ఒడిలో ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోకుండా తన జీవన విధా నాలను భవిష్య తరాలకు అందిస్తాడో  కాలమే సమాధానం చెప్పాల్సింది  రాబోయే కాలంలో జరిగే పరిణామాలే  జరగబోయే పరిణామాలే ఇందుకు సాక్షాలుగా మిగిలిపోతాయేమో. ’’
మానవ సమాజంలో ప్రకృతి అత్యంత కీలకమైనది
మన చుట్టూ ఉన్న పరిసరాల్లో కావలసిన మన ఆరోగ్యానికి సరిపడా వనరులపై దృష్టి సారించి ప్రకృతిలో మమేకమై ప్రకృతితో సహజీవనం చేసే మానవులు తన చుట్టూ ఉన్న ఉపయోగకరమైన ఉపయోగించుకోవలసిన ఉపయోగపడేటువంటి ప్రకృతి వనరులను దృష్టిలో ఉంచుకొని వాటిపై దృష్టి సారించి తెలుసుకో వలసిన విషయాలను ప్రకృతి నుండి క్షుణ్ణంగా పరిశీలించవలసింది పోయి విశ్వం వైపు విశ్వం తరం విశ్వాంతరం వైపు తమ దృష్టి సారించడం ఒక విధానం అయితే ప్రకృతి నుండి పర్యావ రణానికి ముప్పు కలిగించే అనేక రకమైనటువంటి ప్రయోగాలు చేయడం తద్వారా వెలువడిన వ్యర్థాలు వాతావరణంలో కలిసి ప్రాణవాయువైన ఆక్సిజన్‌ ‌లాంటి జీవకోటికి లాభాధాయకమైన వాయువులను జీవావరణాన్ని చిన్న బిన్నం చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. ప్రపంచ వ్యాప్తంగామానవుని పరిజ్ఞానం అవసరాలకు ఉపయోగించే రాకెట్లను నింగిలోకి ప్రవేశపెట్టుతున్నప్పటికీ విషతుల్యమైన ఇంధనాలు ప్రకృతిపై కన్నేరచేస్తూనే ఉన్నాయి .ఆమ్ల వర్షాలు సైతం అడపాదడపా వస్తూనే ఉన్నాయి .జీవవై విద్యంలో మార్పులు వస్తున్నాయి అంతరిక్ష ప్రయో గాలు మానవునికి ఉపయుక్తమైనప్పటికీ అంతరిక్షంలో నుండి వచ్చే ముప్పును మాత్రం గమనించగలడేమో కానీ వచ్చే ఉపద్రవాన్ని ఆపేయించే సత్తా మానవ మేధస్సుకు లేకపోవడం గమనార్హం.
ఇప్పటివరకు భూగోళాన్ని నష్టపరి చేటువంటి అంతరిక్ష ఉపద్రవాలు భూమిని తాకలేదు.మానవుడే యుద్ధాల పేరట అనునిత్యం ఆయుధ సంపత్తిని సమకూర్చుకొని మానవ నాశనానికి ప్రకృతి వినాశనానికి తానే కారకుడు అవుతున్న క్రమాన్ని పరిశీలిస్తే మానవుడు చేస్తున్నటువంటి ఆలోచన ధోరణి ప్రయోగాలు ఏమేరకు మానవజాతికి ఉపయుక్తమవుతున్నాయో అర్థం కాక మానదు ఒకప్పటి జీవనశైలి ఆదిమాన వునుండి మొదలైనటువంటి సరళి ప్రకృతి మీదనే ఆధారపడి జీవనం కొనసాగించే స్థితిలో ప్రస్తుతం కృత్రిమంగా బతకడం కృత్రిమ వస్తువుల యొక్క అతివినియోగం మానవునికి తెలియకుండానే   అనర్ధాలతో నిండిపోతున్న విషయం గా గోచరిస్తుంది.
సైన్సు పరిజ్ఞానం ఆధునికతకు అవసరమే కానీ..
సహజమైనటువంటి మానవ మేధాసంపతి అతి ఆలోచనలతో తన చుట్టూ ఉన్న ప్రకృతి వైపు దృష్టి సారించకుండా ప్రకృతిని నాశనం చేస్తూ ప్రయోగాలను ప్రకృతిలో నిర్వహిస్తుండడం సర్వసాధారణమైపోయింది . ప్లాస్టిక్లు కూడా మానవ జీవన విధానంలో భాగంగా ఉంటున్నాయి. అడవులను నరికి వేయడం ఫ్యాక్టరీలనుండి వచ్చే విపరీతమై నటు వంటి మోతాదుకు మించిన కలుషిత పదార్థాలను పూర్తి స్థాయిలో నియంత్రించక పోవడం  ,కృత్రిమమైన రసాయనాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ వాటిపైనే పూర్తిగా ఆధారపడితే కల్లోలిత కాలంలోకి జీవన ప్రమాణాలు నెట్టివేయడం జరగక మానదేమో .సహజమైన సేంద్రియ పద్ధతులను మానవుడు అభివృద్ధి చేసుకో లేకపోవడం చేసుకున్న కొంతను పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోవడం విశ్వ వ్యాప్తంగా వాతావరణ సమతుల్యతకు ఆటంకంగా మారుతుంది.

నివసించే పరిసరాలను పరిశుభ్రమైన రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోవడం పర్యావ రణాన్ని దెబ్బతీసేటువంటి ప్రకృతిని హాని కలిగించే ఉరుకులు పరుగులు పెడుతూ శాస్త్ర పరిజ్ఞానం వైపు అతిగా ఆలోచిస్తూ తాను తీసుకు న్న గోతిలో తానే పడుతున్న విషయాన్ని గమనించి గమనించనట్ల ఉండటం శోచనీయం…

వ్యవసాయ రంగంలోనూ చాలా మార్పులు వచ్చాయి సహజమైన విత్తనాలు దాదాపు కనుమరుగైపోతున్నాయి సంకరికరణ  విత్తనాలు అభివృద్ధిలోకి వచ్చాయి పరిజ్ఞానం దిశ ఎలా మారిందంటే ఒకప్పటి వ్యవసాయం పండే పంటలు సహజత్వాన్ని కోల్పోయాయి కృతిమ రసాయనాలతో పంటలు పండించడం  మొదలైన నాటి నుండి సేంద్రియ ఎరువు విధానం దాదాపు కనుమరుగైపోయింది. వాణిజ్యపరంగా పంట లను రసాయనలతో పెంచడం అలాంటి పంటలను వినియోగిం చుకుంటే మానవ ఆరోగ్య శైలి రోగ నిరోధక శక్తి కుదించుకుపోతుండటం ప్రత్యామ్నాయంగా కొత్త రోగాలు వస్తుండటంతో  వాటి నివారణకు మందుల కొరకు అన్వేషణ సాగించడం సర్వసాధనమైపోతున్నది. కృత్తిమ రసాయనాలు అవసరమైనప్పటికీ ఎరువులను వ్యవసాయంలో వాడే విధానంలో తగినంత పరిజ్ఞానం కనుగొనే వారి కన్నా దానికి ఉపయోగించే వారికి చాలా తక్కువ ఉండడం ఇలాంటి పర్యవసానాలు ప్రభావాలు మానవ ఆరో గ్యాలపై పొడ చూపుతూనే ఉన్నాయి. ప్రకృ తిలో లభించే సహజమైన ఆహార పదార్థాలు గాలి నీరు వాతావరణంస్వచ్ఛమైన ప్రకృతి సంపద తప్ప తాను కనుగొనే కొత్త విషయాలపై ఆధిపత్యం కోల్పోయినపుడు ఎదురయ్యే సమస్యలు అంతా ఇంకా కాదని ఇటీవల ప్రపం చాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ ఇం‌దుకు తార్కాణం.

ఇలాంటి విపత్తులు జరగకుండా హద్దులు మీరని పరిజ్ఞానంతో సమృద్ధిగా ఉపయోగపడే రీతిలో మానవ మేథాశక్తి ఆలోచిస్తే తప్ప మానవమనగడ భూమ్మీద కొనసాగించడం దుర్లభమే అవుతుందేమో..మానవ సమాజంలో జీవన శైలిలో వచ్చిన మార్పులకు  అనుగుణంగా తొరిగిపోయే శక్తివనరులైన బొగ్గు పెట్రోలియం లాంటి ఇందన వనరులను మోతాదుకు మించి వాహ నాలలో ఫ్యాక్టరీలలో వాడడం వల్ల వాతావరణ కాలుష్యం విరివిగా అవుతూ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలకు మూలాధారమ వుతుంది. కృత్రిమఆలోచనా మేధా సంపత్తితో  సమాజం ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో ఏమో గాని సహజమైనటువంటి మానవుని యొక్క జీవన శైలిలో ఆరోగ్యకరమైనటువంటి విధానాలు మారిపోతాయి అని  చెప్పడంలో సంశయం లేదు.

శాస్త్ర  పరిజ్ఞానాన్ని సరియైన రీతిలో వాడాలి…..
శాస్త్ర పరిజ్ఞానం అంతా కంప్యూటర్‌ ఎలక్ట్రానిక్‌ ‌కమ్యూనికేషన్‌ ‌వ్యవస్థతో ముడిపడి ఉంటుంది పూర్తిస్థాయిలో ఈ సమాచార వ్యవస్థ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వారి శాతం ఎక్కువ ఉంటుంది అక్షర జ్ఞానం ఎంత ఉన్నా శాస్త్ర పరిజ్ఞానాన్ని అర్థం చేసుకొని ఎంతవరకైతే వాడుకోవాలో అంతవరకు మాత్రమే వాడే విధానాన్ని మానవుల అవలం బిస్తే సరే సరి లేకుంటే అది తనకు తాను కొనితెచ్చుకున్న పెనుముప్పుగా తయారవు తుం దేమో. ఎలక్ట్రానిక్‌ ‌కమ్యూనికేషన్‌ ఉన్న పరిక రాలను అతిగా ఉపయోగించడం ప్రమాదక రమని ప్రపంచంలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న విజ్ఞులు ఘోషిస్తున్న తీరికలేని సమయంతో గంటల తరబడి వాటిపై ఆధారపడి మానవుడు అచేతన తత్వానికి బానిసవుతున్న క్రమంలో శరీరం మీద దుష్ప్రభావము చూపే ఈ సాధనాలను మితిమీరిన సమయాన్ని వాటితో వెచ్చించడం వలన అవుతుంది..

మితిమీరీన పరిజ్ఞానం మానవుని ఒంటరి వాడిని చేసిందేమో అని అనిపి స్తుంది.ఆధునిక పరిజ్ఞానం పేరిట ఇంటర్నెట్‌ ‌యూట్యూబ్లో సెల్‌ ‌ఫోన్లు వీడియో ఫోటో దృశ్యం గానే పలకరించవలసిన పరిస్థితులు నేడు గోచరి స్తున్నాయి ఒకరికొకరు పలకరింపులు కలుసు కోవడాలను తక్కువ చేస్తున్నాయి ప్రత్యక్ష బంధాలను దూరం చేస్తున్నాయి.ఒక గదిలో మానవుని కృత్రిమ అవసరమైన వాటి కొరకే బందీలు చేస్తున్నాయి.సాంకేతికతో మానవుడే సంఘజీవి నుండి సొంత జీవిగా మారిపో తున్నాడు అట్లని నిండు నూరేళ్లు సంపూర్ణంగా బతికేంత స్థాయిని పొందలేకపోతున్నాడు.  సాంకేతిక పరిజ్ఞానమే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి .

సైన్స్ ‌పరిజ్ఞానం ప్రకృతి పాలిట శాపం కావద్దు…
యుద్ధాల్లో ఉపయోగించే అధునాతన  ఆయు ధాలతో చిద్రమవుతున్న బ్రతుకులు అల్లక ల్లోలమవుతున్న ప్రకృతి అలజడితో దెబ్బతి ంటున్నది పర్యావరణమే.సంభాషణ కొరకు ఉపయోగించే సెల్‌ ‌ఫోన్లు నుండి వచ్చే రేడియేషన్‌ ‌సెల్‌ ‌టవర్‌ ‌నుండి వచ్చే తరంగాలు జీవావ రణంలో ఒకింత కలిసిపోయి.  మానవ శరీరం లోకి చొచ్చుకుపోతు• ఆకాశంలో విహరించే పక్షుల ఉనికే   ప్రమాదంగా మారు తున్న మితిమీ రిన పరిజ్ఞానం అపరిమితంగా వాడడం ప్రకృతి పాలిట శాపంగా మారడం  జీవనశైలిని కట్టిప డేస్తున్న ఆధునాతన విజ్ఞానం అవసర మను కున్నా ఉపయోగించే తీరులో వినాశనానికి స్థానం కల్పించకుండా ఉండాలని భావించే వారు లేకపోలేదు.
పరిశ్రమల నుండి వచ్చే క్లోరో ఫ్లోరో కార్బన్స్  ‌విచ్చిన్నం కాని ప్లాస్టిక్‌ ‌వ్యర్ధాలు నీటిలో కలిసిపోతున్న రసాయనాలు సింథటిక్‌ ‌రంగులు  వినాశనానికి ఉపయోగించే అధునాతన మందు గుండు సామాగ్రి అన్వాయిదాలు అడవుల నరికివేత  ప్రకృతిలోన జరిగే అనేక రకాల ప్రయోగకృత్యాలు వెలువడుతున్న విషవా యువులు  ప్రకృతి పర్యావరణంపై ఎక్కువగా దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి .వీటి ప్రభావం వల్ల సహజ సిద్ధమైన  జీవావరణానికి కవచమైన ఓజోన్‌ ‌పొర దెబ్బ తినడమే కాకుండా భూకంపాలు సునామీలు ముంచుకొస్తూనే ఉంటాయి.
– దాడిశెట్టి శ్యామ్‌ ‌కుమార్‌)                                                 ‌వరంగల్‌ ‌జిల్లా. 9492097974.

Leave a Reply