ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మనం ప్రకృతిలోని నియమాలను తెలుసుకోగలము ఈ నియమాలను ఉపయోగించి మనం కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయగలం. ఉదాహరణకు విద్యుత్ అయస్కాంత తత్వం గురించి మనకున్న జ్ఞానం వలన మనం విద్యుత్ బల్బులు ఫ్యాన్లు మోటర్లు వంటి ఎన్నో సాధనాలను అభివృద్ధి చేయగలిగాము అను శక్తి గురించి మనకున్న జ్ఞానం వలన మనం అను విద్యుత్ కేంద్రాలను నిర్మించగలిగాము. సైన్స్ ద్వారా మనం ప్రపంచంలో ఉన్న సమస్యలను పరిష్కరించగలం ఉదాహరణకి వైద్యశాస్త్రంలో పురోగతి వలన మనం అనేక వ్యాధులను నయం చేయగలిగే వ్యాక్సిన్ను కనుగొనగలిగాము. సైన్స్ ఒక శక్తివంతమైన సాధనం దేనిని సరిగా ఉపయోగించుకుంటే మనం ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశం గా మార్చగలం.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. 1928 ఫిబ్రవరి 28 ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సి.వి.రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నాడు. 1930 వ సంవత్సరంలో భౌతిక శాస్త్ర విభాగంలో సివి రామన్ గారికి నోబుల్ శాంతి బహుమతు లభించింది ఈ బహుమతి ఆసియా ఖండంలోని మొట్టమొదటిసారిగా సివి రామన్ రావటం భారతదేశంలో భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగానికి గర్వకారణం. 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 8న నేషనల్ సైన్స్ డే గా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. సివి రామన్ గారి,ఈ అద్భుతమైన ఆవిష్కరణకు గుర్తుగా భారత ప్రభుత్వం 1987లో ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం గా ప్రకటించింది.
లిజాతీయ సైన్స్ దినోత్సవంలి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో శాస్త్రీయ ప్రదర్శనలు, సదస్సులు, పోటీలు, సెమినార్లు మొదలైనవి ఉంటాయి. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలలో శాస్త్రీయ అవగాహనను పెంపొందించడానికి ప్రయత్నిస్తారు.2024 జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్ 2024 జాతీయ సైన్స్ దినోత్సవం థీమ్’’ప్రపంచ సంక్షేమం కోసం విశ్వ విజ్ఞాన శాస్త్రం. ఈ థీమ్ ద్వారా ప్రపంచ సంక్షేమం కోసం శాస్త్రీయ పరిశోధనల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాలని భావిస్తున్నారు.భారతదేశ శాస్త్రీయ పురోగతికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ రోజు భారతీయ శాస్త్రవేత్తల సేవలను గుర్తు చేసుకోవడానికి మరియు యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఒక అవకాశం.
సైన్సు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యతను ఇస్తుంది. సైన్స్ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మరియు మానవ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి దారితీస్తుంది ఉదాహరణకు కృత్రిమ మేధస్సు వైద్యము రవాణా మరియు విద్యావంట రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుంది. సైన్స్ వాతావరణ మార్పు పేదరికం మరియు వ్యాధులు వంటి సవాలను పరిష్కరించడానికి మనకు సహాయపడుతుంది ఉదాహరణకు శాస్త్రవేత్తలు పునరుత్పాదక ఎందన వనరులు అభివృద్ధి చేయడానికి మరియు కొత్త వ్యాధి నివారణలకు కనుగొనటానికి పనిచేస్తున్నారు. సైన్స్ జ్ఞానం పెంపతులలో ఎంతో ఉపయోగపడుతుంది. సైన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఈ జ్ఞానం మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మన జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సైన్స్ మరియు సాంకేతికత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి సైన్స్ కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి పునాది అందిస్తుంది అయితే సాంకేతిక శాస్త్రీయ పరిశోధనలకు కొత్త సాధనాలను అందిస్తుంది. సైన్స్ యొక్క భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి మరియు మన జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తూనే ఉన్నారు సైన్స్ యొక్క సహాయంతో మనం మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగలం.
సైన్స్ అనేది మానవజాతి అభివృద్ధికి ఎంత దోహదపడిన ఒక శక్తివంతమైన సాధనం అయితే ఈ శక్తిని యుద్ధం కోసం ఉపయోగించడం వల్ల శాంతికి బంధం కలిగే అవకాశం ఉంది. సైన్స్ యుద్ధంలో ఉపయోగించే అధునాతన ఆయుధాలను అభివృద్ధికి దోహదపడుతుంది ఈ ఆయుధాలు మరింత శక్తివంతమైన మరియు వినాశనకరమైన విగా మారడంతో యుద్ధంలో మరింత మంది ప్రజలను మరణించే అవకాశం ఉంది. సైన్స్ పర్యావరణ పరిరక్షక దోమతోపడుతుంది ఇది యుద్ధం వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ద్వారా మానవుడు ఆవిర్భావం పరిచేసిన వివిధ రకాలైనటువంటి సాంకేతిక వస్తువులు పరిజ్ఞానాన్ని మానవ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి కానీ యుద్ధానికి మానవ వినాశనానికి ఉపయోగించకూడదు. ప్రకృతి పరిరక్షణకు ఉపయోగపడాలి ప్రకృతి లేకుండా ఎలాంటి సాంకేతిక శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి అనేది ఉండదు కాబట్టి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న యువత అందరూ కూడా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేస్తూ సైన్స్ ను ఉపయోగించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్తులు కావాలని కోరుకుంటూ అదే సమయంలో ప్రకృతిని కూడా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ యువత దేశాభివృద్ధిలో భాగస్తులు అవుతారని అవుతారని కోరుకుందాం.
-పూసపాటి సైదులు
రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు
మోడల్ స్కూల్ మునగాల
9885973102





