నేటి నియోజక వర్గాల పర్యటన లో భాగంగా దేవకద్ర కు వాయుమార్గాన బయలుదేరిన సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో అప్రమత్తమైన పైలట్ మార్గమధ్యం నుండి తిరిగి వ్యవసాయ క్షేత్రానికి హెలికాప్టర్ ను మళ్లించి సురక్షితంగా లాండింగ్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రయాణానికి మరో ప్రత్యామ్యాయ హెలికాప్టర్ ను ఏవియేషన్ సంస్థ వారు ఏర్పాటుచేయనున్నారు.మరి కాసేపట్లో హెలికాప్టర్ రాగానే బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ నేటి పర్యటనను యథావిధిగా కొనసాగించనున్నారు.