•కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు ప్రకటన
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఫిట్ నెస్ నియమాల ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహించడానికి సీఐఐ తెలంగాణ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ ఈవెంట్ కార్పొరేట్ గ్రీనథాన్ నాలుగో ఎడిషన్ ఆదివారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన సీఈఓలతో సహా వెయ్యిమంది కార్పొరేట్ నిపుణులు 3 కె, 5 కె, 10 కె విభాగాలలో నడిచారు. గ్రీనథాన్ విజేతలకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష విలువైన హెల్త్ కార్డ్ ఇస్తున్నట్లు కిమ్స్ హాస్పిటల్ సీఎండీ, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, సీఎస్ఆర్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సి.శేఖర్ రెడ్డి, సీఐఐ తెలంగాణ హెల్త్ కేర్ ప్యానెల్ కన్వీనర్, టీఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ మిస్ రషీదా అడేవాలా, ఎన్ఎండీసీ లిమిటెడ్ డైరెక్టర్లు వి.సురేష్, దిలీప్ కుమారర్ మొహంతి, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ 4.0 ప్యానెల్ కన్వీనర్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వి.ఎస్.రామ్ లతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా డా. భాస్కరరావు మాట్లాడుతూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం, కనీసం 8 గంటలు నిద్రపోవడం అవసరం అన్నారు. గతంలో ఒకసారి గుండెపోటు వచ్చి, దాన్నుంచి కోలుకున్నవారు కూడా తమ సామర్థ్యాన్ని, ఫిట్‌నెస్‌ను చాటుతూ 10కె మారథాన్‌లో పాల్గొన్నారని చెప్పారు.