తొలగింపు ఉత్తర్వుపై పున: సమీక్షించాలని కేంద్ర మంత్రికి మంత్రి కెటిఆర్ వినతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 17 : ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ అంశంపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ వినతి చేశారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పున:సవి•క్షించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కేటీఆర్ కోరారు. పునరుద్ధరణ కోసం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు.
ఉపాధి కల్పించే పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులపై పునఃసవి•క్షించాలని ట్వీట్ చేశారు. ఉత్తర్వులపై సవి•క్షించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. సీసీఐ పునరుద్ధరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వేలాది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమకు ఆర్థికపరమైన ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.