ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 7 : కానిస్టేబుల్ గా ఆమనగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎన్.ప్రవీణ్ కుమార్ ఈ మధ్యకాలంలో విడుదలైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎస్ఐ ఫలితాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) గా ఉద్యోగం సంపాదించడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో ఆమనగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జే. వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్ కే. బలరాం, పోలీసు సిబ్బంది ప్రవీణ్ కుమార్ ను శాలువతో ఘనంగా సన్మానించి అనంతరం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసి అభినందించారు.