సిద్దిపేట, ఏప్రిల్ 25(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అఫీసర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన డిఎంహెచ్‌ఓ జిల్లాలోనీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా.. జిల్లాలోని డాక్టర్లు, సిబ్బంది లాంగ్ లీవ్‌లో వెళ్లడం..ఇబ్బందులు, వేధింపులు భరించలేక మరి కొందరు అదే బాటలో పయనిస్తున్నారని…ఈ నెల 21న ప్రజాతంత్ర తెలంగాణా దిన పత్రిక లో ‘రూల్స్ గీల్స్ నై జాన్తా నై’ అనే శీర్షికతో ప్రముఖంగా వార్తను ప్రచురించిన విషయం విధితమే. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాలోని నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది పట్ల నియంతగా వ్యవరిస్తూ…ఇబ్బందులకు, వేదింపులకు గురి చేస్తున్నట్లు ప్రజాతంత్ర ప్రముఖంగా వార్త ప్రచురించింది. ఈ క్రమంలో..సిద్ధిపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అఫీసర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో…
ప్రజాతంత్ర ప్రముఖంగా వార్త రాసినందుకు ఆ శాఖలోని డాక్టర్లు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట, ఏప్రిల్ 25(ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అఫీసర్ బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్ధిపేట జిల్లాకు చెందిన డిఎంహెచ్‌ఓ జిల్లాలోనీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యవరిస్తున్న తీరుకు నిరసనగా.. జిల్లాలోని డాక్టర్లు, సిబ్బంది లాంగ్ లీవ్‌లో వెళ్లడం..ఇబ్బందులు, వేధింపులు భరించలేక మరి కొందరు అదే బాటలో పయనిస్తున్నారని…ఈ నెల 21న ప్రజాతంత్ర తెలంగాణా దిన పత్రిక లో ‘రూల్స్ గీల్స్ నై జాన్తా నై’ అనే శీర్షికతో ప్రముఖంగా వార్తను ప్రచురించిన విషయం విధితమే.
మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాలోని నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది పట్ల నియంతగా వ్యవరిస్తూ…ఇబ్బందులకు, వేదింపులకు గురి చేస్తున్నట్లు ప్రజాతంత్ర ప్రముఖంగా వార్త ప్రచురించింది. ఈ క్రమంలో..సిద్ధిపేట జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అఫీసర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో… ప్రజాతంత్ర ప్రముఖంగా వార్త రాసినందుకు ఆ శాఖలోని డాక్టర్లు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.