‘‌సిఎం మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు’

  • గజ్వేల్‌ ‌ప్రజల అవసరాలను సిఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిశీలన
  • అభివృద్ధికి గజ్వేల్‌ ‌రోడ్‌ ‌‌మోడల్‌
  • ‌సర్కార్‌ ‌బడుల రూపురేఖలు మార్చేందుకే మన ఊరు-మన బడి
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
  • గజ్వేల్‌, ‌సిద్ధిపేట నియోజకవర్గాల్లో మంత్రి హరీష్‌రావు పర్యటన
  • జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

సిద్ధిపేట / గజ్వేల్‌, ‌మే 13 ప్రజాతంత్ర: గజ్వేల్‌ ‌నియోజకవర్గ ప్రజల అవసరాలను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరిశీలిస్తూ…మమ్మల్ని పరిగెత్తిస్తున్నారనీ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంత్రి హరీష్‌రావు శుక్రవారం గజ్వేల్‌, ‌సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించారు. తొలుత గజ్వేల్‌-‌ప్రజ్ఞాపూర్‌లో 5కోట్ల రూపాయలతో నిర్మించనున్న మోడ్రన్‌ ‌బస్టాండ్‌ ‌నిర్మాణ పనులకు, విశ్వకర్మ సంఘ భవన నిర్మాణానికి, వీరభద్రీయ కుల సంఘ భవన నిర్మాణ పనులకు జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌రోజాశర్మ, ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌వంటేరు యాదవరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్‌ ‌వంటేరు ప్రతాప్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… గజ్వేల్‌ ‌దశ దిశ మార్చి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చలువేననీ, ఇప్పుడు గజ్వేల్‌ అభివృద్ధి దేశానికి రోల్‌ ‌మోడల్‌గా నిలిచిందన్నారు. గతంలో కాచిగూడ నుంచి తిరుపతి వెళ్లే రైలు.. రాబోయే రోజుల్లో గజ్వేల్‌ ‌నుంచి తిరుపతికి రైలు నడిపేలా ప్రభుత్వం యోచిస్తుందనీ, పట్టణ ప్రజలకు ఇబ్బందులు కావొద్దని 8 బస్‌ ‌బేలతో అధునాతన సౌకర్యాలతో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎక్స్‌ప్రెస్‌ ‌మోడ్రన్‌ ‌బస్టాండు నిర్మాణం ప్రారంభం చేసుకోవడం సంతోషమన్నారు. గజ్వేల్‌ ‌పట్టణంలో రూ.2 కోట్ల రూపాయలతో బస్‌ ‌బే నిర్మాణం చేయనున్నామనీ, అలాగే ప్రజ్ఞాపూర్‌ ‌లో రూ.5 కోట్ల రూపాయలతో బస్టాండ్‌ ‌నిర్మించనున్నామన్నారు. 4ఏళ్లలో గజ్వేల్‌ ‌దశ దిశ మారిపోయిందనీ, రూ.297 కోట్ల వ్యయంతో రింగురోడ్డు పనులు పూర్తికావొచ్చాయనీ, ఎడ్యుకేషన్‌ ‌హబ్‌, ‌వెజ్‌ అం‌డ్‌ ‌నాన్‌ ‌వెజ్‌ ‌మార్కెట్‌, ‌పాండవుల చెరువు, మహతి ఆడిటోరియం.. ఇలా ఆదర్శప్రాయంగా ఎన్నో అభివృద్ధి చేసుకున్నామన్నారు. – ప్రయివేటు ఆసుపత్రులకు దీటుగా గజ్వేల్‌ ‌జిల్లా ఆసుపత్రి ఉన్నదని, గజ్వేల్‌లో అన్నీ కుల సంఘాలకు భవనాలు నిర్మాణం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ ‌చిట్టి దేవేందర్‌ర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ ‌లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్‌ ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌నేతి రాజమౌళి, ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమనోహర్‌, ఏఎం‌సి ఛైర్‌పర్సన్‌ ‌మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌, ‌గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో వియేందర్‌రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

సర్కార్‌ ‌బడుల రూపురేఖలు మార్చేందుకే…మన ఊరు-మన బడి : మంత్రి హరీష్‌రావు

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పోరేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని మంత్రి హరీష్‌రావు చెప్పారు. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి జిల్లా పరిషత్‌ ‌హైస్కూలులో రూ.80 లక్షల రూపాయల వ్యయంతో బడి పునరుద్ధరణ పనులకై శంకుస్థాపన చేసి మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పేద బలహీన వర్గాల విద్యార్థులు సైతం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవాలని, సమాజంలో పోటీ పడాలన్నా.., విదేశాలకు వెళ్లాలన్నా.. ఇంగ్లీషు మీడియం ముఖ్యమని భావించి ఈ విద్యా సంవత్సరం నుంచి అన్నీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రారంభిస్తున్నామన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో అన్నీ సకల వసతులు ఉండటమే సిఎం కేసీఆర్‌ ‌సంకల్పమనీ, కార్పోరేట్‌ ‌స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దడమే సిఎం కేసీఆర్‌ ‌లక్ష్యమన్నారు. రూ.80 లక్షల రూపాయలతో కుకునూర్‌పల్లి జిల్లా పరిషత్‌ ‌హైస్కూలును బాగు చేసుకుందామనీ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే కార్యక్రమమే మన ఊరు-మన బడి అన్నారు. డ్రాప్‌అవుట్స్ ‌గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించాలని విద్యాధికారులకు మంత్రి ఆదేశించారు. సన్న, పాత బియ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో భోజనం పెడుతున్నామనీ, రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్లు అనే బోర్డు పెట్టే రోజులొస్తాయనీ, రూ.100 కోట్ల రూపాయల అదనపు భారాన్ని స్వీకరించి రెండు భాషల్లో పుస్తకాలు ముద్రణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు పాల్గొన్నారు.

జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లా విద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి తన పర్యటనలో భాగంగా కుకునూరుపల్లి జిల్లా పరిషత్‌ ‌పాఠశాలలో మన ఊరు-మన బడిలో 80లక్షల రూపాయలతో బడి పునరుద్దరణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంలో పాఠశాలకు చెందిన విద్యార్థులు మంత్రి హరీష్‌రావుపై పూలు చల్లారు. దీనిపై మంత్రి హరీష్‌రావు జిల్లా విద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో పూలు చల్లించడం ఏంటనీ, మరోసారి ఇలాంటివి పునరావృతం కావొద్దంటూ జిల్లా విద్యాధికారిపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పురాతన ఆలయాలు అభివృద్ధి….గుర్రాలగొందిలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విగ్రహా పునః ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ

ఆవరణలో దాతల సహకారంతో నిర్మించిన 10 ధర్మశాల గదులను ప్రారంభించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. అత్యంత పురాతన దేవాలయం అభివృద్ధి జరగాలని, నిత్య పూజలు జరపాలని, గ్రామస్తుల కోరిక మేర అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆలయానికి వచ్చేలా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ దత్త పుత్రుడు రవీందర్‌రావు శాశ్వత ప్రాతిపదికన రూ.10 లక్షలతో యజ్ఞశాల కట్టిస్తానని చెప్పడం అభినందనీయం అని పేర్కొన్నారు. అంతకు ముందు పురాతన దేవాలయం అభివృద్ధికి మంత్రి ఇది వరకే రూ.12 లక్షలు మంజూరు చేసినట్లు, దేవాలయ పునరుద్ధరణ, ధార్మిక కార్యక్రమంలో హాజరైనందుకు మంత్రికి సర్పంచ్‌ ఆం‌జనేయులు కృతజ్ఞతలు తెలిపారు.
గుర్రాలగొందిలో 5వే మెట్రిక్‌ ‌టన్నుల గోదాం ప్రారంభం
నారాయణరావుపేట మండలం గుర్రాలగొందిలో 5వేల మెట్రిక్‌ ‌టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంను రాష్ట్ర గిడ్డంగుల ఛైర్మన్‌ ‌సాయిచంద్‌తో కలిసి మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం విలేజ్‌ ‌ఫంక్షన్‌ ‌హాల్‌లో కిచెన్‌ ‌షెడ్‌ను ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page