Take a fresh look at your lifestyle.

సిఎం కేసీఆర్‌ ‌స్ఫూర్తితోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తా

నీలం మధు ముదిరాజ్‌ ఆధ్వర్యంలో చిట్కుల్‌లో ఘనంగా ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ
భారీ ర్యాలీ, పెద్దయెత్తున తరలివచ్చిన జనం
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సిఎం కేసీఆర్‌ ‌చిత్ర పటంతో ఏర్పాటు చేసిన వాహనం

పటాన్‌చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: ‌తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, తెలంగాణ ప్రజల్లో నేటికీ ఆ పోరాటపటిమ ఉందనీ, ఆ స్ఫూర్తితోనే ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాననీ టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు, చిట్కూల్‌ ‌సర్పంచి నీలం మధు ముదిరాజ్‌(ఎన్‌ఎంఆర్‌) ‌మరోసారి స్పష్టం చేశారు. నిజాం రజాకార్లను, దేశ్‌ ‌ముఖ్‌లను ఎదిరించిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని, తెలంగాణ వీర వనిత, ధైర్యశాలి చాకలి ఐలమ్మ ఆనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్‌ముఖ్‌లను ఎదుర్కొంది అని, చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి లను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సిఎం కేసీఆర్‌ ‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాకలి ఐలమ్మ జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న నీలం మధు ముదిరాజ్‌ ‌తెలంగాణ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట పటిమ మరవలేనిదని, అలాంటి దీరోదాత్తురాలు చిట్యాల ఐలమ్మను చిట్కుల్‌ ఐలమ్మగా మార్చిన ఘనత టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్‌కు దక్కిందని ఎమ్మెల్సీ బండా ప్రకాష్‌, ‌సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి అభినందించారు. వీరనారీ చాకలి ఐలమ్మ 127వ జయంతి సందర్భంగా సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం చిట్కుల్‌ ‌గ్రామంలో టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు, చిట్కుల్‌ ‌సర్పంచ్‌ ‌నీలం మధు ముదిరాజ్‌ (ఎన్‌ఎంఆర్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సోమవారం ఐలమ్మ కుటుంబ సభ్యులతో ఆవిష్కరింపజేశారు. అంతకుముందు ముత్తంగి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నుండి ఇస్నాపూర్‌ ‌చౌరస్తా వరకు వందలాది మంది కళాకారులు, గోండు నృత్యాలు, మహిళల బోనాల ఆటపాటలతో టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలతో భారీ బైక్‌ ‌ర్యాలీ, ఇస్నాపూర్‌ ‌చౌరస్తా నుండి చిట్కుల్‌ ‌గ్రామం వరకు పాదయాత్ర చేపట్టారు. సిఎం కేసీఆర్‌, ‌చాకలి ఐలమ్మ, డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌భారీ చిత్ర పటాలతో ఏర్పాటు చేసిన రథం బైక్‌ ‌ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

చిట్కుల్‌ ‌గ్రామంలో ఏర్పాటు చేసిన చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఐలమ్మ మునిమనుమరాలు ఆశ్రితతో కలిసి నీలం మధు ముదిరాజ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌, ‌మాజీ ఎమ్మెల్యే కె. సత్యనారాయణ, సీనియర్‌ ‌పాత్రికేయులు పాశం యాదగిరి, ఐలమ్మ వారసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భక్తి కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పోరాట పటిమను ప్రతీ ఒక్కరూ పునికి పుచ్చుకోవాలని సూచించారు. ఐలమ్మ భారీ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్‌లో ఏర్పాటు చేసిన నీలం మధు ముదిరాజ్‌ను అభినందించారు. ఐలమ్మ జీవిత చరిత్రను, పోరాట విధానాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని సభా సాక్షిగా కోరారు. టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్‌ ‌మాట్లాడుతూ పార్టీలు, కులాలకతీతంగా, మానవత్వంతో మంచి పనులు చేయడమే లక్ష్యంగా అందరి సహకారంతో ముందుకెళ్తున్నానన్నారు. సబ్బండ వర్గాలు మద్దతు తెలిపి సభకు రావడంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

ఐలమ్మ పోరాట పటిమ, స్ఫూర్తితో చిట్కుల్‌లో విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు. అంబేద్కర్‌ ‌పేరును అసెంబ్లీకి పెట్టాలని నిర్ణయించిన సిఎం కేసీఆర్‌ ‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క పిలుపునిస్తే వేలాది మంది జనం వచ్చి ఆశీర్వదించిన ప్రజానీకానికి, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు కేటీఆర్‌, ‌హరీష్‌రావు ఇతర కార్యక్రమాలతో బిజీ ఉండటం వల్ల ఇంత మంచి కార్యక్రమానికి రాలేకపోతున్నామని మెసేజ్‌ ‌ద్వారా అభినందించినట్లు ఆయన వివరించారు. భారీ ర్యాలీలో ముఖ్యంగా యువత వేలాదిగా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ ‌చిత్ర పటంతో ఏర్పాటు చేసిన వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పటాన్‌చెరు నలుమూలల నుంచి వందల సంఖ్యలో వాహనాలలో వేలాది మంది ప్రజలు చిట్కూల్‌ ‌సభకు బారులుతీశారు. కేసీఆర్‌, ‌హరీష్‌రావు ఫోటోతో పెద్దయెత్తున ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, ప్లెక్సీలతో రోడ్లన్నీ గులాబీవర్ణం సంతరించుకోవడంతో పాటు చూపరులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రజక సంఘం జాతీయ సంఘాల కో ఆర్డినేటర్‌ ‌మల్లేశ్‌ ‌కుమార్‌ ‌సభకు అధ్యక్షత వహించగా, మన రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పలయ్య, ఐలమ్మ వారసులు చిట్యాల రామచంద్రం, మునిమనువలు సంపత్‌, ‌శ్వేత, ఆశ్రిత, పటాన్‌చెరు నియోజకవర్గ నాయకులు, రజక సంఘాల నాయకులు, ఆయా కుల సంఘాల నాయకులు, ఎన్‌ఎంఆర్‌ ‌యువసేన సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply