- కెసిఆర్ నాయకత్వం వల్ల రాష్ట్రం పురోగమించింది
- ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదు
- పంచాయితీరాజ్ అవార్డుల పంపిణీలో మంత్రి కెటిఆర్
హైదరాబాద్, మార్చి ప్రజాతంత్ర, 31 : నాయకుడు సమర్థుడయితే రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ఇప్పుడు సమర్థుడైన సిఎం కెసిఆర్ ఉండడం వల్లనే ఎంతగానో పురోగమించిందని అన్నారు. గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని తేల్చిచెప్పారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు అవార్డులను అందించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రం వొచ్చిన తర్వాత ఏడాదిన్నర పాటు తాను పంచాయత్ రాజ్ మంత్రిగా పని చేశానని •తెలిపారు. గ్రావి•ణ నేపథ్యం గురించి తనకు చాలా తక్కువ తెలుసునని, పల్లెలకు ఏం కావాలి…పల్లెల్లో ఏ అవసరాలు ఉన్నాయో ముఖ్యమంత్రికి బాగా తెలుసునన్నారు సర్పంచ్ కంటే ఎక్కువగా కేసీఆర్ ఆలోచిస్తారని, గ్రావి•ణ నేపథ్యం నుంచి వొచ్చిన నాయకుడు కాబట్టి.. ప్లలెలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.
ప్లలెకు, ప్లలె ప్రజలకు ఏం కావాలో కేసీఆర్‌కు తెలిసినంతగా దేశంలో ఏ నాయకుడికి తెలియదని, ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్‌ఐఆర్‌డీలో శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు ఏం విధులు నిర్వహించాలో అధ్యయనం చేశారని, తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదన్నారు. మన దేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఐదు అంచెలుగా ఉందని, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయకపోతే అభివృద్ధి జరగదని, ఎంపీటీసీలు గ్రామాలకు మండలానికి మధ్య సమన్వయకర్తగా ఉండాలని, జడ్పీటీసీలు మండలానికి, జిల్లా పరిషత్‌కు మధ్య సమన్వయకర్తగా ఉండాలని అనాంనరు. ఐదంచెల వ్యవస్థలో ఎవరి పాత్ర ఏంటని తెలుసుకోనంత కాలం.. ప్రజాప్రతినిధులైనా, వ్యవస్థ అయినా ఎక్కడ వేసినా గొంగడి అక్కడే అన్న చందంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో గెలవాలనే ఆరాటంతో అనేక హావి•లు ఇస్తామని, ఆ హావి•లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘పంచాయతీ సెక్రటరీ పోస్టు ఖాళీ అయితే తక్షణమే భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు రాష్ట్రంలో పని చేస్తున్నారు. తెలంగాణలో గ్రామాలు ఎలా ఉన్నాయి. వారి సొంత రాష్ట్రాల్లో గ్రామాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకోండి. మాటలు మాట్లాడితే సరిపోదు. ప్రజల వద్దకు పాలన తీసుకుపోవాలనే సంకల్పం ఉండాలి. రాష్ట్ర ఏర్పాటుతోనే వికేంద్రీకరణ ఆగలేదు. అంతటితో ఆగకుండా 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చుకున్నాం. 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో సూక్ష్మంగా పని చేసేందుకు వీలు కలిగింది. వికేంద్రీకరణ వల్ల వేగంగా పనులు జరుగుతాయి. ఇప్పటి వరకు 79 జాతీయ అవార్డులు గెలుచుకున్నాం. గ్రావి•ణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది’ అని కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దాయకార్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు.