Take a fresh look at your lifestyle.

‘‘‌సత్తా’’ లేని చదువులు …. ఎవరిది శాపం..

బిడ్డ పుట్టకముందే స్కూల్స్  అడ్మిషన్‌ ‌కోసం వెతుకుతున్న రోజులివి.. సామజిక స్పృహ తెలిసిన ఏ పేరెంట్‌ అయినా అబ్బాయైతే ఇంజనీర్‌.. అమ్మాయైతే డాక్టర్‌ ఇదో ఊతపదం ల వల్లేవేస్తున్నారు. మన సమాజంలో ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌కోర్సులకు ఉన్న క్రేజ్‌ ఇం‌తా అంతా కాదు.  తల్లితండ్రుల  ఆరాటాన్ని ఆసరాగా చేసుకున్న విద్య సంస్థలు  నేడు ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌విద్యను వ్యాపారమయం చేసిన పరిస్థితి నెలకొంది. ఐఐటీలు, నిట్లు వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో తమ పిల్లలు ఇంజినీరింగ్‌ ‌చదవాలని చాలామంది పేరెంట్స్ ‌తపన పడుతుంటారు. ఇందుకోసం వారు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు.ఈ మధ్య వచ్చిన ‘‘సార్‌ ‘‘ ‌సినిమాలో విద్య కొనుగోలు వ్యవహారాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు.

 కాన్వెంట్‌ ‌కిచిడి :
యూకేజీ మొదలు పై  క్లాస్‌ ‌లోను ప్రత్యేక కోర్స్ ‌లే.. అసలు చదువు నేర్పకుండా కొత్త కోర్స్ ‌ల తో ఆకర్షణ  పదాలతో పిల్లలకు  వలేస్తున్నారు ఒకటో తరగతికి లక్షా పైనే వసూలు చేస్తున్నారు.   అయిదో తరగతి పాసైన విద్యార్ధి దగ్గర నుంచి ఒలంపియాడ్‌ అని ఐఐటీ ఫౌండేషన్‌ అం‌టూ కార్పొరేట్‌ ‌విద్యాసంస్థలు తల్లిదండ్రుల ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి. ఇంత ఖర్చుచేసి ఫౌండేషన్‌ ‌కోర్సుల్లో చేర్పించినా జేఈఈలో, ఎంసెట్లో సరైన ర్యాంకురాని వారు ఎందరో ఉంటారు. ఈ కార్పొరేట్‌  ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకున్న విద్యార్థులెందరో ..   క్రికెట్‌ ‌తప్ప మరేవీ ఆటలు కానట్టు. మానసిక వికాసం లేకుండా ఆటలు టీవీ లోనో మొబైల్‌ ‌లోనో తప్ప మైదానము లో అడుగే పెట్టని వారెందరో . క్రాష్‌ ‌కోర్స్ అని షార్ట్ ‌టర్మ్ అని ఇబ్బడి ముబ్బడిగా ఫీజు లు వసులు చేస్తున్నారు, ఇంజినీరింగ్‌, ‌మెడిసిన్‌ ‌తప్పితే మిగతా కోర్సులేవీ మంచి చదువులు కావన్న ధోరణి సమాజంలో ప్రబలిపోయింది. ఇతర కోర్సుల్లో చేరేవారిని సగటు విద్యార్థులుగా.. తెలివితేటలు లేనివారిగా పరిగణించడం పరిపాటైంది.

దేశవ్యాప్తంగా అందరినోటా నానుతున్న కోర్సు ఇంజనీరింగ్‌..‌సింగిల్‌ ‌విండో కౌన్సెలింగ్లో కాలేజీల సంఖ్య క్రమంగా పడిపోతోంది. ఆల్‌ ఇం‌డియా కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (AICTE)) ఆమోదం పొందిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ లు  ఇంకా ఖరారు చేయనందున ఈ సంవత్సరం వివరాలు ఇంకా వెలువడలేదు. 2022 ఏడాది కౌన్సెలింగ్కు నమోదు చేసుకున్న ఇంజినీరింగ్‌ అభ్యర్థుల సంఖ్య 2.11 లక్షలు దాటింది. 2015-2016లో దేశవ్యాప్తంగా ఉన్న టెక్నికల్‌ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం ఇంజినీరింగ్‌ ‌సీట్లు 18 లక్షలు ఉండగా, 2021-22 నాటికి 13.5 లక్షల సీట్లకు తగ్గాయి. ఇందులో 13.29 లక్షల సీట్లు ఉన్నాయి. భర్తీ అవుతున్నది 7.36 లక్షలు. ఆఖరికి  ఉద్యోగాలు దక్కించుకుంటున్నది 3.90 లక్షలు మాత్రమే. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ)   తాలూకూ లెక్కలివీ. ఆయా కాలేజీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ గణాంకాలు వెల్లడించినప్పటికీ.. వాస్తవానికి ఉద్యోగాలు పొందిన వారు 2.50 లక్షలకు మించకపోవచ్చన్నది నిపుణుల అంచనా. ఇదీ దేశంలో ఇంజినీరింగ్‌ ‌విద్య వాస్తవ పరిస్థితి.AICTE చేస్తిన్న యాజమాన్య సంతుష్టికారణ నిర్ణయాల కారణంగా ఇంజినీరింగ్‌ ‌విద్య రోడ్డున పడింది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.. ఒకప్పుడు ఇంజినీరింగ్‌ ‌కళాశాలకి అనుమతి రావాలంటే 50 ఎకరాల భూమి తప్పనిసరి, కానీ ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే చాలు, అదే విధంగా ఒకప్పుడు 12 నుండి15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ ఉం‌డాలి అనే నిబంధన ఉండేది.. ఆ నిబంధనను కాస్త ఇప్పుడు 18 నుండి 20 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ ఉం‌టే చాలు, ఇలా యాజమాన్యాల పైరవీలకి తలొగ్గి నిబంధనలకు తూట్లుపొడిచి  AICTE   నాణ్యమైన ఇంజినీరింగ్‌ ‌విద్యను విద్యార్థులకు దూరం చేసింది.

image.pngనైపుణ్య లేమి :
సాధారణంగా ఓ ఎలక్ట్రికల్‌ ఇం‌జనీరింగ్‌ ‌చేసిన  విద్యార్ధి ని హౌస్‌ ‌వైరింగ్‌ ‌చేయమన్న ,లేదా ఓ  కంప్యూటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌చేసిన విద్యార్ధి నైనా సిస్టం ఫార్మట్‌ ‌చెయ్యమన్నా ఏ ఎలక్ట్రిసీయాన్‌ ‌నో లేక వై సి టి సి తీసుకెళ్లాలి తప్ప సొంతంగా నేర్చుకున్న విద్యను సామాజిక అవసరాలకు అనుసందించలేక పోతున్నాము. స్కూల్‌ ‌విద్యనుండి డిగ్రీ వరకు రాంక్‌ ‌లు తప్ప ప్రాక్టికల్‌ ‌టైం పాస్‌ ‌సబ్జక్టస్ ‌గ మిగిలిపోయాయి,పుస్తకాలు చదివే ఓపిక లేదు.. ఆన్‌ ‌లైన్‌ ‌మధ్యమాల్లో కాపీ చేయడమే తప్ప స్వతహాగా రాసేది  కష్టమే. మెకానికల్‌ ‌విద్యార్థి  బైక్‌ ‌రిపేర్‌ ‌చెయ్యలేడు..అంటే థర్మల్‌ ఇం‌జినీరింగ్‌ ‌ల్యాబ్‌  ‌లోటూ స్ట్రోక్‌ ‌ఫోర్‌ ‌స్ట్రోక్‌ ఇం‌జిన్‌ ‌ప్రయాగాలు అర్థవంతంగా అర్ధం చేసుకోలేదని అర్ధం .ఇది ఒక విద్యార్థి  లోపమే కాదు..విషయ  పరిజ్ఞానము కలిగిన అనుభవం ఉన్న అధ్యాపక బృందాలు లేకపోవడం ,కాలేజీలు విద్యాలయాలు క్వాలిటీ అధ్యాపకులను నియమించకపోవువటం ,అంగట్లో సరుకుల్ల సర్టిఫికేట్‌ ‌కొనుక్కొని తక్కువ జీతాలకు జాయిన్‌  అవుతున్న వారికి అవకాశం తప్ప రీసెర్చ్ ‌మరియు అకడెమిక్‌ ఎక్స్లెన్స్ ‌పైన దృష్టి పెట్టక పోవడం దురదృష్ట కరం.. అందువల్ల ఓ సత్యనాదెళ్ళ ,సుందర్‌ ‌పిచాయ్‌ ‌లాంటి వాళ్ళు ఈ తరం లో వస్తారన్నది నిరాశే..
సాంకేతిక ప్రతిభకు గ్లోబల్‌ ‌కొరత – నైపుణ్యం కోసం ఒక కొత్త దారి తప్పదు ! క్యాప్జెమినీ అధ్యయనంలో 55% సంస్థలో STEM నైపుణ్యాలకు భారీ గ్యాప్‌ ఉం‌డటమే కాకుండా అది విస్తరిస్తోంది అని అంగీకరించినట్లు వెల్లడించింది.2022 నాటికి కూడా 30% టెక్‌ ఉద్యోగాలు డిజిటల్లో సంబంధిత ప్రతిభ అందుబాటులో లేకపోవడం వల్ల ఖాలీ గానే ఉంటాయని గార్ట్నర్‌ అం‌చనా వేసింది.  ప్రముఖ ఏజెన్సీ ద్వారా సర్వే ద్వారా తెలిసినది ఏంటంటే 40% మంది యజమానులు నైపుణ్యం కలిగిన ప్రతిభను కనుగొనడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2022 లో సాఫ్ట్వేర్‌ ‌డెవలప్మెంట్‌ ఉద్యోగాల సంఖ్య 1.4 మిలియన్‌ ‌కానీ దానికి  అర్హత కలిగిన  దరఖాస్తుదారులు లేరు. డిమాండ్‌ ‌కు సరిపడ సముచితమైన  నైపుణ్యాలుకలిగిన వారు లేరు.
అదే విధంగా  గ్రామీణ వ్యవస్తలో నిరుద్యోగం తాండవిస్తుంది.. చదువుకున్న  వారు  రాజకీయ కార్యకర్తలు గా  తప్ప  నైపుణ్యం కలిగి నలుగురికి ఉపాధి మార్గం చూపే దిశలో లేరు . వ్యవసాయ మరియు దాని అనుబంద  సంస్థాలుకు విద్య మరియు పరిశోధనలు ముమ్మురంగాగ జరపాల్సి ఉంటుంది. వ్యవసాయ రంగం తగినంతగా అందించడంలో విఫలమైతే గ్రీన్‌ ‌గ్రోత్‌ ‌ప్రమాదంలో పడుతుంది. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం విదేశీ ఆహార పదార్థాలు  డిమాండ్‌ ‌పెరిగే అవకాశాలెక్కువ , అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయం ప్రధాన ఆర్థిక పాత్ర పోషిస్తుంది. GDPలో 30% మరియు ఉపాధిలో మూడింట రెండు వంతుల వాటా. గ్లోబల్‌ ‌ఫుడ్‌ అని అంచనా వేసినందున 2050లో ఊహించిన ప్రపంచ జనాభాకు ఆహారం అందించడానికి ఉత్పత్తిని 70% పెంచాలి వ్యవసాయంలో ఆర్థిక సామర్థ్యం మరియు ఉత్పాదకత అవసరం నాస్కామ్‌ ‌ప్రకారం, భారతదేశంలో దాదాపు 12,000 టెక్‌ ‌స్టార్టప్లు ఉన్నాయి. వాటిలో 3,000 డీప్‌ ‌టెక్‌ ‌స్టార్టప్లు. 2026 నాటికి, నాస్కామ్‌ అం‌చనా ప్రకారం భారతీయ ఉత్పత్తి కంపెనీలు  రోజు కి వి13 బిలియన్ల నుండి వి30 బిలియన్ల ఆదాయాన్ని చేరుకుంటాయి. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం నుండి చాలా విజయవంతమైన SaaS-ఆధారిత ఉత్పత్తి సంస్థలు ఉద్భవించాయి. జోహో, ఫ్రెష్వర్కస్, ‌ఖాటాబుక్‌, ‌టాల్వ్యూ మరియు క్లౌడ్కనెక్ట్ ‌వంటి ఉత్పత్తి స్టార్టప్లు ఇప్పటికే భారతదేశం నుండి ప్రపంచ ఉత్పత్తులను నిర్మిస్తున్నాయి. ఉత్పత్తుల విషయానికి వస్తే చాలా టాలెంట్‌ ‌గ్యాప్‌ ఉం‌ది. ఇందులో ఉత్పత్తి నిర్వహణ, రూపకల్పన, విశ్లేషణలు, ఉత్పత్తి మార్కెటింగ్‌ ‌మరియు ఉత్పత్తి విక్రయాలు వంటి విభాగాలు ఉన్నాయి. ఇవి మనం రీ స్కిల్‌ ‌తో  పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలు. 2025 నాటికి భారతదేశం నుండి 50,000 మంది ప్రొడక్ట్ ‌మేనేజర్లను కలిగి ఉండాలనేది మా ఆశయం’’ అని నాస్కామ్‌ ‌ప్రొడక్ట్ ‌కౌన్సిల్‌ ‌చైర్‌ ‌రామ్కుమార్‌ ‌నారాయణన్‌ అన్నారు. అంటే ఉద్యాగాలకు కొదవలేదని అరతమవుతుంది కానీ నైపుణ్యత నిరూపించుకోవడం కష్టమే.
నాల్గవ పారిశ్రామిక విప్లవం కారణంగా, భారీ ఓపెన్‌ ఆన్లైన్‌ ‌కోర్సులు (MOOC)), వర్చువల్‌ ‌క్లాస్రూమ్లు, వర్చువల్‌ ‌లైబ్రరీలు, వర్చువల్‌ ‌లాబొరేటరీలు మరియు వర్చువల్‌ అధ్యాపకులతో సహా విభిన్నంగా విద్య, పరిశోధన మరియు సేవలను అందించే ఆధునిక  మరియు అధునాతన విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఎడ్యుకేషన్‌ 4.0 ‌కూడా పాఠశాలలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలను తమను తాము అప్గ్రేడ్‌ ‌చేసుకునేలా చేస్తుంది. స్మార్ట్ ‌టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌మరియు రోబోటిక్స్ ‌పారిశ్రామిక విప్లవం మన దైనందిన జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందువల్ల, పోటీతత్వాన్ని కొనసాగించడానికి, విద్యా సంస్థలు సైబర్‌-‌భౌతిక వ్యవస్థలు వాస్తవంగా ప్రతి పరిశ్రమను విస్తరించే ప్రపంచానికి విద్యార్థులను సన్నద్ధం చేయాలి.
కెరీర్ను తీర్చిదిద్దుకొనే తరుణం ఇదే..
ఏదో ఒక కోర్సు అనే అలసత్వ ధోరణితో కాకుండా, పకడ్బందీగా ప్లాన్‌ ‌చేసుకుంటే సక్సెస్ఫుల్‌ ‌కెరీర్‌ ‌సాధ్యమే.. విద్యార్థి దశలో అత్యంత కీలకమైన ఈ సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోకుంటే అవస్థలు తప్పవు.దురదృష్టవశాత్తూ , నిరుద్యోగం ప్రాథమిక మరియు మాధ్యమిక స్థాయిలలో పేలవమైన బోధనతో మరియు  ఉన్నత విద్య నాణ్యతకు సంబంధించినదని కొద్దిమంది మాత్రమే గ్రహించారు . ఉపాధిని పొందలేని వారు , వృత్తి విద్యా కోర్సులు , శిక్షణ పొందలేని వారు ఏ స్థాయిలోనైనా ఉపాధి పొందేందుకు వీలుగా , ఆర్థిక స్థోమత కలిగినప్పుడు తిరిగి చదువులకు వెళ్లేందుకు వీలుగా పాఠ్యాంశాలను పునర్వ్యవస్థీకరించాలి . ఇది ఉన్నత విద్యా వ్యవస్థపై ప్రస్తుత భారాన్ని తగ్గించడమే కాకుండా వివిధ స్థాయిలలో ఉపాధి కోసం గుణాత్మక ఉత్పత్తిని కూడా ఉత్పత్తి చేస్తుంది. విద్య ఎప్పటికీ అంతం కాదని, ఇది సుదీర్ఘ ప్రక్రియ అని గుర్తుంచుకోవాలి..!
– డా:కృష్ణ సామల్ల, ప్రొఫెసర్‌ • ‌ఫ్రీ లాన్స్ ‌జర్నలిస్ట్
9705890045

Leave a Reply