Take a fresh look at your lifestyle.

సంఘటిత శక్తి ప్రదర్శిస్తే రైతుదే రాజ్యం

  • రైతులు తలచుకుంటే సాధ్యంకానిదేదీ లేదు
  • నల్లచట్టాల విషయ&ంలో అది రుజువయింది
  • రైతులు చనిపోయినా క్షమాపణ చెప్పని ప్రధాని
  • బిఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర రైతులతో సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 1 : ‌దేశంలో రైతు సంఘటిత శక్తిని ఏకం చేద్దామని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పిలుపునిచ్చారు. రైతులు తలచుకుంటే సాధ్యం కానిదేదీ లేదన్నారు. ఈ విషయాన్ని నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఉద్యమ సమయంలో నిరూపించారని అన్నారు. దేశానికి 14 మంది ప్రధానులు మారినా దేశ ప్రజల తలరాత మాత్రం మారలేదని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ ‌రైతు నేత శరద్‌ ‌జోషి ప్రణీత్‌తో పాటు పలువురు రైతు నేతలు శనివారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ సీఎం కేసీఆర్‌ ‌గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ ‌రావు, ఎంపి బిబి పాటిల్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌లో చేరిన మరాఠా రైతు సంఘం నేతలకు సాదర స్వాగతం అంటూ ఆహ్వానించారు. రైతుల పోరాటం న్యాయబద్ధమైనదని, వారు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏవి• ఉండదన్నారు.

చిత్తశుద్ధితో పని చేస్తే గెలిచి తీరుతామని కెసిఆర్‌ ‌తెలిపారు. తన 50 ఏండ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కున్నానని, తెలంగాణలో ఏం చేశామో వి•రంతా ఒకసారి చూడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కేసీఆర్‌ ‌రైతు నేతలకు సూచించారు. 13 నెలల పాటు దేశ రాజధానిలో రైతులు పోరాడారని కేసీఆర్‌ ఈ ‌సందర్భంగా గుర్తు చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులను ఉగ్రవాదులని, ఖలీస్తానీలని, వేర్పాటువాదులని అన్నారని పేర్కొన్నారు. రైతుల పోరాటంతో మోదీ దిగివచ్చి క్షమాపణ చెప్పారని అన్నారు. 750 మంది రైతులు చనిపోతే ప్రధాని కనీసం స్పందించలేదని సిఎం కెసిఆర్‌ ‌దుయ్యబట్టారు. మన దేశంలో దేనికి కొదవ లేదని, అయినప్పటికీ రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవారని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మహత్యలు ఆగాయన్నారు.

రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు వొచ్చేవని అన్నారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి పండుతుందని, అందులో 56 లక్షల ఎకరాల వరి తెలంగాణలోనే పండుతుందని కేసీఆర్‌ ‌తెలిపారు. తనకు రైతు సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్న ఆయన..మన ఆలోచనల్లో, ఆచరణల్లో నిజాయితీ ఉండాలని, గెలవాలంటే చిత్తశుద్ధి ఉండాలని పిలుపునిచ్చారు. రైతుల పోరాటం న్యాయబద్దమైందని, తలచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏమేం చేశామో ఒకసారి వొచ్చి చూడండంటూ సీఎం కేసీఆర్‌ ‌సవాల్‌ ‌విసిరారు. ఉత్తరప్రదేశ్‌, ‌పంజాబ్‌ ఎన్నికలు ఉండకపోతే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకునేది కాదని సీఎం ఆరోపించారు. రైతుల పోరాటంపై ప్రధాని మోడీ కనీసం సానుభూతి చూపించ లేదన్న ఆయన..

ఆ సమయంలో రైతుల గోస చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ‌కిసాన్‌ ‌సమితి జాతీయ అధ్యక్షుడు గుర్నామ్‌ ‌సింగ్‌ ‌చడునీ, మహారాష్ట్ర కిసాన్‌ ‌సమితి అధ్యక్షుడు మాణిక్‌ ‌కదం, మంత్రులు సత్యవతి రాథోడ్‌, ‌హరీష్‌ ‌రావు, ఎమ్మెల్యే జీవన్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ ‌రెడ్డితో పాటు పలవురు నేతలు పాల్గొన్నారు. అంతకుముందు మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్‌ ‌ప్రతినిధులు, పలువురు నేతలు, ఆయన మద్దతుదారులు హైదరాబాద్‌కు చేరుకుని, భారీ కాన్వాయ్‌తో శరద్‌ ‌జోషి ప్రణీత్‌ ‌తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.

Leave a Reply