మమ్మల్ని గెలికితే వైస్‌ఆర్‌ను తిట్టాల్సి వొస్తది
నేను ఏ పార్టీలో ఉంటే నీకేం•ంట?
వైఎస్ షర్మిలపై జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : టిఆర్‌ఎస్‌లో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న నన్ను పిలిచి నా శీలం(రాజకీయ)ను కరాబు చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ అని ఆ సంగతి వైఎస్ షర్మిలకు తెలియదా? అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కూడా బిజెపి వొదిలిన బాణమేననీ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి సోమవారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…తండ్రి వైఎస్ అడుగు జాడల్లో మీరు(జగన్, షర్మిల)నడుస్తున్నారా..? రాజశేఖర్‌రెడ్డి వారసులుగా జగన్, షర్మిల ఇద్దరూ తండ్రి ఆశయాలు నెరవేర్చుతున్నారా..?అని సూటిగా ప్రశ్నించారు. ఆస్తుల దగ్గర వైఎస్‌కి శ్రద్ధాంజలి ఘటించేటప్పుడు మాత్రం జగన్, షర్మిల ఇద్దరూ కలిసే ఉంటారనీ, రాజకీయం వచ్చే సరికి ఇద్దరు వేరు వేరు అంటున్నారన్నారు. గతంలో షర్మిల జగన్ అన్న వదిలిన బాణం అని అప్పట్లో పాదయాత్ర చేసిందనీ, ఇప్పుడేమో వైఎస్ వదిలిన బాణం అంటున్నారనీ…జగన్, షర్మిల, విజయమ్మ అందరూ బిజెపి డైరెక్షన్‌లోనే ఉన్నారన్నారు.
జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉంటే నీకెందుకు, ఎక్కడ తిరిగితే నీకెందుకు, జగ్గారెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో తెలివి ఉన్న వాళ్లందరికీ తెలుసు అన్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన వైఎస్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది నిజం కాదా అన్నారు. నేను పార్టీలు మార్చిన చరిత్ర అంతా నా ప్రజలకు తెలుసునన్నారు. షర్మిల మమ్మల్ని తిడితే.. మేము వైఎస్‌ను తిట్టాల్సి వస్తుందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పార్టీ మారారు..ఈ విషయం షర్మిలకి తెలియదా?అని అడిగారు. మమ్మల్ని గెలుకుడు ఎందుకని షర్మిలను ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ పార్టీలో బుద్ధిగా పని చేసుకుంటూ ఉన్న తనను కాంగ్రెస్ పార్టీలోకి రావలన్నదే వైఎస్ అని ఆ సంగతి షర్మిలకు తెలియదా?అన్నారు. మీ తండ్రి(వైఎస్) ఏం చేశారనేది తెలుసుకోకుండా షర్మిల మాట్లాడుతుందన్నారు. వైఎస్ చనిపోయినప్పుడు నేను ఏడ్చుకుంటా కూర్చుంటే జగన్, షర్మిల కుటుంబ సభ్యులందరూ ఇంట్లో కూర్చోని ఎవరు సిఎం కావాలనే దాని గురించి స్కెచ్ వేసుకుంటూ ఉన్నారన్నారు. వైఎస్‌పై మాకున్న ప్రేమ, మీకు(షర్మిల) లేదన్నారు.
వైఎస్ అంటే నాలాంటి వాళ్లకు ఎంతో మంది ప్రేమ ఉన్నారనీ, వైఎస్‌ను అభిమానించే వాళ్లలో నేనొక్కడిని అని అలాంటి నాతో వైఎస్ లోపాలు ఎత్తి చూపించేలా చేసింది వైఎస్. షర్మిల అన్నారు. వైఎస్ అభిమానిని అయి నా వ్యక్తిత్వం చెడగొట్టే పని చేస్తే ఉరుకుంటామా?అని హెచ్చరించారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వైఎస్ వదిలిన బాణం అంటే బాగుండేదనీ, అప్పుడేమో జగన్ అన్న వదిలిన బాణం అన్న షర్మిల బాణాలు మార్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అనడమన్నారు, ఎవరిని తిట్టాలి… ఎట్లా టిట్టాలి అనేది ముందు షర్మిల నేర్చుకోవాలన్నారు. వైఎస్ కూతురు అయితే.. మమ్మల్ని తిడితే ఊరుకుంటమా..? తండ్రి బాటలో నడిస్తే గౌరవించే వాళ్లమన్నారు.
షర్మిల బిజెపిని ఇప్పటి వరకు తిట్టినట్టు చూడలేదనీ, ప్రధానమంత్రి మోదీని ఎందుకు ప్రశ్నించడం లేదని షర్మిలను ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల వోటు బ్యాంక్ కాంగ్రెస్‌కు రాకుండా అడ్డుకునే పనిలో షర్మిల ఉన్నారన్నారు. హెల్త్ యూనివర్సిటికీ ఎన్‌టిఆర్ పేరు తీసి వైఎస్‌ఆర్ పెట్టి ఏపి సిఎం జగన్ తప్పుడు చేసిండన్నారు. ఎన్‌టిఆర్ పేరు తీసి వివాదానికి దారి తీయడం తప్పు అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. వివాదాలతో పేరు పెడితే వైఎస్‌కు చెడ్డ పేరు వస్తుందనీ, పదవులు శాశ్వతం కాదనీ, పదవి నుండి దిగిపోయిన తర్వాత తెలుస్తుందనీ పరోక్షంగా జగన్‌నుద్దేశించి అన్నారు. రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేనే మంత్రి అని, టిపిసిసి చీఫ్ రేవంత్ వ్యాఖ్యలలో తప్పు లేదనీ, అందరమూ అన్నీ అంటాం, కాంగ్రెస్‌లో ఇది కామన్ అన్నారు. దసరా పండగ రోజు చాలా విషయాలు మాట్లాడేది ఉందనీ, పార్టీ గురించి మాత్రం కాదనీ జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.



