పెట్టుబడిదారి చేష్టల దిక్కరిస్తూ
శ్రామిక లోకం పిడికిలెత్తిన దినం
తరాల బానిసత్వాన్ని నిరసిస్తూ
శ్రమ శక్తి కదంతొక్కిన సందర్భం
శ్రమ దోపిడికి వ్యతిరేకంగా
కార్మిక వర్గం నినదించిన దినం
నేడే ప్రపంచ కార్మిక దినోత్సవం
చికాగో నగర హేమార్కెట్లో…
అమర వీరుల ఆత్మ బలిదానం
కోట్లాది కార్మిక నెత్తుటి తర్పణం
కళ్లెదుట నిలిపే చారిత్రక దినం
అదే మే డే శ్రామిక మహోత్శవం
ఖనిలో, గనిలో, కర్మాగారాల్లో …
రోజుకు ఇరవ గంటల శ్రమ దోచే
క్యాప్లలిస్టుల.మీద ఉద్యమించి
హక్కులు సాధించుకున్న దినం
నెత్తిటి దారలు కారుతున్నా …
మర పిరంగులు మోగుతున్నా …
గుండెలో తూటాలు దిగుతున్నా
ఉద్యమ బాటను వీడబోమని
విప్లవ మార్గం పట్టిన తరుణం
ఈ చారిత్రక సందర్భంలో…
ఆ అమరవీరుల స్మరిద్దాం
ఆ త్యాగ దనుల కీర్తిద్దాం
ఆ కర్మ యోధుల కొలుద్దాం
కార్మికు, శ్రామిక వీరులకు
పోరు వందనాలు సమర్పిద్దాం
ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ
దిక్కులు పిక్కటిల్లేట్లు నినదిద్దాం
ఆ స్ఫూర్తి బాటలో కలిసి నడుద్దాం
శ్రమైక జీవన ‘‘ప్రపంచం’’ ప్రతిష్ఠిద్దాం
(నేడు ప్రపంచ కార్మికుల
దినోత్సవం సందర్బంగా..)
-కోడిగూటి తిరుపతి
సెల్ : 9573929494





