భరతజాతి ప్రగతిరథ చక్రాలు

పరి’శ్రమ’లు నడిపిన ‘శ్రమ’లు

చెమట చుక్కలేగా రథ కందెనలు !

 

కండలతో బండల్ని సహితం..

పిండి చేసే శక్తి చెలిమలు..

యంత్ర మర్మమెరిగిన కార్మికులు !

 

అతనో మండే శ్రమాగ్ని కణం..

బొగ్గు గనుల్లో వెలుగుల దీపం..

యంత్రాల్ని నడిపే ఇంధనం !

 

శ్రామికుడు సెలవడిగితే..

కార్మికుడు అలిగి తొలిగితే..

ఊపిరాడక జనం తల్లడిల్లు !

 

కార్మికుడెపుడూ కార్యశూరుడే..

శ్రామికుడెపుడూ శ్రమ త్యాగే..

కర్షకుడెపుడూ మట్టిలో మాణిక్యమే !

 

కార్మిక ఆరోగ్యమే దేశ సౌభాగ్యం..

శ్రామిక చైతన్యమే జాతి జాగృతం..

కర్షక ఆనందభాష్పాలే అన్నామృతం !

 

కార్మికుల్ని కృతజ్ఞతల వర్షంతో..

శ్రామికుల్ని అభినందనల వానతో..

కర్షకలోకాన్ని ప్రేమానందాల జల్లుతో..

పాదాభిషేకం చేయాలి పౌరసమాజం..

కాదంటే ఖాయం ఖాళీ కడుపుల లోకం !

 (01 మే ‘అంతర్జాతీయ కార్మిక దినం’ సందర్భంగా)

 – మధుపాళీ

కరీంనగర్‌ – 9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page